అమ్మ గురించి రాయాలంటే అక్షరాలు సరిపోవు. అమ్మే ఓ మధుర కావ్యం. ఎంత రాసినా పూర్తి కాని ప్రేమ కావ్యం. విశ్వం ఉన్నంతకాలం ఆమె కీర్తిని కొనియాడాల్సిందే. అమ్మ శబ్దానికి అర్థం అమ్మే. అమ్మ మనకు రూపాన్నిచ్చిన అమృతమూర్తి. ఈ భూమ్మీద అమృతం (ఆబ్ ఎ హయాత్) ఉందో లేదో కానీ అమృతమనే మాటకు అర్థం అమ్మ. తన సర్వస్వం పిల్లల కోసం త్యాగం చేస్తూ.... మన అభ్యుదయం కోరేది అమ్మ. చివరి శ్వాస వరకు.. అనుక్షణం మనకై బ్రదుకుతుంది అమ్మ.