SlideShare a Scribd company logo
శ్రీ రస్థు శుభమస్తు అవిఘ్నమస్తు
శ్రీ త్రినాథ వ్రతము
శ్రీ త్రినాథ వ్రతకల్పము
పీ|| చిననాటి నుండియు సిరియున నెరుగని
బీదబాపడొకడు పెరుగు చుండె వాని ప్రా ర్ధన దగుదానిగా
గొనియెంచి కురచయై చెలగాడు గోవునందు యజమాని
వెలయగాంచె; బ్రహ్మ, విష్ణు , మహేశ్వరులనొక చోట
గీ || వారినధిక కొలిచి - వరలెనపుడు - అష్టభోగములంది యవని
వీడె పూత చరితుడౌ తలచి భూజనులను వారి పూజించి భక్తితో
జరుపవలయు.
ప్రా ర్ధన:- శుక్లా ం బరధరం విష్ణు ం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అని దైవ ప్రా ర్థన చేసి ఆచమనము జరుపవలెను.
ఆచమ్య కేశవ నామములు
ఓం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః
సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దా య నమః పురుషో త్తమాయ నమః అధోక్షజాయ
నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్ధనాయ నమః ఉపేంద్రా య నమః హరయే నమః శ్రీ కృష్ణా య నమః
శ్రీ త్రినాధ అష్టో త్తర శతనామావళి
ఓం భూతాత్మనాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం పురుషాయ నమః
ఓం చరమాయ నమః
ఓం జలాయ నమః
ఓం భూతకృతే నమః
ఓం శర్వాయ నమః
ఓం చరణాయ నమః
ఓం ముకుందాయ నమః
ఓం అమేయాత్మనే నమః
ఓం మంత్రా య నమః
ఓం నిధయే నమః
ఓం ఆర్యాయ నమః
ఓం ధ్వనియే నమః
ఓం కృతయే నమః
ఓం ఈశాయ నమః
ఓం తేజసే నమః
ఓం గతయే నమః
ఓం బలాయ నమః
ఓం అజాయ నమః
ఓం ఫణినే నమః
ఓం యోగాయ నమః
ఓం ఉదగ్రా య నమః
ఓం దీర్ఘా య నమః
ఓం సుదీర్ఘా య నమః
ఓం అవిఘ్నాయ నమః
ఓం ప్రా ణదాయ నమః
ఓం పునర్వసే నమః
ఓం మాధవాయ నమః
ఓం వహాయ నమః
ఓం సిద్దయే నమః
ఓం శ్రీబలాయ నమః
ఓం వామనాయ నమః
ఓం హంసాయ నమః
ఓం బలినే నమః
ఓం కరాళినే నమః
ఓం గురవే నమః
ఓం ఆగమాయ నమః
ఓం అలభ్యాయ నమః
ఓం బుధయే నమః
ఓం వరదాయ నమః
ఓం సుఫలలాయ నమః
ఓం భావనే నమః
ఓం శశిబింబాయ నమః
ఓం పవనయా నమః
ఓం ఖగాయ నమః
ఓం సర్వవ్యాపినే నమః
ఓం కామాయ నమః
ఓం అనాశకాయ నమః
ఓం పవిత్రా య నమః
ఓం అనిమిషాయ నమః
ఓం పవిత్ర నమః
ఓం విక్రమణే నమః
ఓం మహేశాయ నమః
ఓం దేవాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం మోదనే నమః
ఓం భిక్షయే నమః
ఓం తారాయ నమః
ఓం హంసాయ నమః
ఓం నీలాయ నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం శరభాయ నమః
ఓం హరాయ నమః
ఓం భాగినే నమః
ఓం అచలాయ నమః
ఓం శూరాయ నమః
ఓం అర్చితాయ నమః
ఓం శౌర్యాయ నమః
ఓం కుంభవే నమః
ఓం నయాయ నమః
ఓం తరవే నమః
ఓం భీమాయ నమః
ఓం గళాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం లోహితాయ నమః
ఓం విభవే నమః
ఓం మాయాయ నమః
ఓం ధేనవే నమః
ఓం వేదాంగాయ నమః
ఓం వాయనాయ నమః
ఓం సేవ్యాయ నమః
ఓం వంధ్యాయ నమః
ఓం దయనీయాయ నమః
ఓం తుష్ఠా య నమః
ఓం బంధనాయ నమః
ఓం హరయే నమః
ఓం అనసూయాయ నమః
ఓం బీజాయ నమః
ఓం అంజితాయ నమః
