SlideShare a Scribd company logo
1 of 24
Download to read offline
T
e
l
u
g
u
‫البشرى‬ ‫مجلة‬ ‫ملحق‬ - )‫التلغوية‬ ‫(باللغة‬ ‫الهالل‬ ‫مجلة‬
1445 Vol 16, Issue: 98, Jan - Mar. 2024
రమదాన్ సన్నాహం ఎందుకు?
సలహాసంప
్ర తింపులు
సలహాసంప
్ర తింపులు
నవ్వు.. నవ్వించు..
ఆరోగ్యంగా జీవించు..
ఎవరు తమ ప
్ర భువు అల్
లా హ్ యేనని పలికి, ఆమాట మీదనే స్
థి రంగా
ఉంటారో వారి (సహాయం) కోసం ద
ై వదూతలు తప్పకుండా
అవతరిస్
తా రు. అప్పుడు వారికి ఇలా ధ
ై ర్యం చెబుతారు: “భయపడకండి.
విచారపడకండి. స్వర
్గ ప
్ర వేశం గురించి మీకు చేసిన వాగ్
దా నం
గుర్తు చేసుకొని ఆనందించండి. మేము ఇహలోకంలోనూ మీకు తోడుగా
ఉన్నాం, ఇప్పుడు పరలోకంలోనూ మీకు తోడుగా ఉంటాం. ఇక్కడ మీరు
కోరుకున్న వస్తు వు లభిస్తుంది. మీరు కోరిందల్
లా మీదే అవుతుంది. గొప్ప
క్షమాశీలి, అమిత దయా మయుడయిన అల్
లా హ్ వ
ై పున లభించనున్న
ఆతిథ్యమిది.” (హామీమ్: 32-30)
ధర్మం మీద నిలకడకు
అల్
లా హ్ ఇస్
తు న్న శుభవార
్త !
jAN -MARCH 2024
10
4
Printing
design: 995 700 34
HOTELINE
‫اليوم‬ ‫نحتاجه‬ ‫ما‬ ‫هي‬ ‫المستقبلية‬ ‫الرؤية‬* ‫المجلة‬ ‫فهرس‬ *
‫النجاح‬ ‫طريق‬ ‫القلب‬ ‫صفوة‬* ‫رمضان؟‬ ‫من‬ ‫نستفيد‬ ‫كيف‬*
‫التوصيات‬* ‫بثمن‬ ‫يقدر‬ ‫ال‬ ‫الشكر‬ ‫ثمن‬* ‫العمل‬ ‫اتقان‬*
‫جوهرة‬ ‫الصمت‬* ‫القرآن‬ ‫أهل‬ ‫صفات‬* ‫المؤمنين‬ ‫بين‬ ‫األخوة‬*
‫بسعادة‬ ‫لتعيش‬ ‫ابتسم‬*
Vol 16, Issue 98
విజయానికి
వారధి వివేకం
14
దార్శనికత
నేటి మన
అవసరం
సంపూర్ణత సంతృప్తి అసంపూర్ణత అసంతృప్తి
4
సంకల్పం చాలా శక్తిమంతమైంది.
సత్యంతోపాటు ఆత్మ విశ్వాసం జతయితే జరిగే
మహత్యాలు ఇన్ని అన్ని కావు. సత్య పథాన
మనం నడవడమే కాక, ఆ సంపూర్ణ సత్యాన్ని
మనం త్రికరణ శుద్ధితో నమ్మాలి. నమ్మకంలో
మనం నిజాయితీపరులుగా ఎదిగిన మీదట
మనం నమ్మిన ఆ పరమ సత్యాన్ని, మనం
పాటించే మహోన్నత ధర్మ విధానాలను, జీవన
సంవిధానాలను ప్రపంచానికి బోధించడానికై
కంకణం కట్టుకోవాలి. ప్రపంచం, అంతిమ
ఆదర్శాల కోసమై, పరమోన్నత ప్రభువైన అల్లాహ్
చే పరిపూర్ణం గావించబడిన ఇస్లాం ధర్మం
కోసమై ఎదురుచూస్తోంది.
శతాబ్దాలుగా ప్రజలకు క్షుద్ర సిద్ధాంతాలు
నేర్పడం జరిగింది. దశాబ్దులుగా నుండి వారు ఈ
బోధనల వల్ల భయభ్రాంతులై, ప్రశాంతత కరువై
అల్లాడిపోతున్నారు.తామూ భయ రహితులం
అవ్వగలం అని, తామూ వెలుగు వెన్నెల్లో తడి
స్నానాలు చేస్తూ పరవశించి పోగలం అని,
తామూ మనసున్న మనీషిలా ఎదగగలం అని
వారికి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత మనదే.
మనం ఎక్కడ పొరబడుతున్నట్లు? మనం
సరిదిద్దుకోవలసింది దేన్ని? మనం
సాధించాలనుకుంటున్న అంశాలన్ని మన
పూర్వీకులు సాధించి చూపినవే. ఈ బాట కొత్తది
ఎంత మాత్రం కాదు. ఈ మార్గాన ప్రవక్తలు,
మహనీయులు, పుణ్యాత్ములు, గొప్పవారెందరో
నడిచి చూపించారు. దీన్ని సాధించడం ఎంత
మాత్రం అసాధ్యమైంది కాదు. సుసా ధ్యమే.
అవును, మనకు ఆవశ్యకమయిన వనరులెన్నో
మనకు లభ్యమయి ఉన్నాయి. 'నేనూ, నా
ప్రవక్త నిశ్చయంగా గెలుపొందుతాం' అన్న
దార్శనికత నేటి
మన అవసరం
2024
2022
దైవవాగ్దానమూ మనకుంది. 'విశ్వమంతటి
వీధుల్లోని గృహాలన్నింటిలోనూ 'ఇస్లాం'
ప్రవేశించి తీరుతుంది' అన్న ప్రవక్త (స) వారి
ప్రవచనమూ మనకుంది.
అయితే సమస్యల్లా మన మనోధర్మంతోనే.
మనం దేన్ని పరిమిత స్థాయిలో తప్ప,
సాధించలేమన్న చిత్తవృత్తి నుంచి మనని మనం
విదుల్చుకోలేకపోతున్నాం. ఆ సంకెళ్ళను
ఛేదించిన నాడే మన ప్రగతి మొదలవుతుంది.
అప్పుడే ‘రక్షణ కల్పించండి' అనే దీన స్థితి నుండి
'రక్షణ కల్పించే' గొప్ప స్థాయికి ఎదగ గలం.
ప్రతి ఒక్క దారిలోనూ ఏదో ఒక అవరోధం చేరి
విప్లవ ప్రవాహాన్ని అడ్డగిస్తోంది. పంజరంలో
చిక్కుబడ్డ శక్తి సామర్థ్యాలు, లోపల్లోపల
కుక్కుకున్న చొరవ బయటపడాలి. మనం ప్రతి
ఒక్కసారీ మన ఆదర్శ నమూనాల్ని ఎవరో
ఒకరి దగ్గర నుంచి అరువు తెచ్చుకోనవసరం
ఇకపైన మనకుండకూడదు. ఆ అక్కరా
మనకు లేదు. అమెరికనేయ, జపనీయ,
చైనీయ, సింగపూరీయ విధానాలు మనకు
పనికొస్తాయని అనుకోవడం ఉత్త వంచన.
మరొకళ్ళ తలుపు తట్టడం వృధా. సిద్ధాంతాల్ని
దిగుమతి చేసుకోవడం, మరొక చోట పుట్టిన
భావాల్ని ఇక్కడ నాట్లు నాటుకోవడం పరిపూర్ణత
లోపించిన సంస్థల సమాజాల లక్షణం. మన
మార్గం పరిపూర్ణ మార్గం. 'మన ధర్మం సంపూర్ణ
ధర్మం. ఈ మార్గ అభ్యున్నతికి బయట ఒనరుల,
సిద్ధాంతాల అవసరం అంతకన్నా లేదు.
మన సమస్యలన్నింటికీ పరిష్కారాల్ని మనమే
ఖుర్ఆన్, హదీసుల ఆధారంగా అన్వేషించడం
ఎంతో ఉత్తమం. మనకు ఎదురవుతున్న ప్రశ్నల
సమాధానాల కోసం బయట వెతుక్కోవడం.
కన్నా దేవుని వచనాలలో, ప్రవక్త (స) వారి
ప్రవచనాలలో, ధర్మపండితుల సలహాల
పరిధిలోనే అన్వేషించడం మంచిది. ఆ పరమ
ప్రభువు సైతం మన నుండి కోరుతున్నది ఇదే.
మనం మన ఆలోచన దారులు మార్చాలి.
మన విధాన నిర్ణయాలు మరింత స్పందన
శీలంగా ఉండాలి. సమర్ధవంతంగా ఉండాలి.
తొక్కిపెట్టబడ్డ ఉత్సాహాలు అప్పుడే పైకి
లేవగలుగుతాయి. వివిధ మస్లక్ల మధ్య,
దృక్పథాల మధ్య సమన్వయమే అందుకు మార్గం.
ఏ మస్లక్ కి ఆ మస్లక్, ఎ దృక్పథానికి ఆ
దృక్పథం తన వ్యక్తిగత ప్రాధాన్యాల్ని, అనుసరించే
పద్ధతికి, తమ పూర్వీ కుల అంధానుసరణకి
స్వస్థి చెప్పాలి. సమీక్షలు సమావేశాలు
ఇప్పుడు అవసరమయిన దానికంటే ఎక్కువే
జరుగుతున్నాయి. అవి కాదు ముఖ్యం- అందరి
మధ్య సహిష్ణుతా భావం, సమైక్యత, సామరస్యం
ఇవి ముఖ్యం.
వనరుల కొరత మన సమస్యలకు కారణం
కానే కాదు. మనం మన ఒనరుల్ని పల్చగా
పరిచేసుకుంటున్నాం. మనం వ్యయపరుస్తున్న
మన వనరులతో మనం ఒక నిర్దిష్ట పద్ధతిలోగాని
ముందుకు పోయినట్టయితే ఇంతకు పది రెట్లు
ఎక్కువ ఫలితాన్ని సాధించగలం. దానికి ఇప్పుడు
పడుతున్న కాలంలో సగం వ్యవధి చాలు.
2024
6 2022
ఒక రైతు వర్షాలు రాక ముందే తన పొలం దున్ని
చదును చేసి సిద్ధంగా ఉంచుతాడు ఎందుకంటే
వర్షం రాగానే పూర్తిగా లబ్ది పొందాలని మంచి పంట
పండించు కోవాలని. అచ్చం అలాగే విశ్వాసులు
కూడా రమదాన్ మాసం రాక ముందే సన్నాహాలు
చేసుకోవాలి ఎందుకంటే రమదాన్ నుండి పూర్తిగా
లబ్ది పొందుటకు మరియు పుణ్యాలు బాగా
సంపాదించుకొనుటకు .
మన ఇంటికి మఖ్య అతిథి వస్తున్నాడు మనకోసం
కానుకలు తెస్తున్నాడు అని తెలిస్తే మనం సంతోష
పడిపోతాము అతిథి రాక ముందే ఇల్లూ వాకిలి
సర్దేస్తాము ఎందకంటే వస్తున్న వ్యక్తి విలువ మనం
తెలుసుకున్నాము కాబట్టి. అచ్చం అలాగే రమదాన్
మాసం వస్తున్నది అన్న విషయం తెలియగానే మనం
సంతోషించాలి రమదాన్ మాసం విలువను దృష్టిలో
ఉంచుకొని రమదాన్ రాక ముందే అంతా సిద్ధం
చేసుకోవాలి.
రమదాన్ ఘనత
రమదాన్ మాసం ప్రారంభం అవగానే స్వర్గం
ద్వారాలు తెరువ బడుతాయి. నరకం ద్వారాలు
మూసివేయ బడుతాయి. ఆకాశం ద్వారాలు తెరువ
బడుతాయి. షైతానులు బేడీలు వేయబడుతాయి.
ఖుర్ఆన్ అవతరణ ఈ నెలలోనే జరిగింది. లైలతుల్
ఖద్ర్ 1000 నెలల కంటే ఘనమైన రాత్రి ఈ
నెలలోనే ఉంది. ఈ నెలలో పాపాలు అధికంగా
మన్నించబడుతాయి. నరకం నుండి విముక్తి
ఇవ్వబడుతుంది. సత్కార్యాల,ఆరాధనల పుణ్యం
అధికంగా ఇవ్వబడుతుంది. ఇలాంటి ఇంకా ఆనేక
ఘనతలు ఉన్నాయి కావున ఈ నెల ప్రారంభానికి
మునుపే మనం ముందస్తు ప్రణాళికలు , సన్నాహాలు
చేసుకోవాలి
సన్నాహం ఎలా ?
రమదాన్ మాసం కొరకు ఎలాంటి సన్నాహాలు
చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం
1-రమదాన్ మాసం దక్కాలని ప్రార్థన చేయాలి.
మన పూర్వికులు సలఫ్ సాలిహీన్ ఆరు నెలల
ముందు నుంచే రమదాన్ మాసం దక్కాలని అల్లాహ్
తో దుఆ చేస్తుండేవారు ఒక్క సారి ఈ నెల దక్కటం
ఎంతటి అదృష్టమో ఈ ఉదాహరణ ద్వారా అర్థం
చేసుకోవచ్చు
ప్రవక్త (స) వారి కాలంలో ఇద్దరు మిత్రులు ఒకేసారి
ఇస్లాం స్వీకరించారు తరువాత ఆ ఇద్దరిలో ఒకరు
షహీద్ అయ్యారు రెండవ మిత్రుడు ఒక సంవత్సరం
తరువాత సాధారణ మరణం పొందారు ఒక రోజు
ప్రవక్త (స) వారి శిష్యులలో తల్హా (ర) కలలో
చూసిన విషయం ఏమిటంటే సహజ మరణం
పొందిన రెండవ మిత్రుడు షహీద్ అయిన మొదటి
మిత్రుణి కంటే ముందు స్వర్గంలో ప్రవేశించారు
ఆయన చూసిన కల ప్రజలకు వినిపించగా అందరూ
ఆశ్చర్యపోయారు ప్రాణ త్యాగము చేసిన వ్యక్తి కంటే
ముందు సాధారణ మరణం పొందిన వ్యక్తి స్వర్గానికి
రమదాన్ సన్నాహం
ఎందుకు? ఎలా ?
అబ్దుర్రఫీఖ్ ఉమరీ
2024
7
2022
చేరటమా అంటూ మాట్లాడుకోసాగారు చిన్నగా ఈ
విషయం ప్రవక్త (స) వరకు చేరింది ప్రవక్త (స)
ఇలా తెలిపారు రెండవ వ్యక్తి కి ఒక సంవత్సరం
ఎక్కువ సమయం దొరికింది అలా అతను ఒక
రమదాన్ మాసం ఎక్కువగా పొందాడు దాని వల్ల
ఇద్దరి పుణ్యాలలో ఎంత వ్యత్యాసం వచ్చిందంటే
భూమి ఆకాశాల మద్ధ్య ఎంత దూరం ఉందో
అంతటి వ్యత్యాసం వచ్చింది ( ఇబ్నుమాజహ్ /
సహీహ్ )
2- రమదాన్ మాసం పొందగానే అల్లాహ్ కు
కృతజ్ఞతలు తెలుపాలి
మనతో పాటు గత సంవత్సరం ఉపవాసాలు
పాటించిన అనేక వ్యక్తులు ఈసారి రమదాన్
వచ్చేసరికి మన మధ్య లేరు మరణించారు మనకు
అల్లాహ్ మరొక రమదాన్ దక్కేలా చేసాడు ఇది
గొప్ప అనుగ్రహం కావున అనుగ్రహాలు దక్కినప్పుడు
అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపటం భక్తుడి కర్తవ్యం
అల్లాహ్ ఈ విధంగా ఆదేశించాడు మీరు కేవలం
అల్లాహ్ ను ఆరాధించేవారే అయితే అల్లాహ్ కు
కృతజ్ఞతలు తెలుపండి ( సూర-2 ఆయతు-172 )
3- రమదాన్ మాసం వస్తుందని సంతోషించాలి
సమాజంలో రెండు రకాల ప్రజలు కనిపిస్తూ
ఉంటారు.
మొదటి రకం = రమదాన్ నెల వస్తున్నదంటే
బాధ పడుతుంటారు కారణం ఏమిటంటే
ఇన్ని రోజులు బాగా తింటూ షికార్లు కొడుతూ
తిరిగేవారు, రమదాన్ నెలలో అలా చేయలేరు
కావున బాధపడుతుంటారు ఈ సంవత్సరం
ఎండలు మండిపోతున్నాయి అంటూ సాకులు చెప్పి
ఉపవాసాలు ఉండలేము అంటూ చెప్పుకుంటూ
తిరుగుతుంటారు .ఇలాంటివారు గమనించాల్సిన
విషయం ఏమిటంటే సహాబాలు రమదాన్
మాసంలో ఉపవాసాలు పాటిస్తూ యద్ధాలు చేసారు
ఉదాహరణకు బద్ర్ యుద్ధం , మక్కా విజయం
లాంటి యుద్ధాలు రమదాన్ మాసంలోనే జరిగాయి
ఈ యుద్ధాలలో పాల్గొన్నప్పటికీ వారు సాకులు
చెప్పలేదు మరి నేడు ఎండలు మండిపోతున్నాయి
అంటున్నవారు ఎండలో ఏమి చేస్తున్నారని ఇలాంటి
సాకులు చెబుతున్నారు ఇది ఎంతటి విశ్వాస
బలహీనతకు నిదర్శనమో మరియు ఇలాంటి
బలహీన విశ్వాసంతో పరలోక సాఫల్యము
సాధ్యమవుతుందా ఆలోచించండి
రెండవ రకం = వరాల వసంతం వస్తున్నది అంటూ
సంతోషిస్తారు సన్నాహాలు చేపడుతారు ఇతరులను
కూడా ప్రోత్సహిస్తారు చూడండి దైవ ప్రవక్త (స)
రమదాన్ మాసం రాగానే సహాబాలతో ఇలా
అనేవారు మీ వద్దకు రమదాన్ మాసం వచ్చేసింది
ఇది చాలా సుభాలు కలిగిన మాసం … అంటూ
ప్రోత్సహించేవారు
4- దృఢమైన సంకల్పం చేసుకోవాలి
రమదాన్ నెలలో కలిగే ప్రయోజనాలను పొందాలనీ
పుణ్యాలు సంపాదించుకొనుటకు బాగా కృషి
చేయాలనీ గట్టిగా సంకల్పం చేసుకోవాలి
ఎందుకంటే మనషి ఏదైనా సాధించాలన్నా ,
మాటపై నిలబడాలన్నా దృఢమైన సంకల్పం కావాలి
సంకల్పం సరైనదైతే అతని కోసం అల్లాహ్ మార్గాలు
తెరుస్తాడు
ఒక పల్లెటూరు వాసి ఇస్లాం స్వీకరించాడు ఆపై
( హిజ్రత్ )వలస ప్రయాణము చేసాడు ఒకసారి
అతనికి యుద్ధప్రాప్తి దక్కింది అతను ప్రవక్త (స)
వద్దకు వచ్చి నేను ఈ సొమ్మును కోరుకోలేదండీ
దైవ మార్గంలో నా ప్రాణాలను అర్పించాలని నేను
సంకల్పించుకొని ఉన్నాను అన్నాడు అతని మాట
విని ప్రవక్త (స) ఇలా పలికారు నీవు అల్లాహ్ కోసం
నిజంగానే అలా సంకల్పించుకొని ఉంటే దానిని
నీకొరకు అల్లాహ్ నిజం చేసి చూపిస్తాడు అన్నారు.
తరువాత అలాగే జరిగింది అతను యద్ధంలో
(షహీద్ అయ్యాడు) వీర మరణం పొందాడు ప్రవక్త
(స) అతని జనాజ నమాజ్ చేయించి దువా చేస్తూ
ఓ అల్లాహ్ నేను ఇతని కొరకు సాక్షిగా ఉన్నాను అని
పలికారు (నసాయి/ సహీహ్)
2024
8 2022
5- పశ్చాత్తాపం చెంది పాపాలకు దూరంగా
ఉండుటకు గట్టి నిర్ణయం తీసుకోవాలి
రమదాన్ కి ముందే పశ్చాత్తాపం చెందాలి మరియు