ఓం బలవంతే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం సుఖదేవాయ నమః
ఓం వత్సలాయ నమః
ఓం దేవదేవాయ నమః
ఓం శ్రీ వత్సలాయ నమః
ఓం దేవాది దేవాయ నమః
ఓం రవణే నమః
ఓం కురువాసినే నమః
ఓం భోజనాయ నమః
ఓం శయానందాయ నమః
ఓం వరాయణాయ నమః
ఓం హరిశాయినే నమః
ఓం హనుమత్యెై నమః
ఓం మహాదేవాయ నమః
ఓం బ్రహ్మ రూపిణే నమః
ఓం ప్రశాంత తనయే నమః
ఓం త్రినాధాయ నమః
త్రినాథ వ్రత కథా ప్రా రంభము
భక్తు లారా మనస్సు నిర్మలంగా ఉంచి వినండి, త్రినాధుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతం వలె
ఉండును. శ్రీపురం అను గ్రా మములో మధుసూధనుడు అను బ్రా హ్మణుడు ఉండెను. మిక్కిలి దరిద్రు డు అగుటచే
బిక్షమెత్తు కుని జీవించేవాడు. ఆ బ్రా హ్మణుడకు ఒక కొడుకు జన్మించెను. తల్లి పాలు లేనందున పిల్లవాడు
కృశించుచుండెను. బాలుడు కృశించుచున్నందువల్ల ఆ బ్రా హ్మణ స్త్రీ పెనిమిటి తో చెప్పిన సంగతి ఏమనగా అయ్యా
నేను చెప్పిన సంగతి శ్రద్ధతో వినండి పిల్లవానికి పాలు నిమిత్తం పాలు గల ఆవునొకటి తీసుకునిరండి అని చెప్పగా, ఆ
మాట భర్త విని ఏమి చెప్పుచున్నాడంటే "ఓ స్త్రీ రత్నమా! నీకు వెర్రి పట్టినదా మనము చూడగా బీదవారము, పాలు
గల ఆవు ఏలాగున దొరుకుతుంది.
ధన రత్నములు మనకు లేవు నేను లోకులలో గణ్యత ఎలా పొందుతాను? ఎవరికి ధనసంపదలు
కలిగియుండునో వారికి లోకమంతా మర్యాదలు చేస్తా రు, వారికే అంతా భయపడతారు. నా వంటి బీదవాడిని ఎవరు
అడుగుతారు? అని బ్రా హ్మణుడు చెప్పగా.
భార్య మిగులు దుఃఖించినదై "ఓబ్రహ్మ దేవుడా మా వంటి బీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి
తిని ఈ బిడ్డ బతుకుతాడు? ఈ శిశు హత్య నాకు చుట్టు కుంటుంది అని
దుఃఖించుచుండగా , ఆ పిల్లవాని ఘోష చూచి ఏమియు తోచక ఆ బాహ్మణుడు చింతాక్రా ంతుడై విచారించి తన
ఇంటిలో వున్న కమండలం వగైరా చిల్లర సామానులు సంత లో అమ్మివేసి అమ్మిన సొ మ్ములో "యాబది
రూపాయలు" జాగ్రత్తగా పట్టు కొచ్చి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొ మ్ముని పట్టు కుని సంతోషించి పెనిమిటిని చూచి
అయ్యా! ఈ సొ మ్మును తీసుకుని వెళ్లి పాలుగల ఆవునొకటి తీసుకురండని చెప్పినది. తన భార్య చెప్పిన మాట
ప్రకారం ఆ బ్రా హ్మణుడు ఆ రూపాయలు పట్టు కుని గ్రా మగ్రా మములు తిరిగెను.
ఇట్లు తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారుండే గ్రా మమునకు వెళ్లెను, ధనధాన్యాలు కలిగి కుభేరునితో
సరిసమానంగా ఆ షావుకారు ఉండెను. ఆవులు శాలలో నిండివుండెను. దైవ ఘటన మాత్రం వేరై వున్నది. తన
ఆవులలో "బో దా" అను ఆవు ఉండెను, అది మిగులు దుష్టబుద్ధి గలది, పైకి మేతకు వెళితే పరుల వ్యవసాయం లో
చొరబడి తినివేస్తు ండేది. ఒక దినము షావుకారు చూచుచుండగానే పేదవాని పొ లములో జొచ్చి తినివేయుచుండెను.
అది చూచి ఆ షావుకారు అతి కోపముతో ఏమనుకున్నాడంటే "దీని ముఖం చూడకుండా ఈ ఆవుని
ఇప్పుడే అమ్మివేస్తా ను, అది విలువగల ఆవు అయితే కాని ఈ దుష్టబుద్ధి గల ఆవును యాబది రూపాయలకే
ఇచ్చివేస్తా ను" అని అనేసరికి మధుసూధనుడనే బ్రా హ్మణుడు ఆ మాటలు విని ఆ షావుకారితో ఇట్లనెను. ఓ
షావుకారు! వినండి అది విలువగల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు, ఆ రూపాయలు నేను
ఇచ్చివేస్తా ను ఆవును, దూడను రెండునూ ఇప్పించండి అని అనగానే, ఆ షావుకారు బ్రా హ్మణుడిని చూచి నీకు
వెఱ్ఱిపట్టినదా! విలువగల ఆవును యాబది రూపాయలకు పట్టు కుని పో యెదవా? అని అనెను. మరలా మదిలో
విచారించి, తెలియక అనివేసినాను, ఈ బ్రా హ్మణుడు ఎక్కడనుండి వింటున్నాడో, ఆ ఆవును ఇవ్వకపో తే నాకు
అసత్యదోషము ప్రా ప్తించును అని బ్రా హ్మణునకు ఆవును, దూడను ఇచ్చివేయగా, బ్రా హ్మణుడు వాటిని తోలుకుని
అచ్చటనుండి బయలుదేరి తన ఇంటికి చేరినాడు.
ఆ ఆవుని చూడగానే బ్రా హ్మణ స్త్రీ కి చంద్రు ని చూచిన కలువ వలే సంతోషకరమైనది. వెంటనే పాలు పిండి
తన కుమారునకు పో సి బహు సంతోషము పొందినది. ఇట్లు కొన్ని నెలలు పో యిన పిమ్మట ఆ ఆవు ఎటు పో యినదో
కనిపించలేదు. పొ ద్దు పో యిన వేళాయెను. ఆవు రాకపో వటం చూచి బ్రా హ్మణుడు వెదకబో యెను, వీధులలో,
సమీపమున యున్న వ్యవసాయ పొ లములలో చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవుని
వెదకుటకై బయలుదేరి కొంత దూరం నడచి వెళ్లి త్రో వలో ఒక చెట్టు చూచెను.
అది ఒక గొప్ప మఱ్ఱి చెట్టు . ఆ చెట్టు దగ్గరకు వెళ్లినాడు. ఆ చెట్టు సంగతి వినండి! ఆ చెట్టు పైన ముగ్గు రు
మనుష్యులు కూర్చున్నారు. వారు ఎవరనగా బ్రహ్మ, విష్ణు , మహేశ్వరులు. వారే త్రిమూర్తు లు. అటువంటి చెట్టు క్రింద
బ్రా హ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకుని పో వుచుండగా, త్రిమూర్తు లు బ్రా హ్మణుడిని పిలిచి "ఓ బ్రా హ్మణుడా!
విను నీ మనస్సు లో ఎందుచేత దుఃఖము కలిగి ఉన్నావు? నీవు ఎక్కడకు వెళ్లు చున్నావు? ఆ సంగతి మాతో
చెప్పమని" అడుగగా, బ్రా హ్మణుడు రెండు చేతులు జోడించి "అయ్యా! నేను మిక్కిలి బీదవాడను. భిక్షమెత్తు కుని
బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉండెను, అది కనిపించలేదు. ఈ దినం శ్రీపురం సంత అగుచున్నది. ఆ సంతకు
పో యి వెదకెదను. ఎవరైనా దొంగిలించి తీసుకుపో యిన యెడల ఆ సంతలో అమ్ముతారు గదా! ఆ హేతువు చేతనే
వెదుకుచున్నాను, ఓ త్రినాధస్వాములారా! అని తన వృత్తా ంతం చెప్పెను." అది విని బ్రా హ్మణునకు, త్రిమూర్తు లు
ఏమి చెప్పుచున్నారంటే నీవు ఇపుడు సంతకు వెళ్లు చున్నావు గదా! మా నిమిత్తము ఏమైనా కొన్ని దినుసులు
తీసుకొనిరాగలవా? అని త్రిమూర్తు లనిరి. బ్రా హ్మణుడు ఏమి దినుసులు కావలెనని అడుగగా త్రిమూర్తు లు ఇట్లనిరి.