రమదాన్ మాసం లోనూ ఇదే అలవాటు కొనసాగించాలి
అల్లాహ్ ఆదేశాన్ని గమనించండి విశ్వాసులారా మీరంతా
కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి తద్వారా
మీరు సాఫల్యం పొందవచ్చు
( సూర - 24 ఆయతు - 31 )
6- రమదాన్ మరియు ఉపవాసాల నియమ
నిబంధనలు తెలుసుకొని అవగాహన చేసుకోవాలి
రమదాన్ మాసంలో మనం చేసే ఆరాధనలు ఉపవాసాలు
అల్లాహ్ వద్ద ఆమోదించబడాలి మనకు పుణ్యం పూర్తిగా
లభించాలి అంటే మనం చేసే ప్రతి ఆరాధన తప్పులతో
కలుషితం కాకూడదు కావున ఉపవాసాల మరియు ఇతర
ఆరాధనల నియమాల గురించి అవగాహన చేసుకోవాలి
లేని యడల మన శ్రమ వృధా అయిపోయే ప్రమాదము
ఉంటుంది
అల్లాహ్ ఈవిధంగా ఆదేశిస్తున్నాడు మీకు తెలియకపోతే
జ్ఞానులను అడిగి తెలుసుకోండి
(సూర - 16 ఆయతు - 43 )
7- సంకల్ప శుద్ధి చేసుకోవాలి
షైతాన్ మనలో (రియా) ప్రదర్శనా బుద్ధి కల్పిస్తూ
ఉంటాడు ప్రదర్శనా బుద్ధితో ఏ ఆరాధన చేసినా
ఆమోదించబడదు కావున మనం చేసే ఆరాధనలు
సత్కార్యాలు అన్నీ అల్లాహ్ ప్రసన్నత కోసమే ఉండేలా మన
సంకల్పాన్ని శుద్ధ పరచుకోవాలి
ఇతరుల మెప్పు కోసం ఆరాధన చేస్తే ఇతరులను అల్లాహ్
కు భాగస్వాములుగా కల్పించినట్లు అవుతుంది ఇలా
చేయటం నిషేధం
అల్లాహ్ ఆదేశాన్ని ఒకసారి పరిశీలించండి తన ప్రభువును
కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవారు సత్కార్యాలు
చేయాలి తన ప్రభువు ఆరాధనలో వేరొకరిని భాగస్వామ్యం
కల్పించకూడదు
( సూర- 18 ఆయతు - 110 )
8- ముస్లిముల పట్ల హృదయం సాఫీగా ఉంచుకోవాలి
మన శరీరాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాము
కదా అలాగే మనసును కూడా వెన్నలాగ పరిశుద్ధంగా
ఉంచుకోవాలి హృదయంలో ఎవరి పట్ల ధ్వేషం , అసూయ
, కీడు ఉంచుకోరాదు
హృదయంలో ఇతరుల పట్ల కీడు ఉంచడం ఎంత
ప్రమాదకరమో ప్రవక్త (స) వారి ఈ ఉల్లేఖనం చూడండి
“ షాబాన్ నెల 15వరాత్రి అల్లాహ్ తన దాసుల పట్ల దృష్టి
సారిస్తాడు. తమ దాసులందరి పాపాలను క్షమిస్తాడు
కాని ఇద్దరు వ్యక్తుల పాపాలను క్షమించడు వారిలో
ఒకడు ( షిర్క్ చేయువాడు ) అల్లాహ్ కు బాగాస్వామిని
నిలబెట్టేవాడు రెండో వ్యక్తి మనసులో (ఇతరుల పట్ల) కీడు
గలవాడు ( అస్సహీహ )
9- ఖుర్ఆన్ పారాయణం కొరకు ప్రణాళికను సిద్ధం
చేసుకోవాలి
రమదాన్ మాసం ఖుర్ఆన్ గ్రంధం అవతరించిన మాసం
ఈ మాసంలో ప్రవక్త (స) దైవ దూత జిబ్రయీల్ (అ)
కు ప్రతి రాత్రి ఖుర్ఆన్ చదివి వినిపించేవారు (ముస్లిం)
సహాబాలు వారానికి ఒకసారి ఖుర్ఆన్ పారాయణం పూర్తి
చేసేవారు మన పూర్వికులు (సలఫ్ సాలిహీన్ లు) కూడా
అధికంగా ఖుర్ఆన్ పారాయణం పూర్తి చేసేవారు
10- ( ఇఫ్తారీ ) ఉపవాస విరమణ చేయించుటకు
ప్లాన్ చేసుకోవాలి
ఉపవాసం పుణ్యం అపరిమితం అన్న విషయం మనకు
విదితమే మరి ఇతరులకు ఉపవాస విరమణ చేయించుట
ఇది కూడా గొప్ప పుణ్య కార్యం
ఉపవాస విరమణ చేయించుట గురించి ప్రవక్త (స) ఇలా
తెలిపారు ” ఎవరయితే ఒక ఉపవాసికి ఉపవాస విరమణ
చేయిస్తారో ఉపవాసిపుణ్యంలో ఎలాంటి తగ్గింపు లేకుండా
ఉపవాస విరమణ చేయించిన వారికి కూడా ఉపవాసికి
దక్కేంత పుణ్యం దక్కుతుంది ( తిర్మిజి )
ఆ ప్రకారం ఎంత మంది భక్తులకు మనం ఉపవాస
విరమణ చేయిస్తామో వారి పుణ్యంలో ఎలాంటి కోత
2024
9
2022
లేకుండా మనకు కూడా అన్ని ఉపవాసాల పుణ్యం
అల్లాహ్ ప్రసాదిస్తాడు కావున అల్లాహ్ మనకిచ్చిన
స్థోమత మేరకు కొంత మంది భక్తులకు ( ఇఫ్కారీ )
ఉపవాస విరమణ చేయించుటకు ముందే ప్రణాళిక
చేసుకోవాలి.
11- జకాత్ చెల్లించుటకు , దాన ధర్మాలు
చేయుటకు ప్లాన్ చేసుకోవలెను
మనం నివసిస్తున్న చోట సమాజంలో నిరుపేదలు ,
అనాధలు , వితంతవులు , వికలాంగులు మొదలైన
వారు ఉంటారు అల్లాహ్ మనకిచ్చిన ధనం అది నిర్ధారిత
మోతాదుకు చేరుకుని ఉంటే ఇస్లామీయ నియమాల
ప్రకారం జకాత్ చెల్లించి , మరియు ఎవరిపై జకాత్
విధికాలేదో అలాంటివారు కూడా తమ శక్తి మేరకు
నఫిల్ దాన ధర్మాలు చేసి ఇలాంటి వారిని ఆదరించాలి
ఆదుకొవాలి
12- ఉమ్రా చేయుటకు అవకాశం ఉంటే ప్లాన్
చేసుకోవాలి
రమదాన్ మాసంలో చేసే సత్కార్యాలకు పుణ్యం
అధికంగా ఇవ్వబడుతుందనే విషయం మనం
గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఈ పవిత్ర మాసంలో ఉమ్రా
ఆచరిస్తే ప్రవక్త (స) వారితో కలిసి హజ్జ్ ఆచరించినంత
పుణ్యం ఇవ్వబడుతుందని తెలుపబడింది
ఒకసారి ప్రవక్త (స) వెళ్తూ ఉండగా ఉమ్ము సినాన్ అనే
మహిళ ఎదురయ్యారు ఆమెతో ప్రవక్త (స) మీరు హజ్జ్
ఆచరించుటకు రాలేదేమిటి ? అని ప్రశ్నించారు అందుకు
ఆవిడ ప్రయాణించుటకు సవారీ సౌకర్యము లేనందున
రాలేకపోయాను అని వివరణ ఇచ్చుకున్నారు అప్పుడు
ప్రవక్త (స) ఆవిడతో ఇలా అన్నారు ” రమదాన్ లో
ఆచరించబడిన ఉమ్రా (పుణ్యంలో ) హజ్జ్ కి సమానము
లేక నాతో కలిసి ఆచరించిన హజ్జ్ కి సమానము (
బుఖారీ ముస్లిం )
ఇది ఎంతో గొప్ప సువర్ణ అవకాశము కావున సౌకర్యము
ఉన్నవారు ఈ అవకాశాన్ని చేజార్చుకోరాదు
13- దైవ సందేశం చెరవేర్చుటకు సిద్ధం కావాలి
రమదాన్ మాసం ఒక గొప్ప భక్తి సీజన్ , ఈ మాసంలో
ప్రపంచం నలమూలలా భక్తి వాతావరణం ఏర్పడుతుంది
షైతాన్ లకు బేడీలు వేయబడి ఉంటాయి దైవ వాక్యాల
ప్రభావం ప్రజలపై తొందరగా పడుతుంది ఇన్షా అల్లాహ్
దైవ ప్రవక్త (స) వారి ఈ మాటను గమనించండి “
జుమార్గం ప్రసాదించినా అది నీకొరకు ఎర్రని ఒంటె
కంటే ఘనమైనది అవుతుంది ( బుఖారి )
కాబట్టి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించండి లేదా దైవ
వాక్యాలు వినిపించేవారి వద్దకు పిలుచుకొని రండి భక్తి
పుస్తకాలు పంచండి భక్తి ప్రశంగాలు షేర్ చేయండి ఈ
మహాత్కార్యంలో మీవంతు భాగస్వాములు అవండి
14- రమదాన్ లెక్కించదగిన కొన్ని రోజులు
మాత్రమే గుర్తుంచుకోండి
రమదాన్ మాసం గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు ”
ఇవి ( రమదాన్ ) లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే
( సూర -2 ఆయతు -184 )
కావున ఈ రమదాన్ మాసం దినాలను వృధా
పోనీయవద్దు , ముందస్తు ప్రణాళికలు చేసుకొని పూర్తిగా
సద్వినియోగం చేసుకోవాలి లేదంటే మిగితా రోజులలాగే
ఈ పవిత్ర మాసమూ గడిసి పోతుంది , షైతాన్
మనల్ని పక్కదారి పట్టించే పనిలో ఉన్నాడన్న విషయం
మరవవద్దు
మన సమయం వృధాచేసే మనల్ని పక్కదారి పట్టించే
పరికరాలు టెలిఫోన్ , టెలివిజన్ ల విషయంలో మరింత
జాగ్రత్త పడాలి సుమా
15- ఆత్మ విమర్శ చేసుకోవలెను
” విశ్వసించిన ఓ ప్రజలారా ఆల్లాహ్ కు భయపడుతూ
ఉండండి ప్రతి వ్యక్తీ రేపటి (తీర్పుదినం) కొరకు తానేం
పంపుకున్నాడో చూసుకోవాలి (సూర- 59 ఆయతు-
18 )
అల్లాహ్ దాసులారా ఈ సంవత్సరపు రమదాన్ మాసమే
మన జీవితంలోని చివరి రమదాన్ మాసం ఏమో ?
వచ్చే సంవత్సం రమదాన్ వరకు జీవితం ఉందో లేదో
తెలియదు కావున ఇకనైనా మారుదాం
2024
ఆయన ఎంతో ఉదార స్వభావుడు, సర్వం తెలిసినవాడు.
తాను తలచుకున్న వారికి వివేకం, విచక్షణ జ్ఞానం
ప్రసాదిస్తాడు. వివేకం, విచక్షణల జ్ఞానం లభించినవాడు
ఎంతో అదృష్టవంతుడు. నిజంగా అతనికి అపార
సంపదలు లభించినట్లే. బుద్ధిమంతులు మాత్రమే (మా)
హితోపదేశం గ్రహిస్తారు. (అల్ బఖరః- 268-269)
ఏ విషయంలోనైనా సరే నిజం ఏమిటన్నది ముందుగా
తెలుసుకోవాలి. మనది పోయేదేముందని ఎలాపడితే
ఆలా మాట్లాడకూడదు. చిక్కులు కొనితెచ్చుకోకూడదు.
అందుకు వివేకం ఎంతో అవసరం. వివేకం పుస్తక
పొండిత్యం కాదు. అది దైవదత్త వరం. మనిషిని ఆపదల్లో
చిక్కుకోకుండా తెలివితేటలతో బయటికి చేరుకొనేలా చేసి
చక్కటి దారిచూపే దిక్సూచి.
వివేకం ప్రస్తావన ఖుర్ఆన్ లో
ఆయన మీకు ప్రసాదించిన మహా భాగ్యాలను ఓసారి
గుర్తుకు తెచ్చుకోండి. మీ శ్రేయస్సు కోసం అవతరింప
జేసిన దివ్య గ్రంథాన్ని, (అందులోని) వివేకవంతమైన
విషయాలను గౌరవించడం నేర్చుకోవల సిందిగా ఆయన
మీకు ఉపదేశిస్తున్నాడు. (ప్రతి విషయంలోనూ) దేవుని
పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన సర్వం
ఎరిగినవాడని తెలుసుకోండి. (231)
అవివేకం మూర్ఖతకు నెలవు. ఆపదలకు నిలయం.
వివేకం - అవివేకం బద్ధశత్రువులు. ఆవివేకానికి
వివేకం అంటే ససేమిరా పడదు. ఒకటి అమృతం
మరొకటి హాలాహలం. మనిషికి వివేకం తోడైననాడు
ఎంతటి కష్టతర కార్యమైనా నిరాటంకంగా ముందుకు
సాగిపోతుంది. నిర్విఘ్నంగా నెరవేరుతుంది. వివేకం
లోపిస్తే పండితులు సైతం పరమశుంఠలుగా ప్రవర్తించే
అవకాశం ఉంది. వివేకం వివేచనకు అంకురం, బుద్ధి
కుశలతతో చేపట్టిన ప్రతి కార్యంలో తెలివి పనిచేయడం
ప్రారంభమవుతుంది.
వివేకం పరీక్షించి చూసే వరకు పరులను నమ్మవద్దని
చెబుతుంది. వివేకం అపనమ్మకాన్ని ఆమడదూరాన
ఉంచమంటుంది. ఒంటె కష్టాన్ని, వేడిని, ఆకలిని,
దాహాన్ని ఓర్చుకొని ఇసుక ఎడారుల్లో బరువులను
మోసుకుపోతూ ఉంటుంది. అలాగే వివేకం కష్టాల
కడలిని సులభంగా దాటిస్తుంది. అవివేకం మనిషిని
వెర్రివాణ్ని చేసి అపహాస్యం పాలు చేస్తుంది. వివేకం
ఆశాభావాన్ని రేకెత్తించి భుజం తట్టి వ్యక్తిని కార్యోన్ముఖుణ్ణి
చేస్తుంది. అతడికున్న చాపల్యాన్ని అరికడుతుంది. అవివేకి
దానికి వశుడై నష్టపోతాడు. ఆతిని మితం గావించుకునే
వివేకం మనిషికి నిరంతరం అవసరమే. లక్ష్యాలు,
ఆశయాలు దీనితోనే సాకారం అవుతాయి. సాధారణ
మనిషిని సైతం ఓ ఉన్నత స్థానంలో కూచుండబెట్టేందుకు
వివేకం ఎంతగానో ఉపకరిస్తుంది.
అవివేకం వల్ల తొందరపాటుతనం అధికమవుతుంది.
ఆపదల్ని కొని తెచ్చుకొన్నట్లవుతుంది. కర్తవ్యం అనే
విత్తనాలను వివేకం అనే నీటితో తడిపి చల్లినట్లయితే
ఈ క్రియ శరత్కాలపంటలా సత్ఫలితాలను సంపాదించి
విజయానికి వారధి వివేకం
10
ఉదయభాను
2024
పెడుతుంది. వివేకం కలిగించే విచక్షణే దీనిక్కారణం.
వివేకవంతుడు సన్నిహితుల మాటల్లోని మంచి చెడులను,
మాయమర్మాలను తనకు తానుగా తెలుసుకుంటాడు.
సరైన నిర్ణయం తీసుకొంటాడు.
నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా,
చేరుకోలేమనిపించినా ఎంతో కొంతదూరం
ప్రయాణించాలి. కనీసం చేరుకునే ప్రయత్నం జరగాలి.
లక్ష్యం చేరుకున్నామా లేదా అన్న దాని కంటే ఎటువంటి
కుయుక్తులూ పన్నకుండా ప్రయత్నం చేశామా లేదా
అన్నది ముఖ్యం. విలువైనదాన్ని అందుకుంటున్నామనే
భ్రమలో, ప్రయత్నంలో మన విలువల్ని తాకట్టు
పెట్టకూడదు. జీవితంలో అనేక ఎత్తు పల్లాలుంటాయి.
అన్ని రకాల మనుషులతో, భిన్న పరిస్థితుల్లో ముందుకు
సాగిపోవలసిందే కొన్ని సార్లు సాగిపోవడం తేలిక గానూ,
మరికొన్ని సార్లు కష్టతరంగానూ అనిపిస్తుంది. ఓర్పునకు
పెద్ద పరీక్ష అనిపించవచ్చు. పరిస్థితులు ఎప్పుడూ మనకు
అనుకూలంగా, ప్రశాంతంగా ఉండాలని ఎక్కడుంది.
పరిస్థితులు ఎటువంటిపైనా మన వివేకుతో అతి తక్కువ
ఘర్షణ, ప్రతిఘటనలతో జీవనయాత్ర సాగించగలగడం
ముఖ్యం.
ప్రతీది పరిశీలనాత్మకంగా చూసుకొంటూ జాగ్రత్తగా
ముందుకెళ్లే వారి భవిష్యత్తు బంగారుమయమే.
కుతంత్రపు పరీక్షలకు లొంగిపోయి చేసే ఆలోచనలతో
వివేకం ఉద్భవించదు. వ్యక్తిలో వివేకం ఉదయిస్తే
కలతలు, కలహాలకు చోటుండదు. మనసును,
హృదయాన్ని భారంగా కుంగదీసే మధ్యాలను,
మూర్ఖతలను వదిలి పెట్టి మనిషి ముందు వెళ్లాలి.
వివేకంతో జీవితం మకరందమయం అవుతుంది.
కొన్ని కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు కలగవచ్చు.
అంగీకరించేందుకు మనసు సహకరించకపోవచ్చు.
మన ఆలోచనా దృక్పథం, విలువలు ఏదైనా కావచ్చు.
ఆ విషయంలో సగమే మంచి ఉందనిపించవచ్చు.
మిగతా సగం మనం చెడుగా ముందే భావించి ఓ
నిర్ణయానికి వచ్చేయవచ్చు. సగం సమ్మతం, మీగడా
సగం అసమ్మతం అనిపించినప్పుడు మనుషులతోను,
పరిస్థితులతోను సమస్యలు ఎదురుకావడంలో ఆశ్చర్యం
లేదు. పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. అలాగే
మన 'అహం' గానీ ఇటువంటి సందర్భాల్లో ప్రవేశిస్తే,
'వివేకం' కనుమరుగవుతుంది. విషయాన్ని నిష్పాక్షికంగా
అంచనా వేయగల సామర్థ్యాన్ని కోల్పోతాం. పక్షపాత
వైఖరితో ఆలోచించి అవతలివాళ్లు మనలాంటివారేనన్న
విషయాన్ని మరచిపోతాం. తన పంథాను నెగ్గించు
కోకపోవడమంటే ఓటమిని అంగీకరించడమే
అనుకోవడం తప్పు. అది దాసోహం అయిపోవడమూ
కాదు. సిగ్గు పడాల్సిన విషయంగా గానీ బాధపడాల్సిన
విషయంగా గానీ భావించకూడదు. ఆహాన్ని
జయించగలిగే నిబ్బరం మనలో నిండి ఉన్నందుకు
సంతోషించాలి. అంటే అంతరాత్మ ప్రబోధాన్ని
అనుసరించినట్లు లెక్క ఎదుటివారి అభిప్రాయాల్ని,
ఆలోచనలను అర్ధం చేసుకుని మాట్లాడే ధోరణిని
అలవరచుకోవాలి. అవతలి వారిలోని గొప్పతనాన్ని
చూడటమంటే మనలో అవలక్షణాలున్నాయని కాదు.
కాలాన్ని బట్టి, మనుషుల్ని బట్టి అన్ని విషయాల్లోనూ
మార్పులు చోటు చేసుకుంటాయని గ్రహించాలి. అసలు
విగ్రహాన్ని వదిలేసి దాని నీడ వెనక పరిగెత్తకూడదు.
ఘర్షణకు దారితీయకూడదని భావిస్తే సర్దుబాటు ను
అలవాటు చేసుకోవాలనేది ప్రకృతిలోనే ఉంది...
ఏది మంచి ? ఏది చెడు అనే ఆలోచన కలిగి ఉండటమే
! ఇంకా చెప్పాలంటే హంస పాలను నీటినుండి
వేరుచేసినట్లు , చెడునుండి మంచిని వేరు చేయడమే !
భయంకరమైన గాలి సర్వాన్ని అల్లకల్లోలం చేస్తున్నప్పుడు
ఎంత బలమైన వృక్షమైనా స్థిరంగా ఉండలేక ఆటు
ఇటూ ఊగిపోతుంది. పరిస్థితులకు ఎదుర్కొక తప్పదు.
ఒక గడ్డిపోచ వేగంగా ప్రవహించే నీటిధార ఆగిపోయిన
తరవాత నెమ్మదిగా తలెత్తుతుంది. ఎదుర్కొని మళ్ళీ
నిలబడగలిగే పరిస్థితుల్ని ప్రకృతిలోనే చూస్తుంటాం.
అటువంటిది మేధ కలిగిన మనిషి ఎదుర్కోలేకపోవడం
ఏముంటుంది. ప్రతి ఒక్కరితో సామరస్యంగా ఉంటూ
మనకు మనం ప్రశాంతతను కలగజేసుకోవడం ముఖ్యం.
ప్రకృతి నేర్పిన ఈ సర్దుబాటుతో సబ్యతను సాధిస్తూ,
భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, ఘర్షణలకు
తావివ్వక ప్రశాంత జీవనానికి కృషి చేయాలి. ఆధ్యాత్మిక
ఆలోచనలతో ఇంటా బయటా శాంతిని నెలకొల్పే దిశగా
పయనించాలి. సర్దుబాటుతనం విలువను గుర్తెరిగి మన
విలువల్ని కాపాడుకుంటూనే ముందుకు వెళ్ళాలి.
ప్రాణులకు మంచి-చెడు తెలుసుకొనే శక్తి సహజంగానే
కొంత ఉంటుంది. సింహాన్ని చూడగానే జింకలు
పారిపోతాయి. కుందేళ్లు మొదలైన జంతువులను
చూసి అవి అదరవు బెదరవు. వేటగాడు పన్నిన
వలలో వివేకహీనత వల్ల పశువులు పక్షులు
పడుతుంటాయి. సింహం సైతం ఎరను చూసి
మోసపోయి పట్టుబడుతుంది. ప్రాణులన్నింటిలో
మనిషే తెలివిగలవాడు. కారణం వివేకం! అది లేకపోతే
మనిషి కూడా జంతువులాగా బతకవలసి వస్తుంది.
కొందరు- మోసగాళ్ల చేతిలో పడి, అవివేకంతో సర్వం
పోగొట్టుకోవడం చూస్తుంటాం. అజ్ఞాన స్థితిలో చేసే
నిర్ణయాలు చెడు ఫలితాలనిస్తాయి. బలవంతం, లోభం,
భయం, పక్షపాతం... తదితర దుర్లక్షణాలు వివేకాన్ని
నశింపజేస్తాయి. ఇటువంటి వారికి మంచిమాటలు
రుచించవు.
11
2024
12 2022
మానవుడు దేనికోసం కృషి చేస్తాడో అదే అతనికి
లభిస్తుంది. అతని కృషికి త్వర లోనే గుర్తింపు
లభిస్తుంది. అతనికి దాని ప్రతిఫలం పూర్తిగా
ఇవ్వబడుతుంది.చివరికి (మానవులంతా) నీ ప్రభువు
సన్నిధికే మరలిపోవలసి ఉంది. (మిమ్మల్ని) ఆయనే
నవ్విస్తున్నాడు; ఆయనే ఏడ్పిస్తున్నాడు. ఆయనే (మీ)
జీవన్మరణాలకు మూలకారకుడు. (అన్-నజ్మ్: 39-
44)
మనసుంటే మార్గం ఉంటుంది. ఆశయం కోసం
నిరంతరం కృషి చేసినప్పుడు అనుకున్నది
సాకారమవుతుంది. డబ్బు లేదని చింతించకుండా
ఉన్న వనరులతో సాధన చేస్తే విజయం పాదా
క్రాంతమవుతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
సృష్టికర్త మనుషుల్ని సృష్టిస్తూ... మనం పొందే
ఆనందం, మనశ్శాంతి మనలోనే పెట్టి... దాన్ని
ఎవరు గ్రహిస్తారో వారే సుఖ, సంతోషాలను
పొందుతారు. ఎక్కడెక్కడో అనందాన్ని వెతుక్కుంటూ
నానాపాట్లు పడుతున్న మనం అల్లాహ్ చెప్పిన ఈ
సత్యాన్ని గ్రహించనే లేదు!
విశ్వాసుల హృదయాలు అల్లాహ్ స్మరణ వల్ల
తృప్తి చెందుతాయి. గుర్తుంచుకోండి, అల్లాహ్
స్మరణ వల్లనే మనశ్శాంతి లభిస్తుంది. సత్యాన్ని
విశ్వసించి సదాచార సంపన్నులైనవారు ఎంతో
అదృష్టవంతులు. వారికి అత్యంత శ్రేష్ఠమైన
ప్రతిఫలం లభిస్తుంది.
(అర్-రాద్: 28-29)
ఈ మధ్యకాలంలో మనుషులకు అసహనం
చాలా సహజగుణం అయిపోయింది... దాంతో
స్నేహాలు, బంధుత్వాలు దూరం చేసుకుంటున్నారు.
తమ మాటే నెగ్గాలనే 'అహం' అగ్నికి ఆజ్యం
పోసినట్లు మరింత తోడయ్యింది. ప్రశాంతంగా
ఆలోచించడానికి కూడా సమయం లేకుండా
పరుగెడుతున్న జనం- మనశ్శాంతి కోసం 'ఆర్ట్
ఆఫ్ లివింగ్' కోర్సులలో డబ్బులు కట్టీ మరి
చేరుతున్నారు. మనసారా నవ్వలేకుండా ఉన్నారు...
నలుగురితో కలవలేక పోతున్నారు. కష్ట సుఖాలు
పంచుకోలేకపోతున్నారు... కారణం తెలుసుకుని,
కారణం లేకుండా గీసుకున్న ‘గీత’ని చెరిపేస్తే
ఆనందం మన వెంటే ఉంటుందనేది సత్యం!
ఎలాంటి భేషజాలు లేకుండా 'మనవాళ్ళ'తో
మాట్లాడదాం!... భావాలు పంచుకుందాం...
మనం కనిపెట్టిన ఈ 'మనశ్శాంతి' అందరికీ
పరిచయం చేద్దాం! అసహన రహిత సమాజం
కోసం ఈ రోజు నుంచే ప్రయత్నం చేద్దాం! దైవం
ఏర్పరచిన... మన హృదయాలలోనే వున్న 'ఆ'
'మనశ్శాంతి' కనిపెట్టడానికి నిర్ణయం తీసుకుని,
సుఖసంతోషాలను మన సొంతం చేసుకుందాం!
ఆనందం... ఎవరు కోరుకోరు?... అందరికీ కావాలి!
ఒక్కొక్కరూ ఒక్కో దారిలో వెతుక్కుంటూ ఆనందాన్ని
పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం!
కానీ ఈ ఆనందం ముఖ్యంగా 'మానవ
సంబంధాల'తో ముడిపడి ఉంటుందనే విషయం
ఎంతమంది గ్రహించగలుగుతున్నాం?...
మనసుంటే మార
్ గం ఉంటుంది
మనసుంటే మార
్ గం ఉంటుంది
శాంతి ప్రియ
2024
13
2022
మన చుట్టూ ఉండే బంధు, మిత్రుల పట్ల మన
ప్రవర్తన ఎలా ఉంది?... వాళ్ళతో మన సంబంధాలు
ఎలా ఉన్నాయి? అని ఒకసారి ఆలోచించి...
అందరితో ఏ భేషజాలు లేకుండా మనం ప్రవర్తిస్తే
మనం కచ్చితంగా ఆనందంగా ఉండగలం.
అందరూ కలిసినప్పుడు మనం పంచుకునే ‘గత’
జ్ఞాపకాలు కూడా ఆనందానికి హేతువులు. ఒక
మిత్రున్ని పలకరించడానికి ఈ రోజుల్లో ఎన్నో
మార్గాలున్నాయి. ఒక్క క్షణం తీరిక చేసుకుని,
చేసే పలకరింపు వలన బంధాలు బలపడతాయి.
కొందరు 'నువ్వు ముందా... నేను ముందా' అంటూ
పలకరించడానికి 'అహం' కరిస్తుంటారు! ఇది
ఎంతగా అంటే ఎప్పుడూ కలిసే... మాట్లాడే వాళ్ళు
కొన్ని రోజులు కనబడకపోయేసరికి కూడా ఏమైందీ?
ఎలా ఉన్నారంటూ అస్సలు స్పందించరు. దీని
వలన ఎలాంటి సంబంధాలు కొనసాగవు. ఇది ఇలా
కొనసాగితే చివరకు మనం ఒంటరిగా మిగలడం
ఖాయం! మన భావాలు, భావనలు పంచుకోవడానికి
నలుగురు ఉండాలి... మాట్లాడుకోవాలి... భావాలు
పంచుకోవాలి... ఆనందంగా ఉండాలి!
ఈ గజిబిజీ జీవన విధానంలో సంతోషం
సాంత్వనతోనే వస్తుంది. అది మన ఆత్మీయుల దగ్గరే
దొరుకుతుంది. ఆనందం, సంతోషం 'అలా వచ్చి
ఇలా పోయే’ అలల లాంటివి. అయితే ఆనందం
పొందడానికి అనవసర ప్రయత్నాలు ఏవి చేయాల్సిన
అవసరం లేకుండా...మన చుట్టూ నలుగురు
ఆత్మీయులను సంపాదించుకుని... ఆ 'బంధాన్ని'
బాధ్యతగా భావించి... ‘దాన్ని' కాపాడుకోవ డానికి
మన వంతు ప్రయత్నం చేస్తే... ఆనందం మన
సొంతం అవుతుంది!
అల్లాహ్‌ను తప్ప మరెవర్నీ ఆరాధించరాదని;
తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల, అనాథల పట్ల,
నిరుపేదల పట్ల సద్భావనతో మెలగాలని; ప్రజలతో
(చిరునవ్వు మోముతో) మంచి మాటలు పలకాలని;
ప్రార్థనా వ్యవస్థ (నమాజ్‌) స్థాపించాలని; (పేదల
ఆర్థిక హక్కు) జకాత్‌ చెల్లిస్తూ ఉండా లని మేము
ఇస్రాయీల్‌ సంతతి చేత ప్రమాణం చేయించాం.
(అల్-బఖరహ్ : 83)
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.
ఇప్పుడెంతమంది పాటిస్తున్నారు ఈ సామెతని!
'ఎవరేమనుకుంటే నాకేం! అన్న ధోరణి
పెరిగిపోయింది. నేనేమైనా ఎవరి మీదైనా ఆధారపడి
బతుకుతున్నానా?' అనే 'ఆత్మ రక్షణ' మాటలతో
ఎదుటి వాళ్ళను బాధ పెడుతూ సాగే నేటితరం
ఆలోచనా ధోరణి వలన కలిగే మనస్తాపం తన
దాక వస్తే గాని తెలియదు. ఇక రెండోరకం...
అందరితో మంచి అనిపించుకోవాలని కిందా మీదా
పడుతుంటారు. ఆ క్రమంలో ఎవరి దగ్గరుంటే
వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఎదుటివాళ్ళను చులకన
చేసి మాట్లాడుతూ కాలం గడుపుతుంటారు!
వాస్తవంగా అందరినీ మెప్పించటం చాలా కష్టం!
కానీ ఏవో ప్రయోజనాల కోసం గోడమీది పిల్లి
వాటంలా ప్రవర్తించే వీరు తేనె పూసిన కత్తులు -
'తీయని' మాటలతో అనుకున్నది చేయడం కోసం
ఎంతకైనా తెగిస్తారు. ఈ రెండు రకాల మనుషులను
గమనిస్తూ మనమెలా ఉండాలో నిర్ణయం
తీసుకోవాలి! మనం సంఘజీవులం. నా బ్రతుకు నా
ఇష్టం అని బ్రతికేయలేము. ఈ రోజు ఎదుటివాళ్ళ
అవసరానికి మనం ఉపయోగ పడినప్పుడే... రేపు
మన అవసరానికి వాళ్ళు నిల్చుంటారు. ఇఇక్కడ
ఎవరి వలన ఎవరూ బ్రతకరు... ఎవరూ ఎవరినీ
పోషించరు.
భూమండలంపై సంచరించే ప్రతి ప్రాణికీ ఉపాధినిచ్చే
బాధ్యత అల్లాహ్ పైనే ఉంది. అలాగే ఏప్రాణి
ఎక్కడ నివసిస్తుందో, ఎక్కడ (దానిప్రాణం)
భద్రపరచబడుతుందో కూడా అల్లాహ్ కు మాత్రమే
తెలుసు. (హూద్: 6)
(మీలాగే) ఎన్నో జంతువులు ఉన్నాయి. కాని
అవి తమ ఆహారాన్ని మోసుకొని తిరగడం లేదు.
వాటికి ఆహారం అల్లాహ్ ప్రసాదిస్తున్నాడు. మీకు
ఆహారమిచ్చేవాడు కూడా ఆయనే. ఆయన సమస్త
విషయాలు వింటున్నాడు; సర్వం ఎరిగినవాడు.
(అల్-అన్కబూత్: 60)
కేవలం మనకంటూ ఆప్తులు, సన్నిహితులున్నారనే
ధైర్యం... అంతే! ఈ రోజు మనదే!... మరి రేపటి
పరిస్థితి?... కాస్త ఆలోచిద్దాం!...
2024
14 2022
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ విధేయతలో (ఇస్లాంలో)
సంపూర్ణంగా ప్రవేశించండి. మరియు షై'తాను
అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా, అతడు
మీకు బహిరంగ శత్రువు! (బఖరః - 208)
మనలో ఉన్న చెడు భావాలు, కామ, క్రోధ, లోభ,
మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని
అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి
స్థాయికైనా దిగజారుస్తాయి. ఇవి మనిషి పతనానికి,
ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. వీటిని ఎవరైతే
కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం, సంకుచిత
భావాలతో నిండి ఉంటుంది. మనిషి దుఃఖానికి ఇవి
మొదటి కారణాలు. మనిషికి నిజమైన శత్రువులు వారిలో
ఉండే అరిషడ్వర్గాలు. ఇవి సామాన్యులను పతనం
దిశగా పయనింపజేస్తాయి. మద్యములను అధములుగా
మారుస్తాయి.
ఇవి ఇలాంటి ఇతర అవలక్షణాలు మనిషి లోపలి
జ్ఞానాన్ని కప్పేసి అజ్ఞానం అనే చీకటిని ఏర్పరుస్తాయి.
వాటిని తొలగించుకొంటే, చీకటిపోయి వెలుగు
ప్రవేశించి జ్ఞానోదయమై జీవితానికి మార్గదర్శనం
చేస్తాయి. అందరూ కలిసి ఆలోచిస్తే, కలిసి పనిచేస్తే
అసాధ్యమైన కార్యం కూడా సుసాధ్యమౌతుంది. కలసి
ఉంటె కలదు సుఖం అన్నారు. మనం ఉన్న సమాజానికి
మేలుచేసే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. అలా కలిసి
సాధించిన విజయమే చంద్రయాన్ - 3. కోట్లాదిమంది
భారతీయులు ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన ఒక
అపురూపమైన, మహోన్నతమైన ఘట్టం అంతరిక్షంలో
ఆవిష్కృతమైంది. ఇలాంటి మరిన్ని ఘానా విజయాలు
మన దేశానికి సొంతం అవ్వాలని మనఃపూర్వకముగా
ప్రార్థిద్దాం!
కాలం పరిణామశీలం
మన జీవితంలో అత్యంత ప్రధానమైన భాగం కాలం,
ఇది మూడోది. ఇది ఎల్లప్పుడూ సాగుతూనే ఉంటుంది.
మనం దాన్ని వేగవంతం చేయలేము, మెల్లగా
నడిపించలేము మనం మన శక్తిని నిలువచేసుకోవచ్చు,
వృథా చేయవచ్చు, పెంచుకోవచ్చు, చాలా పెద్దదిగా
చేసుకోవచ్చు, అత్యల్పంగా కూడా చేసుకోవచ్చు. కాని
కాలం మాత్రం జరిగిపోతూనే ఉంటుంది. కాలాన్ని
అనంతం... అమూల్యం... అనూహ్యం... బలీయం...'
వంటి అనేక ఎన్నో రకాలుగా వ్యాఖ్యానించారు
మన పెద్దలు. కాల మహిమను గ్రహించమని,
గౌరవించమని బోధించారు మన గురువులు. అంతా
మన ప్రయోజకత్వమేననుకుని విర్రవీగుతాం. కాలాన్ని
కేలండర్గా మార్చి గోడకూ; గడి యారంగా మార్చి
మణికట్టుకూ బంధించామనుకుంటాం. కానీ గుప్పిట్లో
నీళ్ళు వేళ్ళ సందుల్లోంచి జారిపోయినట్టుగా కాలం
కూడా ఏ బంధనాలకూ లొంగకుండా జారుకుంటూనే
ఉంటుందన్న వాస్తవం మన తెలివిని నిరంతరం
వెక్కిరిస్తూనే ఉంటుంది.
'నేను దైవోపహతుణ్ని, దురదృష్టవంతుణ్ని, లోకంలో
ఇందరుండగా నా నొసటన మాత్రమే కష్టాలు
రాసిపెట్టాడు' అని పదేపదే దైవాన్ని నిందిస్తూ
మానసికంగా కుంగిపోతున్నవారికి
(విశ్వాసులారా!) బాధపడకండి. అధైర్యంతో
క్రుంగిపోకండి. మీరు నిజమైన విశ్వాసులైతే చివరికి
మీరే విజయం సాధిస్తారు. (సత్యాసత్యాల సమరంలో)
మీరేకాదు, వారు కూడా దెబ్బతిన్నారు. (ఆ మాత్రానికే
ధైర్యం కోల్పోవడమా!) ఇవన్నీ మేము ప్రజల మధ్య తిప్పే
కాలపు మిట్టపల్లాలు మాత్రమే. ఆయన మీలో నిజమైన
విశ్వాసులెవరో పరీక్షించడానికి, కొందరిని సత్యానికి
సంపూర్ణత సంతృప్తి
సంపూర్ణత సంతృప్తి
అసంపూర్ణత అసంతృప్తి
అసంపూర్ణత అసంతృప్తి
అబుల్ హసన్
2024
15
2022
సాక్షులు (అమరగతులు)గా చేయడానికి ఈ విధంగా
చేశాడు. అల్లాహ్ దుర్మార్గుల్ని ఎన్నటికీ ప్రేమించడు.
ఆయన ఇలాంటి పరీక్ష ద్వారా నిజ మైన విశ్వాసులు
ఎవరో ఏరివేసి, అవిశ్వాసుల్ని అణచి వేయదలిచాడు.
(ఆల్ ఇమ్రాన్: 139-140) అన్న వచనాలు గొప్ప
ఔషధాలు.
పరీక్షకు మారు పేరు జీవితం
భయం, ఆకలి, ధనప్రాణ, పంటల నష్టాలు కలిగించి
మిమ్మల్ని మేము తప్పని సరిగా పరీక్షిస్తాము. అలాంటి
స్థితిలో సహనం వహించి, ఆపద వచ్చినప్పుడు
“మేము అల్లాహ్ కు చెందినవారలం. ఆయన వైపుకే
పోవలసినవాళ్ళం”అని పలికేవారికి వారిప్రభువు
కారుణ్య కటాక్షాలు లభిస్తాయని శుభవార్త విన్పించు.
అలాంటివారే సన్మార్గగాములు. (155-157)
అంటే జల ప్రవాహంలో ఎంతటివారికైనా తిప్పలు
తప్పవు... ఎలాంటి ప్రవాహాలైనా నడివేసవిలో ఇసుక
దిబ్బలు బయటపడి వెక్కిరించక మానవు. తిరిగి వర్షాలు
రాగానే దిబ్బలు మాయమైనట్లు కాలం కలిసిరాగానే
మానవ జీవన ప్రవాహాలు సాఫీగా సాగిపోతాయి.
'కాలం కలిసిరాకుంటే తాడే పామై కాటేస్తుంది'
అని చెప్పిన మన పెద్దలే 'కలిసొచ్చే కాలానికి
నడిచొచ్చే బిడ్డలు పుడతారు' అని కూడా ధైర్యం
చెప్పారు. ముఖ్యంగా కష్టాలు చుట్టుముట్టి నప్పుడు
'కెరటం నా ఆదర్శం... విరిగి పడినందుకు కాదు,
పడినా లేచినందుకు!' అన్న కవివాక్కును తప్పక
గుర్తుచేసుకొంటూ ఉంటే- మనం ఒకనాటికి తప్పక
విజేతలం అయి తీరుతాం. 'అదను ఎరిగి సేద్యం...
పదును ఎరిగి పైరు' అని సామెతను అమలు పరిస్తే
విజయం మన సొంతం.
వినిర్మల హృదయం విజయానికి నాంది
మనసు మాలిన్యరహతంగా ఉంచుకొంటేనే,
ఇహపరాలకు మార్గం సుగమం అవుతుంది. నిర్మల
మైన మనసులో నిశ్చయ జ్ఞానం కలిగి, దివ్యజ్యోతి
వెలుగుతుంది .మానవ జీవిత గమ్యం ఆ దివ్యజ్యోతి
సంద ర్శనమే. చిత్తశుద్ధి లేకపోతే, శివుని అనుగ్రహం
కలుగ దు. అజ్ఞానపు పొరలు తొలగితే జ్ఞాన ప్రకాశం
కలిగి దివ్యానుభూతి లభిస్తుంది. ఇదే చిరంతనమైనది,
శాశ్వ తమైనది. దీనికి మించిందిలేదు. ఈ విషయాన్ని
గుర్తిం చి మనం రుజుమార్గంలో ప్రయాణించి మానవ
జన్మ సార్ధకతను రుజువు చేసుకోవాలి. కఠిన మనస్కుల
తోనూ కలివిడిగా ఉంటే, మనలోని మృదుత్వానికి పరి
పూర్ణత సిద్ధిస్తుంది. మంటల మాటున మంచు ఉంటుం
దని, కఠిన శిలల్లోనూ నీరు ఉంటుందని తెలుసుకోవ
టమే వివేకం.
ధర్మో రక్షతి రక్షిత
విశ్వాసులారా! మీరు దేవునికి సహాయంచేస్తే దేవుడు
మీకు సహాయం చేస్తాడు. మీ కాళ్ళను (యుద్ధం
నుండి వెనుకంజవేయకుండా) స్థిరంగా ఉంచుతాడు.
(ముహమ్మద్ : 07)
ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది.
మరి ధర్మం అంటే ఏమిటి? ధర్మం కేవలం సూక్తి
ముక్తావళి కాదు. ప్రవచన ప్రభోదాలు అంతకన్నా కాదు.
ఆచరించేది, పాటించేది. మానవాళి ఏం ఆచరించాలి?
"మరియు అల్లాహ్‌ నీకు ఇచ్చిన సంపదతో పరలోక
గృహాన్ని పొందటానికి ప్రయత్నించు. మరియు
ఇహలోకం నుండి లభించే భాగాన్ని మరచిపోకు.
నీకు అల్లాహ్‌ మేలు చేసినట్లు, నీవు కూడా (ప్రజలకు)
మేలుచేయి. భూమిపై కల్లోలం రేకెత్తించటానికి
ప్రయత్నించకు. నిశ్చయంగా అల్లాహ్‌ కల్లోలం
రేకెత్తించేవారిని ప్రేమించడు!" (ఖసస్: 77)
సమాజంలో హింస, దౌర్జన్యం, దుర్మార్గం లేకుండా
చేయాలి. నీవెలా సుఖశాంతులతో వర్థిల్లుతున్నావో
అలానే ఎదుటివారు కూడా ఉండాలని ఆలోచించడం,
వ్యవహరించడం, ఆచరించడం, పాటించడం, ఏమైనా
కావచ్చు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఇతరులూ
నీలాగే హాయిగా జీవించేలా నడుచుకోవడం, బాధితులకు
సహకరించడం, ఆ సహకారంలో ఆనందం, తృప్తి
పొందడం, ధర్మాచరణలో భాగమే అని చెప్పాడు.
సత్కార్యాల్లో, దైవభక్తికి సంబం ధించిన పనుల్లో
పరస్పరం సహకరించుకోండి. అంతేగాని, పాప
కార్యాల్లో, హింసాదౌర్జన్యాల్లో మాత్రం ఎవరితోనూ
సహకరించకూడదు. అల్లాహ్ కు భయపడండి. ఆయన
(నేరస్థుల్ని) చాలా కఠినంగా శిక్షిస్తాడని తెలుసుకోండి.
(మాయిదహ్: 02)
జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి.
సంపూర్ణ జీవితం అంటే వయస్సుకు సంబంధించిన
విషయం కాదు కానీ, సంపూర్ణ జీవితం అంటే మనం
బ్రతికినందుకు ఒక అర్థం ఉండడమే. అంటే దేవుడు
మనికిచ్చిన అవకాశాల్ని సమయానుకూలంగా
శక్యమైనంత వరకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా
ఉపయోగించుకోవటం. అనునిత్యం మనం
సానుకూలంగా ఆలోచించాలి. ప్రవర్తనలో సరియైన
మార్పులు తెచ్చుకోవాలి. పిరికితనం పనికిరాదు.
ధైర్యంగా ఉండాలి. భయందోళనలు దగ్గరకు
రానీయకూడదు. భయంతో చాలా సమస్యలు
వస్తాయి. ప్రతినిత్యం జాగరూకతతో ఉండాలి. జీవితం
అపూర్వమైన కానుక. దానిని సద్వినియోగం చేసుకుని
ఆనందమైన జీవితం గడపాలి.
2024
మన భవిష్యత్‌ మనచేతుల్లోనే ఉంది. స్పష్టతతో,
అవగాహనతో ఉంటే జీవితాన్ని ఆనందంగా తీర్చి
దిద్దుకోవచ్చు. గతం గరించి చింతవద్దు. స్ఫూర్తిగానైనా,
గుణ పాఠంగానైనా తీసుకోవాలి అంతే. భవిష్యత్‌
గురించి లేని పోనీ భయాలు వద్దు. కావాల్సినదల్లా
సరయిన కార్యప్రణాళిక, కార్యాచరణ. ఎల్లప్పుడూ
ఆనందంగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా
ఉండాలి. శారీరకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం
చేసే ప్రతి పనిలోనూ సంపూర్ణంగా జీవించాలి. గతాన్ని
అనుసరించే మన వర్తమానం ఉంటుంది. వర్తమానం
మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
మనం పాటించే ఏ ధర్మాచరణ అయినా సంపూర్ణంగా
పాటించాలి. ఎందుకంటే సగం ఎందులోనూ సంతృపి
ఇవ్వదు.
సగం సగం ప్రేమికులతో కూర్చోవద్దు, సగం సగం
స్నేహితులతో సావాసం చెయ్యోద్దు.
సగం సగం ప్రతిభావంతులను చదవొద్దు.సగం సగం
జీవితం జీవించొద్దు, సగంసగం మరణం చావొద్దు.
ఖలీల్ జిబ్రాన్ అన్నట్టు -
సగం సగం పరిష్కారాన్ని ఆశ్రయించొద్దు, అర్థ సత్యాల
వెంట నడవొద్దు.
సగం సగం కలలు కనొద్దు, సగం సగం ఆశతో
బతకొద్దు
మౌనంగా ఉంటే... చివరి వరకు మౌనంగా ఉండు. మరి
మాట్లాడితే... చివరి వరకు మాట్లాడు .
మాట్లాడాలి కదా అని మౌనంగా ఉండకు, మౌనంగా
ఉన్నాను కదా అని మాట్లాడకు.
నీవు సంతృప్తి చెందితే... నీ సంతృప్తిని వ్యక్తం చెయ్యి.
సగం సంతృప్తి చెందినట్లు నటించకు.
ఒకవేళ నీవు తిరస్కరిస్తే ... నీ తిరస్కరణను
వ్యక్తపరచు, ఎందుకంటే సగం తిరస్కరణ మరో సగానికి
అంగీకరారం.
నువ్వు జీవించని జీవితం సగం, నువ్వు చెప్పలేని మాట
సగం. నువ్వు పూర్తిగా నవ్వలేకపోయిన నవ్వు సగం.
నీకు చేరని ప్రేమ సగం, నీకు తెలియని స్నేహం సగం.
నీకు దగ్గరగా ఉన్న వ్యక్తులను నిన్నే అపరిచితుడిగా
మార్చేది సగం.
నీ సన్నిహిత వ్యక్తులను నీకు అనామకులుగా చేస్తుంది
సగం. సగం చేరుకోవడం అంటే చేరకపోవడమే..
సగం పని చేయడం అంటే పని చెయ్యకపోవడమే. సగం
అంటే నువ్వు ఉన్నా లేనట్టే, లేకున్నా ఉన్నట్టే.
సగం నువ్వు, నువ్వు కానప్పుడు నువ్వు ఎవరో నీకు ఎలా
తెలిసేది?
నాలోని సగం ఏమిటో నాకే తెలియనప్పుడు నాకు
నేను తెలిసినట్టా తెలియనట్టా?
అంటే నేను ఇష్టపడే వ్యక్తి నాలో మిగిలిన సగం కాదు
అనేగా…
నేను ఈ క్షణం ఒక స్థలంలో ఉన్నాను, అదే
సమయంలో మరొక ప్రదేశంలో ఉన్నాను..
ఇది సాధ్యమా?
సగం పానీయం మీ దాహాన్ని తీర్చదు.
సగం భోజనం మీ ఆకలిని తీర్చదు. సగం మార్గం
మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్లదు,
సగం ఆలోచన మీకు ఫలితాలను ఇవ్వదు. నీ నిస్సహాయ
క్షణం సగం, కానీ నువ్వు నిస్సహాయుడవు కాదు.
ఎందుకంటే నువ్వు సగం మనిషివి కావు, నువ్వు పూర్ణ
మనిషివి.
నువ్వు జీవితాన్ని పూర్ణంగా జీవించడానికి
సృష్టించబడ్డావు,
సగం జీవితాన్ని గడపడానికి కాదు.
మనకిషి నిజ స్వరూపం నీకు కన్పించేది నీకు విన్పించేది
మాత్రమే కాదు
నీవు కనలేనిది, నువ్వు వినలేనిది . కూడా.
అందుకే ...
నువ్వు ఒకరి గురించి తెలుసుకోవాలంటే కేవలం అతను
చెప్పిందే నమ్మకు
అతను చెప్పనివి కూడా చాలానే ఉంటాయని
తెలుసుకో...
2024
కృతజ్ఞత అనే తాళం చెవి ద్వారా మనం ప్రతికూల
విషయాలను, అనుకూల విషయాలుగా మార్చుకోవచ్చు.
కృతజ్ఞత అనేది ఒక టీకా మందు. అది ఒక విషనాశిని.
క్రిమి వినాశిని. మన దిన చర్యలో ఏ మంచి విషయం
జరిగినా దానికి కృతజ్ఞత చూపాలి. అదెంత స్వల్పమైన,
అల్పమైన సహాయం అయినా సరే జజాకల్లాహు
ఖైరా (అల్లాహ్ మీకు మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించు
గాక!), తవ్వలల్లాహు ఉమ్రక్ (అల్లాహ్ మీ ఆయుష్షును
పెంచుగాక!), అల్లాహ్ యుస్యిదుక్ (అల్లాహ్ మిమ్మల్ని
భాగ్యవంతులు జాబితాలో చేర్చు గాక!) అనడం
అలవాటు చేసుకోవాలి.
మనం మన రోజువారి జీవితాన్ని అల్లాహ్‌ కృతజ్ఞతతో
ప్రారంభించాలి. మన ఆరోగ్యం,మన పరివారం,
మన ఉద్యోగం, మన స్కిల్స్‌, మన ప్రతిభ, ప్రజలు
మనలో ఇష్ట పడే గుణాలు, మనకు ప్రాప్తమయి ఉన్న
స్థాయి గౌరవం అన్నీ అల్లాహ్‌ కృపాకరమే. నిజంగా
చెప్పాలంటే, అల్లాహ్‌ కృపానుగ్రహాలను మనం
లెక్కించాలన్నా లెక్కించ లేము. కాబట్టి అల్లాహ్‌ ఒక్కొ
అనుగ్రహాన్ని తలచుకొని నిండు మనస్సుతో కృతజ్ఞతలు
తెలుపుకుంటూ ఉండాలి. వాక్కు పరమయిన కృతజ్ఞత,
ధన పరమయిన కృతజ్ఞత, దేహ పరమయిన కృతజ్ఞను
నిత్యం చేసుకోవాలి. కృతజ్ఞతా భావం అనేది శుభాల
తలుపుల్ని తెరిచే గొప్ప సాధనం. అల్లాహ్‌ ఇలా
సెలవిస్తున్నడు: ”ఒక వేళ మీరు కృతజ్ఞులుగా మెలిగితే,
నేను మీకు మరింత అధికంగా ప్రసాదిస్తాను”.
(ఇబ్రాహీమ్‌: 7)
కృతజ్ఞతా భావం వల్ల మనలో సాత్విక భావాలు
చోటు చేసుకొని, సానుకూల దృక్పథం అలవడి ఒక
విధమయిన ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. అది
మనల్ని మరింత బలవంతులుగా తీర్చి దిద్దుతుంది.
మునుపెన్నడూ ఎవ్వరికీ లభించని, ప్రళయం వరకూ
ఇంకెవ్వరికి దక్కని గొప్ప రాజ్యాధికారం కలిగిన
ప్రవక్త సులైమాన్‌ (అ) కృతజ్ఞతా పూర్వకంగా చెప్పిన
వాక్యాలు మనకు ఆదర్శం. ”నా ప్రభూ! నువ్వు నాకూ,
నా తల్లిదండ్రు లకూ ప్రసాదించిన అనుగ్రహాలకుగాను
నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు
ఇవ్వు. నేను నీ మెప్పును పొందే మంచి పనులు చేసేలా
దీవించు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో
చేర్చుకో”.
(అన్నమ్ల్‌: 19)
కృతజ్ఞత "జజాకల్లాహు ఖైరా" చిన్న మాటే. అయితే ఇది
చెప్పేటప్పుడు హృదయ పూర్వకంగా చెప్పాలి. కృతజ్ఞతా
పలుకులు మనం చెప్పేకొద్ది మన హృదయం కృతజ్ఞతతో
నిండి పోవాలి. అప్పుడు మన నుండి ఎక్కువ ప్రేమ
ప్రసరిస్తుంది. కృతజ్ఞత వల్ల నష్టపోయేది ఏమి లేదు. అది
భూప్రపంచంలో సర్వ సంపదలకూ కారణం. మనం ఏ
ఏ అనుగ్రహాలక యితే కృతజ్ఞతా భావంతో ఉంటామో
అవి మనకు మరిన్ని రెట్లు అధికంగా లభిస్తాయి. అంతే
కాదు, జీవితంలో దాపురించే ప్రమాదకర పరిస్థితుల
నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. ఖురాన్ లో ఇలా
ఉంది;
దాని (శిక్ష) బారి నుండి లూత్‌ గృహస్థులు మాత్రమే
సురక్షితంగా ఉన్నారు. వారిని మేము మా అనుగ్రహంతో
(ఆ) రాత్రి తెల్లవారుజామునే అక్కడ్నుంచి వేరే
చోటికి తరలించాం. ఇలా మేము కృతజ్ఞులైనవారికి
ప్రతిఫలమిస్తున్నాం. (ఖమర్‌: 35)
ఈరోజే కృతజ్ఞతని చూపించడం ప్రారంభించి మీ
జీవితాన్ని అద్బుతంగా మార్చుకోండి.
17
కృతజ
్ఞ త మూల్యం
అమూల్యం
నిసార్ ఆబిద్
2024
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka

More Related Content

More from Teacher

The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfTeacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdfTeacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger teluguTeacher
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...Teacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...Teacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptxTeacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptxTeacher
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka Teacher
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు Teacher
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. Teacher
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః Teacher
 
talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ Teacher
 
Nelavanka / నెలవంక త్రైమాసిక
Nelavanka / నెలవంక  త్రైమాసిక Nelavanka / నెలవంక  త్రైమాసిక
Nelavanka / నెలవంక త్రైమాసిక Teacher
 
నిద్రించే, మేల్కొనే మర్యాదలు
నిద్రించే, మేల్కొనే మర్యాదలు నిద్రించే, మేల్కొనే మర్యాదలు
నిద్రించే, మేల్కొనే మర్యాదలు Teacher
 
We proud to be indina /విశ్వంలోనే విశిష్టమైనది నా దేశం
We proud to be indina  /విశ్వంలోనే విశిష్టమైనది నా దేశంWe proud to be indina  /విశ్వంలోనే విశిష్టమైనది నా దేశం
We proud to be indina /విశ్వంలోనే విశిష్టమైనది నా దేశంTeacher
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌Teacher
 
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,Teacher
 

More from Teacher (20)

The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః
 
talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ
 
Nelavanka / నెలవంక త్రైమాసిక
Nelavanka / నెలవంక  త్రైమాసిక Nelavanka / నెలవంక  త్రైమాసిక
Nelavanka / నెలవంక త్రైమాసిక
 
నిద్రించే, మేల్కొనే మర్యాదలు
నిద్రించే, మేల్కొనే మర్యాదలు నిద్రించే, మేల్కొనే మర్యాదలు
నిద్రించే, మేల్కొనే మర్యాదలు
 
We proud to be indina /విశ్వంలోనే విశిష్టమైనది నా దేశం
We proud to be indina  /విశ్వంలోనే విశిష్టమైనది నా దేశంWe proud to be indina  /విశ్వంలోనే విశిష్టమైనది నా దేశం
We proud to be indina /విశ్వంలోనే విశిష్టమైనది నా దేశం
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
 
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
 

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka

  • 1. T e l u g u ‫البشرى‬ ‫مجلة‬ ‫ملحق‬ - )‫التلغوية‬ ‫(باللغة‬ ‫الهالل‬ ‫مجلة‬ 1445 Vol 16, Issue: 98, Jan - Mar. 2024 రమదాన్ సన్నాహం ఎందుకు? సలహాసంప ్ర తింపులు సలహాసంప ్ర తింపులు నవ్వు.. నవ్వించు.. ఆరోగ్యంగా జీవించు..
  • 2. ఎవరు తమ ప ్ర భువు అల్ లా హ్ యేనని పలికి, ఆమాట మీదనే స్ థి రంగా ఉంటారో వారి (సహాయం) కోసం ద ై వదూతలు తప్పకుండా అవతరిస్ తా రు. అప్పుడు వారికి ఇలా ధ ై ర్యం చెబుతారు: “భయపడకండి. విచారపడకండి. స్వర ్గ ప ్ర వేశం గురించి మీకు చేసిన వాగ్ దా నం గుర్తు చేసుకొని ఆనందించండి. మేము ఇహలోకంలోనూ మీకు తోడుగా ఉన్నాం, ఇప్పుడు పరలోకంలోనూ మీకు తోడుగా ఉంటాం. ఇక్కడ మీరు కోరుకున్న వస్తు వు లభిస్తుంది. మీరు కోరిందల్ లా మీదే అవుతుంది. గొప్ప క్షమాశీలి, అమిత దయా మయుడయిన అల్ లా హ్ వ ై పున లభించనున్న ఆతిథ్యమిది.” (హామీమ్: 32-30) ధర్మం మీద నిలకడకు అల్ లా హ్ ఇస్ తు న్న శుభవార ్త !
  • 3. jAN -MARCH 2024 10 4 Printing design: 995 700 34 HOTELINE ‫اليوم‬ ‫نحتاجه‬ ‫ما‬ ‫هي‬ ‫المستقبلية‬ ‫الرؤية‬* ‫المجلة‬ ‫فهرس‬ * ‫النجاح‬ ‫طريق‬ ‫القلب‬ ‫صفوة‬* ‫رمضان؟‬ ‫من‬ ‫نستفيد‬ ‫كيف‬* ‫التوصيات‬* ‫بثمن‬ ‫يقدر‬ ‫ال‬ ‫الشكر‬ ‫ثمن‬* ‫العمل‬ ‫اتقان‬* ‫جوهرة‬ ‫الصمت‬* ‫القرآن‬ ‫أهل‬ ‫صفات‬* ‫المؤمنين‬ ‫بين‬ ‫األخوة‬* ‫بسعادة‬ ‫لتعيش‬ ‫ابتسم‬* Vol 16, Issue 98 విజయానికి వారధి వివేకం 14 దార్శనికత నేటి మన అవసరం సంపూర్ణత సంతృప్తి అసంపూర్ణత అసంతృప్తి
  • 4. 4 సంకల్పం చాలా శక్తిమంతమైంది. సత్యంతోపాటు ఆత్మ విశ్వాసం జతయితే జరిగే మహత్యాలు ఇన్ని అన్ని కావు. సత్య పథాన మనం నడవడమే కాక, ఆ సంపూర్ణ సత్యాన్ని మనం త్రికరణ శుద్ధితో నమ్మాలి. నమ్మకంలో మనం నిజాయితీపరులుగా ఎదిగిన మీదట మనం నమ్మిన ఆ పరమ సత్యాన్ని, మనం పాటించే మహోన్నత ధర్మ విధానాలను, జీవన సంవిధానాలను ప్రపంచానికి బోధించడానికై కంకణం కట్టుకోవాలి. ప్రపంచం, అంతిమ ఆదర్శాల కోసమై, పరమోన్నత ప్రభువైన అల్లాహ్ చే పరిపూర్ణం గావించబడిన ఇస్లాం ధర్మం కోసమై ఎదురుచూస్తోంది. శతాబ్దాలుగా ప్రజలకు క్షుద్ర సిద్ధాంతాలు నేర్పడం జరిగింది. దశాబ్దులుగా నుండి వారు ఈ బోధనల వల్ల భయభ్రాంతులై, ప్రశాంతత కరువై అల్లాడిపోతున్నారు.తామూ భయ రహితులం అవ్వగలం అని, తామూ వెలుగు వెన్నెల్లో తడి స్నానాలు చేస్తూ పరవశించి పోగలం అని, తామూ మనసున్న మనీషిలా ఎదగగలం అని వారికి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత మనదే. మనం ఎక్కడ పొరబడుతున్నట్లు? మనం సరిదిద్దుకోవలసింది దేన్ని? మనం సాధించాలనుకుంటున్న అంశాలన్ని మన పూర్వీకులు సాధించి చూపినవే. ఈ బాట కొత్తది ఎంత మాత్రం కాదు. ఈ మార్గాన ప్రవక్తలు, మహనీయులు, పుణ్యాత్ములు, గొప్పవారెందరో నడిచి చూపించారు. దీన్ని సాధించడం ఎంత మాత్రం అసాధ్యమైంది కాదు. సుసా ధ్యమే. అవును, మనకు ఆవశ్యకమయిన వనరులెన్నో మనకు లభ్యమయి ఉన్నాయి. 'నేనూ, నా ప్రవక్త నిశ్చయంగా గెలుపొందుతాం' అన్న దార్శనికత నేటి మన అవసరం 2024
  • 5. 2022 దైవవాగ్దానమూ మనకుంది. 'విశ్వమంతటి వీధుల్లోని గృహాలన్నింటిలోనూ 'ఇస్లాం' ప్రవేశించి తీరుతుంది' అన్న ప్రవక్త (స) వారి ప్రవచనమూ మనకుంది. అయితే సమస్యల్లా మన మనోధర్మంతోనే. మనం దేన్ని పరిమిత స్థాయిలో తప్ప, సాధించలేమన్న చిత్తవృత్తి నుంచి మనని మనం విదుల్చుకోలేకపోతున్నాం. ఆ సంకెళ్ళను ఛేదించిన నాడే మన ప్రగతి మొదలవుతుంది. అప్పుడే ‘రక్షణ కల్పించండి' అనే దీన స్థితి నుండి 'రక్షణ కల్పించే' గొప్ప స్థాయికి ఎదగ గలం. ప్రతి ఒక్క దారిలోనూ ఏదో ఒక అవరోధం చేరి విప్లవ ప్రవాహాన్ని అడ్డగిస్తోంది. పంజరంలో చిక్కుబడ్డ శక్తి సామర్థ్యాలు, లోపల్లోపల కుక్కుకున్న చొరవ బయటపడాలి. మనం ప్రతి ఒక్కసారీ మన ఆదర్శ నమూనాల్ని ఎవరో ఒకరి దగ్గర నుంచి అరువు తెచ్చుకోనవసరం ఇకపైన మనకుండకూడదు. ఆ అక్కరా మనకు లేదు. అమెరికనేయ, జపనీయ, చైనీయ, సింగపూరీయ విధానాలు మనకు పనికొస్తాయని అనుకోవడం ఉత్త వంచన. మరొకళ్ళ తలుపు తట్టడం వృధా. సిద్ధాంతాల్ని దిగుమతి చేసుకోవడం, మరొక చోట పుట్టిన భావాల్ని ఇక్కడ నాట్లు నాటుకోవడం పరిపూర్ణత లోపించిన సంస్థల సమాజాల లక్షణం. మన మార్గం పరిపూర్ణ మార్గం. 'మన ధర్మం సంపూర్ణ ధర్మం. ఈ మార్గ అభ్యున్నతికి బయట ఒనరుల, సిద్ధాంతాల అవసరం అంతకన్నా లేదు. మన సమస్యలన్నింటికీ పరిష్కారాల్ని మనమే ఖుర్ఆన్, హదీసుల ఆధారంగా అన్వేషించడం ఎంతో ఉత్తమం. మనకు ఎదురవుతున్న ప్రశ్నల సమాధానాల కోసం బయట వెతుక్కోవడం. కన్నా దేవుని వచనాలలో, ప్రవక్త (స) వారి ప్రవచనాలలో, ధర్మపండితుల సలహాల పరిధిలోనే అన్వేషించడం మంచిది. ఆ పరమ ప్రభువు సైతం మన నుండి కోరుతున్నది ఇదే. మనం మన ఆలోచన దారులు మార్చాలి. మన విధాన నిర్ణయాలు మరింత స్పందన శీలంగా ఉండాలి. సమర్ధవంతంగా ఉండాలి. తొక్కిపెట్టబడ్డ ఉత్సాహాలు అప్పుడే పైకి లేవగలుగుతాయి. వివిధ మస్లక్ల మధ్య, దృక్పథాల మధ్య సమన్వయమే అందుకు మార్గం. ఏ మస్లక్ కి ఆ మస్లక్, ఎ దృక్పథానికి ఆ దృక్పథం తన వ్యక్తిగత ప్రాధాన్యాల్ని, అనుసరించే పద్ధతికి, తమ పూర్వీ కుల అంధానుసరణకి స్వస్థి చెప్పాలి. సమీక్షలు సమావేశాలు ఇప్పుడు అవసరమయిన దానికంటే ఎక్కువే జరుగుతున్నాయి. అవి కాదు ముఖ్యం- అందరి మధ్య సహిష్ణుతా భావం, సమైక్యత, సామరస్యం ఇవి ముఖ్యం. వనరుల కొరత మన సమస్యలకు కారణం కానే కాదు. మనం మన ఒనరుల్ని పల్చగా పరిచేసుకుంటున్నాం. మనం వ్యయపరుస్తున్న మన వనరులతో మనం ఒక నిర్దిష్ట పద్ధతిలోగాని ముందుకు పోయినట్టయితే ఇంతకు పది రెట్లు ఎక్కువ ఫలితాన్ని సాధించగలం. దానికి ఇప్పుడు పడుతున్న కాలంలో సగం వ్యవధి చాలు. 2024
  • 6. 6 2022 ఒక రైతు వర్షాలు రాక ముందే తన పొలం దున్ని చదును చేసి సిద్ధంగా ఉంచుతాడు ఎందుకంటే వర్షం రాగానే పూర్తిగా లబ్ది పొందాలని మంచి పంట పండించు కోవాలని. అచ్చం అలాగే విశ్వాసులు కూడా రమదాన్ మాసం రాక ముందే సన్నాహాలు చేసుకోవాలి ఎందుకంటే రమదాన్ నుండి పూర్తిగా లబ్ది పొందుటకు మరియు పుణ్యాలు బాగా సంపాదించుకొనుటకు . మన ఇంటికి మఖ్య అతిథి వస్తున్నాడు మనకోసం కానుకలు తెస్తున్నాడు అని తెలిస్తే మనం సంతోష పడిపోతాము అతిథి రాక ముందే ఇల్లూ వాకిలి సర్దేస్తాము ఎందకంటే వస్తున్న వ్యక్తి విలువ మనం తెలుసుకున్నాము కాబట్టి. అచ్చం అలాగే రమదాన్ మాసం వస్తున్నది అన్న విషయం తెలియగానే మనం సంతోషించాలి రమదాన్ మాసం విలువను దృష్టిలో ఉంచుకొని రమదాన్ రాక ముందే అంతా సిద్ధం చేసుకోవాలి. రమదాన్ ఘనత రమదాన్ మాసం ప్రారంభం అవగానే స్వర్గం ద్వారాలు తెరువ బడుతాయి. నరకం ద్వారాలు మూసివేయ బడుతాయి. ఆకాశం ద్వారాలు తెరువ బడుతాయి. షైతానులు బేడీలు వేయబడుతాయి. ఖుర్ఆన్ అవతరణ ఈ నెలలోనే జరిగింది. లైలతుల్ ఖద్ర్ 1000 నెలల కంటే ఘనమైన రాత్రి ఈ నెలలోనే ఉంది. ఈ నెలలో పాపాలు అధికంగా మన్నించబడుతాయి. నరకం నుండి విముక్తి ఇవ్వబడుతుంది. సత్కార్యాల,ఆరాధనల పుణ్యం అధికంగా ఇవ్వబడుతుంది. ఇలాంటి ఇంకా ఆనేక ఘనతలు ఉన్నాయి కావున ఈ నెల ప్రారంభానికి మునుపే మనం ముందస్తు ప్రణాళికలు , సన్నాహాలు చేసుకోవాలి సన్నాహం ఎలా ? రమదాన్ మాసం కొరకు ఎలాంటి సన్నాహాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం 1-రమదాన్ మాసం దక్కాలని ప్రార్థన చేయాలి. మన పూర్వికులు సలఫ్ సాలిహీన్ ఆరు నెలల ముందు నుంచే రమదాన్ మాసం దక్కాలని అల్లాహ్ తో దుఆ చేస్తుండేవారు ఒక్క సారి ఈ నెల దక్కటం ఎంతటి అదృష్టమో ఈ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు ప్రవక్త (స) వారి కాలంలో ఇద్దరు మిత్రులు ఒకేసారి ఇస్లాం స్వీకరించారు తరువాత ఆ ఇద్దరిలో ఒకరు షహీద్ అయ్యారు రెండవ మిత్రుడు ఒక సంవత్సరం తరువాత సాధారణ మరణం పొందారు ఒక రోజు ప్రవక్త (స) వారి శిష్యులలో తల్హా (ర) కలలో చూసిన విషయం ఏమిటంటే సహజ మరణం పొందిన రెండవ మిత్రుడు షహీద్ అయిన మొదటి మిత్రుణి కంటే ముందు స్వర్గంలో ప్రవేశించారు ఆయన చూసిన కల ప్రజలకు వినిపించగా అందరూ ఆశ్చర్యపోయారు ప్రాణ త్యాగము చేసిన వ్యక్తి కంటే ముందు సాధారణ మరణం పొందిన వ్యక్తి స్వర్గానికి రమదాన్ సన్నాహం ఎందుకు? ఎలా ? అబ్దుర్రఫీఖ్ ఉమరీ 2024
  • 7. 7 2022 చేరటమా అంటూ మాట్లాడుకోసాగారు చిన్నగా ఈ విషయం ప్రవక్త (స) వరకు చేరింది ప్రవక్త (స) ఇలా తెలిపారు రెండవ వ్యక్తి కి ఒక సంవత్సరం ఎక్కువ సమయం దొరికింది అలా అతను ఒక రమదాన్ మాసం ఎక్కువగా పొందాడు దాని వల్ల ఇద్దరి పుణ్యాలలో ఎంత వ్యత్యాసం వచ్చిందంటే భూమి ఆకాశాల మద్ధ్య ఎంత దూరం ఉందో అంతటి వ్యత్యాసం వచ్చింది ( ఇబ్నుమాజహ్ / సహీహ్ ) 2- రమదాన్ మాసం పొందగానే అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపాలి మనతో పాటు గత సంవత్సరం ఉపవాసాలు పాటించిన అనేక వ్యక్తులు ఈసారి రమదాన్ వచ్చేసరికి మన మధ్య లేరు మరణించారు మనకు అల్లాహ్ మరొక రమదాన్ దక్కేలా చేసాడు ఇది గొప్ప అనుగ్రహం కావున అనుగ్రహాలు దక్కినప్పుడు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపటం భక్తుడి కర్తవ్యం అల్లాహ్ ఈ విధంగా ఆదేశించాడు మీరు కేవలం అల్లాహ్ ను ఆరాధించేవారే అయితే అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపండి ( సూర-2 ఆయతు-172 ) 3- రమదాన్ మాసం వస్తుందని సంతోషించాలి సమాజంలో రెండు రకాల ప్రజలు కనిపిస్తూ ఉంటారు. మొదటి రకం = రమదాన్ నెల వస్తున్నదంటే బాధ పడుతుంటారు కారణం ఏమిటంటే ఇన్ని రోజులు బాగా తింటూ షికార్లు కొడుతూ తిరిగేవారు, రమదాన్ నెలలో అలా చేయలేరు కావున బాధపడుతుంటారు ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి అంటూ సాకులు చెప్పి ఉపవాసాలు ఉండలేము అంటూ చెప్పుకుంటూ తిరుగుతుంటారు .ఇలాంటివారు గమనించాల్సిన విషయం ఏమిటంటే సహాబాలు రమదాన్ మాసంలో ఉపవాసాలు పాటిస్తూ యద్ధాలు చేసారు ఉదాహరణకు బద్ర్ యుద్ధం , మక్కా విజయం లాంటి యుద్ధాలు రమదాన్ మాసంలోనే జరిగాయి ఈ యుద్ధాలలో పాల్గొన్నప్పటికీ వారు సాకులు చెప్పలేదు మరి నేడు ఎండలు మండిపోతున్నాయి అంటున్నవారు ఎండలో ఏమి చేస్తున్నారని ఇలాంటి సాకులు చెబుతున్నారు ఇది ఎంతటి విశ్వాస బలహీనతకు నిదర్శనమో మరియు ఇలాంటి బలహీన విశ్వాసంతో పరలోక సాఫల్యము సాధ్యమవుతుందా ఆలోచించండి రెండవ రకం = వరాల వసంతం వస్తున్నది అంటూ సంతోషిస్తారు సన్నాహాలు చేపడుతారు ఇతరులను కూడా ప్రోత్సహిస్తారు చూడండి దైవ ప్రవక్త (స) రమదాన్ మాసం రాగానే సహాబాలతో ఇలా అనేవారు మీ వద్దకు రమదాన్ మాసం వచ్చేసింది ఇది చాలా సుభాలు కలిగిన మాసం … అంటూ ప్రోత్సహించేవారు 4- దృఢమైన సంకల్పం చేసుకోవాలి రమదాన్ నెలలో కలిగే ప్రయోజనాలను పొందాలనీ పుణ్యాలు సంపాదించుకొనుటకు బాగా కృషి చేయాలనీ గట్టిగా సంకల్పం చేసుకోవాలి ఎందుకంటే మనషి ఏదైనా సాధించాలన్నా , మాటపై నిలబడాలన్నా దృఢమైన సంకల్పం కావాలి సంకల్పం సరైనదైతే అతని కోసం అల్లాహ్ మార్గాలు తెరుస్తాడు ఒక పల్లెటూరు వాసి ఇస్లాం స్వీకరించాడు ఆపై ( హిజ్రత్ )వలస ప్రయాణము చేసాడు ఒకసారి అతనికి యుద్ధప్రాప్తి దక్కింది అతను ప్రవక్త (స) వద్దకు వచ్చి నేను ఈ సొమ్మును కోరుకోలేదండీ దైవ మార్గంలో నా ప్రాణాలను అర్పించాలని నేను సంకల్పించుకొని ఉన్నాను అన్నాడు అతని మాట విని ప్రవక్త (స) ఇలా పలికారు నీవు అల్లాహ్ కోసం నిజంగానే అలా సంకల్పించుకొని ఉంటే దానిని నీకొరకు అల్లాహ్ నిజం చేసి చూపిస్తాడు అన్నారు. తరువాత అలాగే జరిగింది అతను యద్ధంలో (షహీద్ అయ్యాడు) వీర మరణం పొందాడు ప్రవక్త (స) అతని జనాజ నమాజ్ చేయించి దువా చేస్తూ ఓ అల్లాహ్ నేను ఇతని కొరకు సాక్షిగా ఉన్నాను అని పలికారు (నసాయి/ సహీహ్) 2024
  • 8. 8 2022 5- పశ్చాత్తాపం చెంది పాపాలకు దూరంగా ఉండుటకు గట్టి నిర్ణయం తీసుకోవాలి రమదాన్ కి ముందే పశ్చాత్తాపం చెందాలి మరియు రమదాన్ మాసం లోనూ ఇదే అలవాటు కొనసాగించాలి అల్లాహ్ ఆదేశాన్ని గమనించండి విశ్వాసులారా మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు ( సూర - 24 ఆయతు - 31 ) 6- రమదాన్ మరియు ఉపవాసాల నియమ నిబంధనలు తెలుసుకొని అవగాహన చేసుకోవాలి రమదాన్ మాసంలో మనం చేసే ఆరాధనలు ఉపవాసాలు అల్లాహ్ వద్ద ఆమోదించబడాలి మనకు పుణ్యం పూర్తిగా లభించాలి అంటే మనం చేసే ప్రతి ఆరాధన తప్పులతో కలుషితం కాకూడదు కావున ఉపవాసాల మరియు ఇతర ఆరాధనల నియమాల గురించి అవగాహన చేసుకోవాలి లేని యడల మన శ్రమ వృధా అయిపోయే ప్రమాదము ఉంటుంది అల్లాహ్ ఈవిధంగా ఆదేశిస్తున్నాడు మీకు తెలియకపోతే జ్ఞానులను అడిగి తెలుసుకోండి (సూర - 16 ఆయతు - 43 ) 7- సంకల్ప శుద్ధి చేసుకోవాలి షైతాన్ మనలో (రియా) ప్రదర్శనా బుద్ధి కల్పిస్తూ ఉంటాడు ప్రదర్శనా బుద్ధితో ఏ ఆరాధన చేసినా ఆమోదించబడదు కావున మనం చేసే ఆరాధనలు సత్కార్యాలు అన్నీ అల్లాహ్ ప్రసన్నత కోసమే ఉండేలా మన సంకల్పాన్ని శుద్ధ పరచుకోవాలి ఇతరుల మెప్పు కోసం ఆరాధన చేస్తే ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా కల్పించినట్లు అవుతుంది ఇలా చేయటం నిషేధం అల్లాహ్ ఆదేశాన్ని ఒకసారి పరిశీలించండి తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవారు సత్కార్యాలు చేయాలి తన ప్రభువు ఆరాధనలో వేరొకరిని భాగస్వామ్యం కల్పించకూడదు ( సూర- 18 ఆయతు - 110 ) 8- ముస్లిముల పట్ల హృదయం సాఫీగా ఉంచుకోవాలి మన శరీరాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాము కదా అలాగే మనసును కూడా వెన్నలాగ పరిశుద్ధంగా ఉంచుకోవాలి హృదయంలో ఎవరి పట్ల ధ్వేషం , అసూయ , కీడు ఉంచుకోరాదు హృదయంలో ఇతరుల పట్ల కీడు ఉంచడం ఎంత ప్రమాదకరమో ప్రవక్త (స) వారి ఈ ఉల్లేఖనం చూడండి “ షాబాన్ నెల 15వరాత్రి అల్లాహ్ తన దాసుల పట్ల దృష్టి సారిస్తాడు. తమ దాసులందరి పాపాలను క్షమిస్తాడు కాని ఇద్దరు వ్యక్తుల పాపాలను క్షమించడు వారిలో ఒకడు ( షిర్క్ చేయువాడు ) అల్లాహ్ కు బాగాస్వామిని నిలబెట్టేవాడు రెండో వ్యక్తి మనసులో (ఇతరుల పట్ల) కీడు గలవాడు ( అస్సహీహ ) 9- ఖుర్ఆన్ పారాయణం కొరకు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి రమదాన్ మాసం ఖుర్ఆన్ గ్రంధం అవతరించిన మాసం ఈ మాసంలో ప్రవక్త (స) దైవ దూత జిబ్రయీల్ (అ) కు ప్రతి రాత్రి ఖుర్ఆన్ చదివి వినిపించేవారు (ముస్లిం) సహాబాలు వారానికి ఒకసారి ఖుర్ఆన్ పారాయణం పూర్తి చేసేవారు మన పూర్వికులు (సలఫ్ సాలిహీన్ లు) కూడా అధికంగా ఖుర్ఆన్ పారాయణం పూర్తి చేసేవారు 10- ( ఇఫ్తారీ ) ఉపవాస విరమణ చేయించుటకు ప్లాన్ చేసుకోవాలి ఉపవాసం పుణ్యం అపరిమితం అన్న విషయం మనకు విదితమే మరి ఇతరులకు ఉపవాస విరమణ చేయించుట ఇది కూడా గొప్ప పుణ్య కార్యం ఉపవాస విరమణ చేయించుట గురించి ప్రవక్త (స) ఇలా తెలిపారు ” ఎవరయితే ఒక ఉపవాసికి ఉపవాస విరమణ చేయిస్తారో ఉపవాసిపుణ్యంలో ఎలాంటి తగ్గింపు లేకుండా ఉపవాస విరమణ చేయించిన వారికి కూడా ఉపవాసికి దక్కేంత పుణ్యం దక్కుతుంది ( తిర్మిజి ) ఆ ప్రకారం ఎంత మంది భక్తులకు మనం ఉపవాస విరమణ చేయిస్తామో వారి పుణ్యంలో ఎలాంటి కోత 2024
  • 9. 9 2022 లేకుండా మనకు కూడా అన్ని ఉపవాసాల పుణ్యం అల్లాహ్ ప్రసాదిస్తాడు కావున అల్లాహ్ మనకిచ్చిన స్థోమత మేరకు కొంత మంది భక్తులకు ( ఇఫ్కారీ ) ఉపవాస విరమణ చేయించుటకు ముందే ప్రణాళిక చేసుకోవాలి. 11- జకాత్ చెల్లించుటకు , దాన ధర్మాలు చేయుటకు ప్లాన్ చేసుకోవలెను మనం నివసిస్తున్న చోట సమాజంలో నిరుపేదలు , అనాధలు , వితంతవులు , వికలాంగులు మొదలైన వారు ఉంటారు అల్లాహ్ మనకిచ్చిన ధనం అది నిర్ధారిత మోతాదుకు చేరుకుని ఉంటే ఇస్లామీయ నియమాల ప్రకారం జకాత్ చెల్లించి , మరియు ఎవరిపై జకాత్ విధికాలేదో అలాంటివారు కూడా తమ శక్తి మేరకు నఫిల్ దాన ధర్మాలు చేసి ఇలాంటి వారిని ఆదరించాలి ఆదుకొవాలి 12- ఉమ్రా చేయుటకు అవకాశం ఉంటే ప్లాన్ చేసుకోవాలి రమదాన్ మాసంలో చేసే సత్కార్యాలకు పుణ్యం అధికంగా ఇవ్వబడుతుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఈ పవిత్ర మాసంలో ఉమ్రా ఆచరిస్తే ప్రవక్త (స) వారితో కలిసి హజ్జ్ ఆచరించినంత పుణ్యం ఇవ్వబడుతుందని తెలుపబడింది ఒకసారి ప్రవక్త (స) వెళ్తూ ఉండగా ఉమ్ము సినాన్ అనే మహిళ ఎదురయ్యారు ఆమెతో ప్రవక్త (స) మీరు హజ్జ్ ఆచరించుటకు రాలేదేమిటి ? అని ప్రశ్నించారు అందుకు ఆవిడ ప్రయాణించుటకు సవారీ సౌకర్యము లేనందున రాలేకపోయాను అని వివరణ ఇచ్చుకున్నారు అప్పుడు ప్రవక్త (స) ఆవిడతో ఇలా అన్నారు ” రమదాన్ లో ఆచరించబడిన ఉమ్రా (పుణ్యంలో ) హజ్జ్ కి సమానము లేక నాతో కలిసి ఆచరించిన హజ్జ్ కి సమానము ( బుఖారీ ముస్లిం ) ఇది ఎంతో గొప్ప సువర్ణ అవకాశము కావున సౌకర్యము ఉన్నవారు ఈ అవకాశాన్ని చేజార్చుకోరాదు 13- దైవ సందేశం చెరవేర్చుటకు సిద్ధం కావాలి రమదాన్ మాసం ఒక గొప్ప భక్తి సీజన్ , ఈ మాసంలో ప్రపంచం నలమూలలా భక్తి వాతావరణం ఏర్పడుతుంది షైతాన్ లకు బేడీలు వేయబడి ఉంటాయి దైవ వాక్యాల ప్రభావం ప్రజలపై తొందరగా పడుతుంది ఇన్షా అల్లాహ్ దైవ ప్రవక్త (స) వారి ఈ మాటను గమనించండి “ జుమార్గం ప్రసాదించినా అది నీకొరకు ఎర్రని ఒంటె కంటే ఘనమైనది అవుతుంది ( బుఖారి ) కాబట్టి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించండి లేదా దైవ వాక్యాలు వినిపించేవారి వద్దకు పిలుచుకొని రండి భక్తి పుస్తకాలు పంచండి భక్తి ప్రశంగాలు షేర్ చేయండి ఈ మహాత్కార్యంలో మీవంతు భాగస్వాములు అవండి 14- రమదాన్ లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే గుర్తుంచుకోండి రమదాన్ మాసం గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు ” ఇవి ( రమదాన్ ) లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే ( సూర -2 ఆయతు -184 ) కావున ఈ రమదాన్ మాసం దినాలను వృధా పోనీయవద్దు , ముందస్తు ప్రణాళికలు చేసుకొని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి లేదంటే మిగితా రోజులలాగే ఈ పవిత్ర మాసమూ గడిసి పోతుంది , షైతాన్ మనల్ని పక్కదారి పట్టించే పనిలో ఉన్నాడన్న విషయం మరవవద్దు మన సమయం వృధాచేసే మనల్ని పక్కదారి పట్టించే పరికరాలు టెలిఫోన్ , టెలివిజన్ ల విషయంలో మరింత జాగ్రత్త పడాలి సుమా 15- ఆత్మ విమర్శ చేసుకోవలెను ” విశ్వసించిన ఓ ప్రజలారా ఆల్లాహ్ కు భయపడుతూ ఉండండి ప్రతి వ్యక్తీ రేపటి (తీర్పుదినం) కొరకు తానేం పంపుకున్నాడో చూసుకోవాలి (సూర- 59 ఆయతు- 18 ) అల్లాహ్ దాసులారా ఈ సంవత్సరపు రమదాన్ మాసమే మన జీవితంలోని చివరి రమదాన్ మాసం ఏమో ? వచ్చే సంవత్సం రమదాన్ వరకు జీవితం ఉందో లేదో తెలియదు కావున ఇకనైనా మారుదాం 2024
  • 10. ఆయన ఎంతో ఉదార స్వభావుడు, సర్వం తెలిసినవాడు. తాను తలచుకున్న వారికి వివేకం, విచక్షణ జ్ఞానం ప్రసాదిస్తాడు. వివేకం, విచక్షణల జ్ఞానం లభించినవాడు ఎంతో అదృష్టవంతుడు. నిజంగా అతనికి అపార సంపదలు లభించినట్లే. బుద్ధిమంతులు మాత్రమే (మా) హితోపదేశం గ్రహిస్తారు. (అల్ బఖరః- 268-269) ఏ విషయంలోనైనా సరే నిజం ఏమిటన్నది ముందుగా తెలుసుకోవాలి. మనది పోయేదేముందని ఎలాపడితే ఆలా మాట్లాడకూడదు. చిక్కులు కొనితెచ్చుకోకూడదు. అందుకు వివేకం ఎంతో అవసరం. వివేకం పుస్తక పొండిత్యం కాదు. అది దైవదత్త వరం. మనిషిని ఆపదల్లో చిక్కుకోకుండా తెలివితేటలతో బయటికి చేరుకొనేలా చేసి చక్కటి దారిచూపే దిక్సూచి. వివేకం ప్రస్తావన ఖుర్ఆన్ లో ఆయన మీకు ప్రసాదించిన మహా భాగ్యాలను ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ శ్రేయస్సు కోసం అవతరింప జేసిన దివ్య గ్రంథాన్ని, (అందులోని) వివేకవంతమైన విషయాలను గౌరవించడం నేర్చుకోవల సిందిగా ఆయన మీకు ఉపదేశిస్తున్నాడు. (ప్రతి విషయంలోనూ) దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన సర్వం ఎరిగినవాడని తెలుసుకోండి. (231) అవివేకం మూర్ఖతకు నెలవు. ఆపదలకు నిలయం. వివేకం - అవివేకం బద్ధశత్రువులు. ఆవివేకానికి వివేకం అంటే ససేమిరా పడదు. ఒకటి అమృతం మరొకటి హాలాహలం. మనిషికి వివేకం తోడైననాడు ఎంతటి కష్టతర కార్యమైనా నిరాటంకంగా ముందుకు సాగిపోతుంది. నిర్విఘ్నంగా నెరవేరుతుంది. వివేకం లోపిస్తే పండితులు సైతం పరమశుంఠలుగా ప్రవర్తించే అవకాశం ఉంది. వివేకం వివేచనకు అంకురం, బుద్ధి కుశలతతో చేపట్టిన ప్రతి కార్యంలో తెలివి పనిచేయడం ప్రారంభమవుతుంది. వివేకం పరీక్షించి చూసే వరకు పరులను నమ్మవద్దని చెబుతుంది. వివేకం అపనమ్మకాన్ని ఆమడదూరాన ఉంచమంటుంది. ఒంటె కష్టాన్ని, వేడిని, ఆకలిని, దాహాన్ని ఓర్చుకొని ఇసుక ఎడారుల్లో బరువులను మోసుకుపోతూ ఉంటుంది. అలాగే వివేకం కష్టాల కడలిని సులభంగా దాటిస్తుంది. అవివేకం మనిషిని వెర్రివాణ్ని చేసి అపహాస్యం పాలు చేస్తుంది. వివేకం ఆశాభావాన్ని రేకెత్తించి భుజం తట్టి వ్యక్తిని కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది. అతడికున్న చాపల్యాన్ని అరికడుతుంది. అవివేకి దానికి వశుడై నష్టపోతాడు. ఆతిని మితం గావించుకునే వివేకం మనిషికి నిరంతరం అవసరమే. లక్ష్యాలు, ఆశయాలు దీనితోనే సాకారం అవుతాయి. సాధారణ మనిషిని సైతం ఓ ఉన్నత స్థానంలో కూచుండబెట్టేందుకు వివేకం ఎంతగానో ఉపకరిస్తుంది. అవివేకం వల్ల తొందరపాటుతనం అధికమవుతుంది. ఆపదల్ని కొని తెచ్చుకొన్నట్లవుతుంది. కర్తవ్యం అనే విత్తనాలను వివేకం అనే నీటితో తడిపి చల్లినట్లయితే ఈ క్రియ శరత్కాలపంటలా సత్ఫలితాలను సంపాదించి విజయానికి వారధి వివేకం 10 ఉదయభాను 2024
  • 11. పెడుతుంది. వివేకం కలిగించే విచక్షణే దీనిక్కారణం. వివేకవంతుడు సన్నిహితుల మాటల్లోని మంచి చెడులను, మాయమర్మాలను తనకు తానుగా తెలుసుకుంటాడు. సరైన నిర్ణయం తీసుకొంటాడు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా, చేరుకోలేమనిపించినా ఎంతో కొంతదూరం ప్రయాణించాలి. కనీసం చేరుకునే ప్రయత్నం జరగాలి. లక్ష్యం చేరుకున్నామా లేదా అన్న దాని కంటే ఎటువంటి కుయుక్తులూ పన్నకుండా ప్రయత్నం చేశామా లేదా అన్నది ముఖ్యం. విలువైనదాన్ని అందుకుంటున్నామనే భ్రమలో, ప్రయత్నంలో మన విలువల్ని తాకట్టు పెట్టకూడదు. జీవితంలో అనేక ఎత్తు పల్లాలుంటాయి. అన్ని రకాల మనుషులతో, భిన్న పరిస్థితుల్లో ముందుకు సాగిపోవలసిందే కొన్ని సార్లు సాగిపోవడం తేలిక గానూ, మరికొన్ని సార్లు కష్టతరంగానూ అనిపిస్తుంది. ఓర్పునకు పెద్ద పరీక్ష అనిపించవచ్చు. పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా, ప్రశాంతంగా ఉండాలని ఎక్కడుంది. పరిస్థితులు ఎటువంటిపైనా మన వివేకుతో అతి తక్కువ ఘర్షణ, ప్రతిఘటనలతో జీవనయాత్ర సాగించగలగడం ముఖ్యం. ప్రతీది పరిశీలనాత్మకంగా చూసుకొంటూ జాగ్రత్తగా ముందుకెళ్లే వారి భవిష్యత్తు బంగారుమయమే. కుతంత్రపు పరీక్షలకు లొంగిపోయి చేసే ఆలోచనలతో వివేకం ఉద్భవించదు. వ్యక్తిలో వివేకం ఉదయిస్తే కలతలు, కలహాలకు చోటుండదు. మనసును, హృదయాన్ని భారంగా కుంగదీసే మధ్యాలను, మూర్ఖతలను వదిలి పెట్టి మనిషి ముందు వెళ్లాలి. వివేకంతో జీవితం మకరందమయం అవుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు కలగవచ్చు. అంగీకరించేందుకు మనసు సహకరించకపోవచ్చు. మన ఆలోచనా దృక్పథం, విలువలు ఏదైనా కావచ్చు. ఆ విషయంలో సగమే మంచి ఉందనిపించవచ్చు. మిగతా సగం మనం చెడుగా ముందే భావించి ఓ నిర్ణయానికి వచ్చేయవచ్చు. సగం సమ్మతం, మీగడా సగం అసమ్మతం అనిపించినప్పుడు మనుషులతోను, పరిస్థితులతోను సమస్యలు ఎదురుకావడంలో ఆశ్చర్యం లేదు. పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. అలాగే మన 'అహం' గానీ ఇటువంటి సందర్భాల్లో ప్రవేశిస్తే, 'వివేకం' కనుమరుగవుతుంది. విషయాన్ని నిష్పాక్షికంగా అంచనా వేయగల సామర్థ్యాన్ని కోల్పోతాం. పక్షపాత వైఖరితో ఆలోచించి అవతలివాళ్లు మనలాంటివారేనన్న విషయాన్ని మరచిపోతాం. తన పంథాను నెగ్గించు కోకపోవడమంటే ఓటమిని అంగీకరించడమే అనుకోవడం తప్పు. అది దాసోహం అయిపోవడమూ కాదు. సిగ్గు పడాల్సిన విషయంగా గానీ బాధపడాల్సిన విషయంగా గానీ భావించకూడదు. ఆహాన్ని జయించగలిగే నిబ్బరం మనలో నిండి ఉన్నందుకు సంతోషించాలి. అంటే అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించినట్లు లెక్క ఎదుటివారి అభిప్రాయాల్ని, ఆలోచనలను అర్ధం చేసుకుని మాట్లాడే ధోరణిని అలవరచుకోవాలి. అవతలి వారిలోని గొప్పతనాన్ని చూడటమంటే మనలో అవలక్షణాలున్నాయని కాదు. కాలాన్ని బట్టి, మనుషుల్ని బట్టి అన్ని విషయాల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయని గ్రహించాలి. అసలు విగ్రహాన్ని వదిలేసి దాని నీడ వెనక పరిగెత్తకూడదు. ఘర్షణకు దారితీయకూడదని భావిస్తే సర్దుబాటు ను అలవాటు చేసుకోవాలనేది ప్రకృతిలోనే ఉంది... ఏది మంచి ? ఏది చెడు అనే ఆలోచన కలిగి ఉండటమే ! ఇంకా చెప్పాలంటే హంస పాలను నీటినుండి వేరుచేసినట్లు , చెడునుండి మంచిని వేరు చేయడమే ! భయంకరమైన గాలి సర్వాన్ని అల్లకల్లోలం చేస్తున్నప్పుడు ఎంత బలమైన వృక్షమైనా స్థిరంగా ఉండలేక ఆటు ఇటూ ఊగిపోతుంది. పరిస్థితులకు ఎదుర్కొక తప్పదు. ఒక గడ్డిపోచ వేగంగా ప్రవహించే నీటిధార ఆగిపోయిన తరవాత నెమ్మదిగా తలెత్తుతుంది. ఎదుర్కొని మళ్ళీ నిలబడగలిగే పరిస్థితుల్ని ప్రకృతిలోనే చూస్తుంటాం. అటువంటిది మేధ కలిగిన మనిషి ఎదుర్కోలేకపోవడం ఏముంటుంది. ప్రతి ఒక్కరితో సామరస్యంగా ఉంటూ మనకు మనం ప్రశాంతతను కలగజేసుకోవడం ముఖ్యం. ప్రకృతి నేర్పిన ఈ సర్దుబాటుతో సబ్యతను సాధిస్తూ, భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, ఘర్షణలకు తావివ్వక ప్రశాంత జీవనానికి కృషి చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనలతో ఇంటా బయటా శాంతిని నెలకొల్పే దిశగా పయనించాలి. సర్దుబాటుతనం విలువను గుర్తెరిగి మన విలువల్ని కాపాడుకుంటూనే ముందుకు వెళ్ళాలి. ప్రాణులకు మంచి-చెడు తెలుసుకొనే శక్తి సహజంగానే కొంత ఉంటుంది. సింహాన్ని చూడగానే జింకలు పారిపోతాయి. కుందేళ్లు మొదలైన జంతువులను చూసి అవి అదరవు బెదరవు. వేటగాడు పన్నిన వలలో వివేకహీనత వల్ల పశువులు పక్షులు పడుతుంటాయి. సింహం సైతం ఎరను చూసి మోసపోయి పట్టుబడుతుంది. ప్రాణులన్నింటిలో మనిషే తెలివిగలవాడు. కారణం వివేకం! అది లేకపోతే మనిషి కూడా జంతువులాగా బతకవలసి వస్తుంది. కొందరు- మోసగాళ్ల చేతిలో పడి, అవివేకంతో సర్వం పోగొట్టుకోవడం చూస్తుంటాం. అజ్ఞాన స్థితిలో చేసే నిర్ణయాలు చెడు ఫలితాలనిస్తాయి. బలవంతం, లోభం, భయం, పక్షపాతం... తదితర దుర్లక్షణాలు వివేకాన్ని నశింపజేస్తాయి. ఇటువంటి వారికి మంచిమాటలు రుచించవు. 11 2024
  • 12. 12 2022 మానవుడు దేనికోసం కృషి చేస్తాడో అదే అతనికి లభిస్తుంది. అతని కృషికి త్వర లోనే గుర్తింపు లభిస్తుంది. అతనికి దాని ప్రతిఫలం పూర్తిగా ఇవ్వబడుతుంది.చివరికి (మానవులంతా) నీ ప్రభువు సన్నిధికే మరలిపోవలసి ఉంది. (మిమ్మల్ని) ఆయనే నవ్విస్తున్నాడు; ఆయనే ఏడ్పిస్తున్నాడు. ఆయనే (మీ) జీవన్మరణాలకు మూలకారకుడు. (అన్-నజ్మ్: 39- 44) మనసుంటే మార్గం ఉంటుంది. ఆశయం కోసం నిరంతరం కృషి చేసినప్పుడు అనుకున్నది సాకారమవుతుంది. డబ్బు లేదని చింతించకుండా ఉన్న వనరులతో సాధన చేస్తే విజయం పాదా క్రాంతమవుతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సృష్టికర్త మనుషుల్ని సృష్టిస్తూ... మనం పొందే ఆనందం, మనశ్శాంతి మనలోనే పెట్టి... దాన్ని ఎవరు గ్రహిస్తారో వారే సుఖ, సంతోషాలను పొందుతారు. ఎక్కడెక్కడో అనందాన్ని వెతుక్కుంటూ నానాపాట్లు పడుతున్న మనం అల్లాహ్ చెప్పిన ఈ సత్యాన్ని గ్రహించనే లేదు! విశ్వాసుల హృదయాలు అల్లాహ్ స్మరణ వల్ల తృప్తి చెందుతాయి. గుర్తుంచుకోండి, అల్లాహ్ స్మరణ వల్లనే మనశ్శాంతి లభిస్తుంది. సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులైనవారు ఎంతో అదృష్టవంతులు. వారికి అత్యంత శ్రేష్ఠమైన ప్రతిఫలం లభిస్తుంది. (అర్-రాద్: 28-29) ఈ మధ్యకాలంలో మనుషులకు అసహనం చాలా సహజగుణం అయిపోయింది... దాంతో స్నేహాలు, బంధుత్వాలు దూరం చేసుకుంటున్నారు. తమ మాటే నెగ్గాలనే 'అహం' అగ్నికి ఆజ్యం పోసినట్లు మరింత తోడయ్యింది. ప్రశాంతంగా ఆలోచించడానికి కూడా సమయం లేకుండా పరుగెడుతున్న జనం- మనశ్శాంతి కోసం 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' కోర్సులలో డబ్బులు కట్టీ మరి చేరుతున్నారు. మనసారా నవ్వలేకుండా ఉన్నారు... నలుగురితో కలవలేక పోతున్నారు. కష్ట సుఖాలు పంచుకోలేకపోతున్నారు... కారణం తెలుసుకుని, కారణం లేకుండా గీసుకున్న ‘గీత’ని చెరిపేస్తే ఆనందం మన వెంటే ఉంటుందనేది సత్యం! ఎలాంటి భేషజాలు లేకుండా 'మనవాళ్ళ'తో మాట్లాడదాం!... భావాలు పంచుకుందాం... మనం కనిపెట్టిన ఈ 'మనశ్శాంతి' అందరికీ పరిచయం చేద్దాం! అసహన రహిత సమాజం కోసం ఈ రోజు నుంచే ప్రయత్నం చేద్దాం! దైవం ఏర్పరచిన... మన హృదయాలలోనే వున్న 'ఆ' 'మనశ్శాంతి' కనిపెట్టడానికి నిర్ణయం తీసుకుని, సుఖసంతోషాలను మన సొంతం చేసుకుందాం! ఆనందం... ఎవరు కోరుకోరు?... అందరికీ కావాలి! ఒక్కొక్కరూ ఒక్కో దారిలో వెతుక్కుంటూ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం! కానీ ఈ ఆనందం ముఖ్యంగా 'మానవ సంబంధాల'తో ముడిపడి ఉంటుందనే విషయం ఎంతమంది గ్రహించగలుగుతున్నాం?... మనసుంటే మార ్ గం ఉంటుంది మనసుంటే మార ్ గం ఉంటుంది శాంతి ప్రియ 2024
  • 13. 13 2022 మన చుట్టూ ఉండే బంధు, మిత్రుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది?... వాళ్ళతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? అని ఒకసారి ఆలోచించి... అందరితో ఏ భేషజాలు లేకుండా మనం ప్రవర్తిస్తే మనం కచ్చితంగా ఆనందంగా ఉండగలం. అందరూ కలిసినప్పుడు మనం పంచుకునే ‘గత’ జ్ఞాపకాలు కూడా ఆనందానికి హేతువులు. ఒక మిత్రున్ని పలకరించడానికి ఈ రోజుల్లో ఎన్నో మార్గాలున్నాయి. ఒక్క క్షణం తీరిక చేసుకుని, చేసే పలకరింపు వలన బంధాలు బలపడతాయి. కొందరు 'నువ్వు ముందా... నేను ముందా' అంటూ పలకరించడానికి 'అహం' కరిస్తుంటారు! ఇది ఎంతగా అంటే ఎప్పుడూ కలిసే... మాట్లాడే వాళ్ళు కొన్ని రోజులు కనబడకపోయేసరికి కూడా ఏమైందీ? ఎలా ఉన్నారంటూ అస్సలు స్పందించరు. దీని వలన ఎలాంటి సంబంధాలు కొనసాగవు. ఇది ఇలా కొనసాగితే చివరకు మనం ఒంటరిగా మిగలడం ఖాయం! మన భావాలు, భావనలు పంచుకోవడానికి నలుగురు ఉండాలి... మాట్లాడుకోవాలి... భావాలు పంచుకోవాలి... ఆనందంగా ఉండాలి! ఈ గజిబిజీ జీవన విధానంలో సంతోషం సాంత్వనతోనే వస్తుంది. అది మన ఆత్మీయుల దగ్గరే దొరుకుతుంది. ఆనందం, సంతోషం 'అలా వచ్చి ఇలా పోయే’ అలల లాంటివి. అయితే ఆనందం పొందడానికి అనవసర ప్రయత్నాలు ఏవి చేయాల్సిన అవసరం లేకుండా...మన చుట్టూ నలుగురు ఆత్మీయులను సంపాదించుకుని... ఆ 'బంధాన్ని' బాధ్యతగా భావించి... ‘దాన్ని' కాపాడుకోవ డానికి మన వంతు ప్రయత్నం చేస్తే... ఆనందం మన సొంతం అవుతుంది! అల్లాహ్‌ను తప్ప మరెవర్నీ ఆరాధించరాదని; తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల, అనాథల పట్ల, నిరుపేదల పట్ల సద్భావనతో మెలగాలని; ప్రజలతో (చిరునవ్వు మోముతో) మంచి మాటలు పలకాలని; ప్రార్థనా వ్యవస్థ (నమాజ్‌) స్థాపించాలని; (పేదల ఆర్థిక హక్కు) జకాత్‌ చెల్లిస్తూ ఉండా లని మేము ఇస్రాయీల్‌ సంతతి చేత ప్రమాణం చేయించాం. (అల్-బఖరహ్ : 83) నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. ఇప్పుడెంతమంది పాటిస్తున్నారు ఈ సామెతని! 'ఎవరేమనుకుంటే నాకేం! అన్న ధోరణి పెరిగిపోయింది. నేనేమైనా ఎవరి మీదైనా ఆధారపడి బతుకుతున్నానా?' అనే 'ఆత్మ రక్షణ' మాటలతో ఎదుటి వాళ్ళను బాధ పెడుతూ సాగే నేటితరం ఆలోచనా ధోరణి వలన కలిగే మనస్తాపం తన దాక వస్తే గాని తెలియదు. ఇక రెండోరకం... అందరితో మంచి అనిపించుకోవాలని కిందా మీదా పడుతుంటారు. ఆ క్రమంలో ఎవరి దగ్గరుంటే వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఎదుటివాళ్ళను చులకన చేసి మాట్లాడుతూ కాలం గడుపుతుంటారు! వాస్తవంగా అందరినీ మెప్పించటం చాలా కష్టం! కానీ ఏవో ప్రయోజనాల కోసం గోడమీది పిల్లి వాటంలా ప్రవర్తించే వీరు తేనె పూసిన కత్తులు - 'తీయని' మాటలతో అనుకున్నది చేయడం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఈ రెండు రకాల మనుషులను గమనిస్తూ మనమెలా ఉండాలో నిర్ణయం తీసుకోవాలి! మనం సంఘజీవులం. నా బ్రతుకు నా ఇష్టం అని బ్రతికేయలేము. ఈ రోజు ఎదుటివాళ్ళ అవసరానికి మనం ఉపయోగ పడినప్పుడే... రేపు మన అవసరానికి వాళ్ళు నిల్చుంటారు. ఇఇక్కడ ఎవరి వలన ఎవరూ బ్రతకరు... ఎవరూ ఎవరినీ పోషించరు. భూమండలంపై సంచరించే ప్రతి ప్రాణికీ ఉపాధినిచ్చే బాధ్యత అల్లాహ్ పైనే ఉంది. అలాగే ఏప్రాణి ఎక్కడ నివసిస్తుందో, ఎక్కడ (దానిప్రాణం) భద్రపరచబడుతుందో కూడా అల్లాహ్ కు మాత్రమే తెలుసు. (హూద్: 6) (మీలాగే) ఎన్నో జంతువులు ఉన్నాయి. కాని అవి తమ ఆహారాన్ని మోసుకొని తిరగడం లేదు. వాటికి ఆహారం అల్లాహ్ ప్రసాదిస్తున్నాడు. మీకు ఆహారమిచ్చేవాడు కూడా ఆయనే. ఆయన సమస్త విషయాలు వింటున్నాడు; సర్వం ఎరిగినవాడు. (అల్-అన్కబూత్: 60) కేవలం మనకంటూ ఆప్తులు, సన్నిహితులున్నారనే ధైర్యం... అంతే! ఈ రోజు మనదే!... మరి రేపటి పరిస్థితి?... కాస్త ఆలోచిద్దాం!... 2024
  • 14. 14 2022 ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ విధేయతలో (ఇస్లాంలో) సంపూర్ణంగా ప్రవేశించండి. మరియు షై'తాను అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు! (బఖరః - 208) మనలో ఉన్న చెడు భావాలు, కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. ఇవి మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం, సంకుచిత భావాలతో నిండి ఉంటుంది. మనిషి దుఃఖానికి ఇవి మొదటి కారణాలు. మనిషికి నిజమైన శత్రువులు వారిలో ఉండే అరిషడ్వర్గాలు. ఇవి సామాన్యులను పతనం దిశగా పయనింపజేస్తాయి. మద్యములను అధములుగా మారుస్తాయి. ఇవి ఇలాంటి ఇతర అవలక్షణాలు మనిషి లోపలి జ్ఞానాన్ని కప్పేసి అజ్ఞానం అనే చీకటిని ఏర్పరుస్తాయి. వాటిని తొలగించుకొంటే, చీకటిపోయి వెలుగు ప్రవేశించి జ్ఞానోదయమై జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. అందరూ కలిసి ఆలోచిస్తే, కలిసి పనిచేస్తే అసాధ్యమైన కార్యం కూడా సుసాధ్యమౌతుంది. కలసి ఉంటె కలదు సుఖం అన్నారు. మనం ఉన్న సమాజానికి మేలుచేసే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. అలా కలిసి సాధించిన విజయమే చంద్రయాన్ - 3. కోట్లాదిమంది భారతీయులు ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన ఒక అపురూపమైన, మహోన్నతమైన ఘట్టం అంతరిక్షంలో ఆవిష్కృతమైంది. ఇలాంటి మరిన్ని ఘానా విజయాలు మన దేశానికి సొంతం అవ్వాలని మనఃపూర్వకముగా ప్రార్థిద్దాం! కాలం పరిణామశీలం మన జీవితంలో అత్యంత ప్రధానమైన భాగం కాలం, ఇది మూడోది. ఇది ఎల్లప్పుడూ సాగుతూనే ఉంటుంది. మనం దాన్ని వేగవంతం చేయలేము, మెల్లగా నడిపించలేము మనం మన శక్తిని నిలువచేసుకోవచ్చు, వృథా చేయవచ్చు, పెంచుకోవచ్చు, చాలా పెద్దదిగా చేసుకోవచ్చు, అత్యల్పంగా కూడా చేసుకోవచ్చు. కాని కాలం మాత్రం జరిగిపోతూనే ఉంటుంది. కాలాన్ని అనంతం... అమూల్యం... అనూహ్యం... బలీయం...' వంటి అనేక ఎన్నో రకాలుగా వ్యాఖ్యానించారు మన పెద్దలు. కాల మహిమను గ్రహించమని, గౌరవించమని బోధించారు మన గురువులు. అంతా మన ప్రయోజకత్వమేననుకుని విర్రవీగుతాం. కాలాన్ని కేలండర్గా మార్చి గోడకూ; గడి యారంగా మార్చి మణికట్టుకూ బంధించామనుకుంటాం. కానీ గుప్పిట్లో నీళ్ళు వేళ్ళ సందుల్లోంచి జారిపోయినట్టుగా కాలం కూడా ఏ బంధనాలకూ లొంగకుండా జారుకుంటూనే ఉంటుందన్న వాస్తవం మన తెలివిని నిరంతరం వెక్కిరిస్తూనే ఉంటుంది. 'నేను దైవోపహతుణ్ని, దురదృష్టవంతుణ్ని, లోకంలో ఇందరుండగా నా నొసటన మాత్రమే కష్టాలు రాసిపెట్టాడు' అని పదేపదే దైవాన్ని నిందిస్తూ మానసికంగా కుంగిపోతున్నవారికి (విశ్వాసులారా!) బాధపడకండి. అధైర్యంతో క్రుంగిపోకండి. మీరు నిజమైన విశ్వాసులైతే చివరికి మీరే విజయం సాధిస్తారు. (సత్యాసత్యాల సమరంలో) మీరేకాదు, వారు కూడా దెబ్బతిన్నారు. (ఆ మాత్రానికే ధైర్యం కోల్పోవడమా!) ఇవన్నీ మేము ప్రజల మధ్య తిప్పే కాలపు మిట్టపల్లాలు మాత్రమే. ఆయన మీలో నిజమైన విశ్వాసులెవరో పరీక్షించడానికి, కొందరిని సత్యానికి సంపూర్ణత సంతృప్తి సంపూర్ణత సంతృప్తి అసంపూర్ణత అసంతృప్తి అసంపూర్ణత అసంతృప్తి అబుల్ హసన్ 2024
  • 15. 15 2022 సాక్షులు (అమరగతులు)గా చేయడానికి ఈ విధంగా చేశాడు. అల్లాహ్ దుర్మార్గుల్ని ఎన్నటికీ ప్రేమించడు. ఆయన ఇలాంటి పరీక్ష ద్వారా నిజ మైన విశ్వాసులు ఎవరో ఏరివేసి, అవిశ్వాసుల్ని అణచి వేయదలిచాడు. (ఆల్ ఇమ్రాన్: 139-140) అన్న వచనాలు గొప్ప ఔషధాలు. పరీక్షకు మారు పేరు జీవితం భయం, ఆకలి, ధనప్రాణ, పంటల నష్టాలు కలిగించి మిమ్మల్ని మేము తప్పని సరిగా పరీక్షిస్తాము. అలాంటి స్థితిలో సహనం వహించి, ఆపద వచ్చినప్పుడు “మేము అల్లాహ్ కు చెందినవారలం. ఆయన వైపుకే పోవలసినవాళ్ళం”అని పలికేవారికి వారిప్రభువు కారుణ్య కటాక్షాలు లభిస్తాయని శుభవార్త విన్పించు. అలాంటివారే సన్మార్గగాములు. (155-157) అంటే జల ప్రవాహంలో ఎంతటివారికైనా తిప్పలు తప్పవు... ఎలాంటి ప్రవాహాలైనా నడివేసవిలో ఇసుక దిబ్బలు బయటపడి వెక్కిరించక మానవు. తిరిగి వర్షాలు రాగానే దిబ్బలు మాయమైనట్లు కాలం కలిసిరాగానే మానవ జీవన ప్రవాహాలు సాఫీగా సాగిపోతాయి. 'కాలం కలిసిరాకుంటే తాడే పామై కాటేస్తుంది' అని చెప్పిన మన పెద్దలే 'కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే బిడ్డలు పుడతారు' అని కూడా ధైర్యం చెప్పారు. ముఖ్యంగా కష్టాలు చుట్టుముట్టి నప్పుడు 'కెరటం నా ఆదర్శం... విరిగి పడినందుకు కాదు, పడినా లేచినందుకు!' అన్న కవివాక్కును తప్పక గుర్తుచేసుకొంటూ ఉంటే- మనం ఒకనాటికి తప్పక విజేతలం అయి తీరుతాం. 'అదను ఎరిగి సేద్యం... పదును ఎరిగి పైరు' అని సామెతను అమలు పరిస్తే విజయం మన సొంతం. వినిర్మల హృదయం విజయానికి నాంది మనసు మాలిన్యరహతంగా ఉంచుకొంటేనే, ఇహపరాలకు మార్గం సుగమం అవుతుంది. నిర్మల మైన మనసులో నిశ్చయ జ్ఞానం కలిగి, దివ్యజ్యోతి వెలుగుతుంది .మానవ జీవిత గమ్యం ఆ దివ్యజ్యోతి సంద ర్శనమే. చిత్తశుద్ధి లేకపోతే, శివుని అనుగ్రహం కలుగ దు. అజ్ఞానపు పొరలు తొలగితే జ్ఞాన ప్రకాశం కలిగి దివ్యానుభూతి లభిస్తుంది. ఇదే చిరంతనమైనది, శాశ్వ తమైనది. దీనికి మించిందిలేదు. ఈ విషయాన్ని గుర్తిం చి మనం రుజుమార్గంలో ప్రయాణించి మానవ జన్మ సార్ధకతను రుజువు చేసుకోవాలి. కఠిన మనస్కుల తోనూ కలివిడిగా ఉంటే, మనలోని మృదుత్వానికి పరి పూర్ణత సిద్ధిస్తుంది. మంటల మాటున మంచు ఉంటుం దని, కఠిన శిలల్లోనూ నీరు ఉంటుందని తెలుసుకోవ టమే వివేకం. ధర్మో రక్షతి రక్షిత విశ్వాసులారా! మీరు దేవునికి సహాయంచేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ కాళ్ళను (యుద్ధం నుండి వెనుకంజవేయకుండా) స్థిరంగా ఉంచుతాడు. (ముహమ్మద్ : 07) ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. మరి ధర్మం అంటే ఏమిటి? ధర్మం కేవలం సూక్తి ముక్తావళి కాదు. ప్రవచన ప్రభోదాలు అంతకన్నా కాదు. ఆచరించేది, పాటించేది. మానవాళి ఏం ఆచరించాలి? "మరియు అల్లాహ్‌ నీకు ఇచ్చిన సంపదతో పరలోక గృహాన్ని పొందటానికి ప్రయత్నించు. మరియు ఇహలోకం నుండి లభించే భాగాన్ని మరచిపోకు. నీకు అల్లాహ్‌ మేలు చేసినట్లు, నీవు కూడా (ప్రజలకు) మేలుచేయి. భూమిపై కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నించకు. నిశ్చయంగా అల్లాహ్‌ కల్లోలం రేకెత్తించేవారిని ప్రేమించడు!" (ఖసస్: 77) సమాజంలో హింస, దౌర్జన్యం, దుర్మార్గం లేకుండా చేయాలి. నీవెలా సుఖశాంతులతో వర్థిల్లుతున్నావో అలానే ఎదుటివారు కూడా ఉండాలని ఆలోచించడం, వ్యవహరించడం, ఆచరించడం, పాటించడం, ఏమైనా కావచ్చు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఇతరులూ నీలాగే హాయిగా జీవించేలా నడుచుకోవడం, బాధితులకు సహకరించడం, ఆ సహకారంలో ఆనందం, తృప్తి పొందడం, ధర్మాచరణలో భాగమే అని చెప్పాడు. సత్కార్యాల్లో, దైవభక్తికి సంబం ధించిన పనుల్లో పరస్పరం సహకరించుకోండి. అంతేగాని, పాప కార్యాల్లో, హింసాదౌర్జన్యాల్లో మాత్రం ఎవరితోనూ సహకరించకూడదు. అల్లాహ్ కు భయపడండి. ఆయన (నేరస్థుల్ని) చాలా కఠినంగా శిక్షిస్తాడని తెలుసుకోండి. (మాయిదహ్: 02) జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి. సంపూర్ణ జీవితం అంటే వయస్సుకు సంబంధించిన విషయం కాదు కానీ, సంపూర్ణ జీవితం అంటే మనం బ్రతికినందుకు ఒక అర్థం ఉండడమే. అంటే దేవుడు మనికిచ్చిన అవకాశాల్ని సమయానుకూలంగా శక్యమైనంత వరకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉపయోగించుకోవటం. అనునిత్యం మనం సానుకూలంగా ఆలోచించాలి. ప్రవర్తనలో సరియైన మార్పులు తెచ్చుకోవాలి. పిరికితనం పనికిరాదు. ధైర్యంగా ఉండాలి. భయందోళనలు దగ్గరకు రానీయకూడదు. భయంతో చాలా సమస్యలు వస్తాయి. ప్రతినిత్యం జాగరూకతతో ఉండాలి. జీవితం అపూర్వమైన కానుక. దానిని సద్వినియోగం చేసుకుని ఆనందమైన జీవితం గడపాలి. 2024
  • 16. మన భవిష్యత్‌ మనచేతుల్లోనే ఉంది. స్పష్టతతో, అవగాహనతో ఉంటే జీవితాన్ని ఆనందంగా తీర్చి దిద్దుకోవచ్చు. గతం గరించి చింతవద్దు. స్ఫూర్తిగానైనా, గుణ పాఠంగానైనా తీసుకోవాలి అంతే. భవిష్యత్‌ గురించి లేని పోనీ భయాలు వద్దు. కావాల్సినదల్లా సరయిన కార్యప్రణాళిక, కార్యాచరణ. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. శారీరకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చేసే ప్రతి పనిలోనూ సంపూర్ణంగా జీవించాలి. గతాన్ని అనుసరించే మన వర్తమానం ఉంటుంది. వర్తమానం మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం పాటించే ఏ ధర్మాచరణ అయినా సంపూర్ణంగా పాటించాలి. ఎందుకంటే సగం ఎందులోనూ సంతృపి ఇవ్వదు. సగం సగం ప్రేమికులతో కూర్చోవద్దు, సగం సగం స్నేహితులతో సావాసం చెయ్యోద్దు. సగం సగం ప్రతిభావంతులను చదవొద్దు.సగం సగం జీవితం జీవించొద్దు, సగంసగం మరణం చావొద్దు. ఖలీల్ జిబ్రాన్ అన్నట్టు - సగం సగం పరిష్కారాన్ని ఆశ్రయించొద్దు, అర్థ సత్యాల వెంట నడవొద్దు. సగం సగం కలలు కనొద్దు, సగం సగం ఆశతో బతకొద్దు మౌనంగా ఉంటే... చివరి వరకు మౌనంగా ఉండు. మరి మాట్లాడితే... చివరి వరకు మాట్లాడు . మాట్లాడాలి కదా అని మౌనంగా ఉండకు, మౌనంగా ఉన్నాను కదా అని మాట్లాడకు. నీవు సంతృప్తి చెందితే... నీ సంతృప్తిని వ్యక్తం చెయ్యి. సగం సంతృప్తి చెందినట్లు నటించకు. ఒకవేళ నీవు తిరస్కరిస్తే ... నీ తిరస్కరణను వ్యక్తపరచు, ఎందుకంటే సగం తిరస్కరణ మరో సగానికి అంగీకరారం. నువ్వు జీవించని జీవితం సగం, నువ్వు చెప్పలేని మాట సగం. నువ్వు పూర్తిగా నవ్వలేకపోయిన నవ్వు సగం. నీకు చేరని ప్రేమ సగం, నీకు తెలియని స్నేహం సగం. నీకు దగ్గరగా ఉన్న వ్యక్తులను నిన్నే అపరిచితుడిగా మార్చేది సగం. నీ సన్నిహిత వ్యక్తులను నీకు అనామకులుగా చేస్తుంది సగం. సగం చేరుకోవడం అంటే చేరకపోవడమే.. సగం పని చేయడం అంటే పని చెయ్యకపోవడమే. సగం అంటే నువ్వు ఉన్నా లేనట్టే, లేకున్నా ఉన్నట్టే. సగం నువ్వు, నువ్వు కానప్పుడు నువ్వు ఎవరో నీకు ఎలా తెలిసేది? నాలోని సగం ఏమిటో నాకే తెలియనప్పుడు నాకు నేను తెలిసినట్టా తెలియనట్టా? అంటే నేను ఇష్టపడే వ్యక్తి నాలో మిగిలిన సగం కాదు అనేగా… నేను ఈ క్షణం ఒక స్థలంలో ఉన్నాను, అదే సమయంలో మరొక ప్రదేశంలో ఉన్నాను.. ఇది సాధ్యమా? సగం పానీయం మీ దాహాన్ని తీర్చదు. సగం భోజనం మీ ఆకలిని తీర్చదు. సగం మార్గం మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్లదు, సగం ఆలోచన మీకు ఫలితాలను ఇవ్వదు. నీ నిస్సహాయ క్షణం సగం, కానీ నువ్వు నిస్సహాయుడవు కాదు. ఎందుకంటే నువ్వు సగం మనిషివి కావు, నువ్వు పూర్ణ మనిషివి. నువ్వు జీవితాన్ని పూర్ణంగా జీవించడానికి సృష్టించబడ్డావు, సగం జీవితాన్ని గడపడానికి కాదు. మనకిషి నిజ స్వరూపం నీకు కన్పించేది నీకు విన్పించేది మాత్రమే కాదు నీవు కనలేనిది, నువ్వు వినలేనిది . కూడా. అందుకే ... నువ్వు ఒకరి గురించి తెలుసుకోవాలంటే కేవలం అతను చెప్పిందే నమ్మకు అతను చెప్పనివి కూడా చాలానే ఉంటాయని తెలుసుకో... 2024
  • 17. కృతజ్ఞత అనే తాళం చెవి ద్వారా మనం ప్రతికూల విషయాలను, అనుకూల విషయాలుగా మార్చుకోవచ్చు. కృతజ్ఞత అనేది ఒక టీకా మందు. అది ఒక విషనాశిని. క్రిమి వినాశిని. మన దిన చర్యలో ఏ మంచి విషయం జరిగినా దానికి కృతజ్ఞత చూపాలి. అదెంత స్వల్పమైన, అల్పమైన సహాయం అయినా సరే జజాకల్లాహు ఖైరా (అల్లాహ్ మీకు మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించు గాక!), తవ్వలల్లాహు ఉమ్రక్ (అల్లాహ్ మీ ఆయుష్షును పెంచుగాక!), అల్లాహ్ యుస్యిదుక్ (అల్లాహ్ మిమ్మల్ని భాగ్యవంతులు జాబితాలో చేర్చు గాక!) అనడం అలవాటు చేసుకోవాలి. మనం మన రోజువారి జీవితాన్ని అల్లాహ్‌ కృతజ్ఞతతో ప్రారంభించాలి. మన ఆరోగ్యం,మన పరివారం, మన ఉద్యోగం, మన స్కిల్స్‌, మన ప్రతిభ, ప్రజలు మనలో ఇష్ట పడే గుణాలు, మనకు ప్రాప్తమయి ఉన్న స్థాయి గౌరవం అన్నీ అల్లాహ్‌ కృపాకరమే. నిజంగా చెప్పాలంటే, అల్లాహ్‌ కృపానుగ్రహాలను మనం లెక్కించాలన్నా లెక్కించ లేము. కాబట్టి అల్లాహ్‌ ఒక్కొ అనుగ్రహాన్ని తలచుకొని నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. వాక్కు పరమయిన కృతజ్ఞత, ధన పరమయిన కృతజ్ఞత, దేహ పరమయిన కృతజ్ఞను నిత్యం చేసుకోవాలి. కృతజ్ఞతా భావం అనేది శుభాల తలుపుల్ని తెరిచే గొప్ప సాధనం. అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నడు: ”ఒక వేళ మీరు కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా ప్రసాదిస్తాను”. (ఇబ్రాహీమ్‌: 7) కృతజ్ఞతా భావం వల్ల మనలో సాత్విక భావాలు చోటు చేసుకొని, సానుకూల దృక్పథం అలవడి ఒక విధమయిన ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. అది మనల్ని మరింత బలవంతులుగా తీర్చి దిద్దుతుంది. మునుపెన్నడూ ఎవ్వరికీ లభించని, ప్రళయం వరకూ ఇంకెవ్వరికి దక్కని గొప్ప రాజ్యాధికారం కలిగిన ప్రవక్త సులైమాన్‌ (అ) కృతజ్ఞతా పూర్వకంగా చెప్పిన వాక్యాలు మనకు ఆదర్శం. ”నా ప్రభూ! నువ్వు నాకూ, నా తల్లిదండ్రు లకూ ప్రసాదించిన అనుగ్రహాలకుగాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు ఇవ్వు. నేను నీ మెప్పును పొందే మంచి పనులు చేసేలా దీవించు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో చేర్చుకో”. (అన్నమ్ల్‌: 19) కృతజ్ఞత "జజాకల్లాహు ఖైరా" చిన్న మాటే. అయితే ఇది చెప్పేటప్పుడు హృదయ పూర్వకంగా చెప్పాలి. కృతజ్ఞతా పలుకులు మనం చెప్పేకొద్ది మన హృదయం కృతజ్ఞతతో నిండి పోవాలి. అప్పుడు మన నుండి ఎక్కువ ప్రేమ ప్రసరిస్తుంది. కృతజ్ఞత వల్ల నష్టపోయేది ఏమి లేదు. అది భూప్రపంచంలో సర్వ సంపదలకూ కారణం. మనం ఏ ఏ అనుగ్రహాలక యితే కృతజ్ఞతా భావంతో ఉంటామో అవి మనకు మరిన్ని రెట్లు అధికంగా లభిస్తాయి. అంతే కాదు, జీవితంలో దాపురించే ప్రమాదకర పరిస్థితుల నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. ఖురాన్ లో ఇలా ఉంది; దాని (శిక్ష) బారి నుండి లూత్‌ గృహస్థులు మాత్రమే సురక్షితంగా ఉన్నారు. వారిని మేము మా అనుగ్రహంతో (ఆ) రాత్రి తెల్లవారుజామునే అక్కడ్నుంచి వేరే చోటికి తరలించాం. ఇలా మేము కృతజ్ఞులైనవారికి ప్రతిఫలమిస్తున్నాం. (ఖమర్‌: 35) ఈరోజే కృతజ్ఞతని చూపించడం ప్రారంభించి మీ జీవితాన్ని అద్బుతంగా మార్చుకోండి. 17 కృతజ ్ఞ త మూల్యం అమూల్యం నిసార్ ఆబిద్ 2024