ఒక పైసా గంజాయి, ఒక పైసా ఆకు వక్కలు, ఒక పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి.
అది విని బ్రా హ్మణుడు ఏమి చెప్పుచున్నాడు అంటే ఓ త్రిమూర్తు లారా! నాకు పైసలు ఎక్కడ
దొరుకుచున్నవి? నేను బీద బ్రా హ్మణుడను, భిక్షమెత్తు కుని జీవించుచున్నాను. అనగా ఓ బ్రా హ్మణుడా! విను అదుగో
అటుచూడు రెల్లు పొ ద కనిపించుచున్నది, దాని మొదలు మూడు పైసలున్నవి అనగా, ఆ పలుకులు విని
బ్రా హ్మణుడు వెళ్లి రెల్లి పొ ద మొదలు చూసేసరికి మూడు పైసలున్నవి. ఇంకను వుండునేమోనని ఆ చెట్టు ను ఇంకనూ
పైకి తీయుచుండెను. అది చూచి త్రినాధులవారు ఓ బ్రా హ్మణుడా! నీకు వెర్రి పట్టినదా! అందులో పైసలు లేవు ఎంత
దొరికినదో అంతే ఉండును అనెను. ఆ పలుకులు విని బ్రా హ్మణుడు అచ్చటి నుండి వెళ్లిపో యెను.
కొంత దూరం వెళ్లి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించెను. అది చూచి త్రిమూర్తు లు తిరిగి ఎందుకు
వచ్చావు అని అడిగిరి. దానికి బ్రా హ్మణుడు మీరు చెప్పిన వస్తు వులు దేనిలో తేవలెను అని అడిగెను. దానికి
త్రినాధులు నీ గావంచాలో తెమ్మని చెప్పిరి. అది విని బ్రా హ్మణుడు నూనె గావంచాలో ఎలా వస్తు ందండి? మీరు
జగత్కర్తలు నా వద్ద కపటముంచి చెప్పుచున్నారు అనగా, త్రిమూర్తు లు మా నామము తలచుకుని నూనె గావంచాలో
తీసుకురా అని చెప్పగా బ్రా హ్మణుడు సెలవు తీసుకుని అచ్చటి నుండి వెడలిపో యెను. ఆనందముతో బ్రా హ్మణుడు
శ్రీపురం సంతలో ప్రవేశించాడు.
ఆవులుండే సంతకు వెళ్లి చూడగా తన ఆవు కనిపించలేదు. ఆకులు, చెక్కలు, గంజాయి పుచ్చుకుని
నూనె గురించి బజారుకు వెళ్లి తెలుకల వాడిని నూనె అడిగెను. గావంచా చూపి ఇందులో ఒక పైసా నూనె
పో యమనెను. ఈ సంగతి తెలుకల వాడు చూచి బ్రా హ్మణుడు పిచ్చిమనిషి కాబో లునని నూనె లేదు అని చెప్పెను.
అచట నుండి మరియొక ముసలి తెలుకల వాడిని నూనె అడిగెను. ఆ ముసలి వాడు చూచి దిగమట్టు నూనె ఎంతది
కావలెను అని అడుగగా ఒక పైసా నూనె మాత్రం పట్టు కు పో వుదునని ఆ బ్రా హ్మణుడు చెప్పెను. తెలుకల వాడు
నూనె కొలిచెను. బ్రా హ్మణుడు గావంచా చూపెను. తెలుకలవాడు ఈ బ్రా హ్మణుడు వికారపువాడు వీనిని
మోసం చేసి పైసా తీసుకుంటాను అని ఆలోచించుకుని కొలత పాత్రను తిరగేసి నూనె కొలిచి ఇచ్చెను. విప్రు డు
గావంచా కొనచెంగును పట్టు కుని అచటినుండి వెళ్లిపో యెను.
తెలుకలవాడు సంతలో కూర్చుని ఉండెను. కుండలో నూనె కొంచెమైనా లేదు. అది చూచి తెలుకలవాడు
మూర్చబో యెను. తెలుకల వాళ్ళందరూ వచ్చి ముఖం పై నీళ్లు చల్లి సేదతీర్చి కూర్చుండబెట్టిరి. అతనికి తెలివి
రాగానే సంగతి ఏమని అడిగిరి. ఏమిచెప్పను? ఎక్కడినుండో బ్రా హ్మణుడు వచ్చి నూనె గిద్దెడు కొనెను, ఇప్పుడే అటు
వెళ్లెను. కుండలో నూనె చూడగా లేదని చెప్పి అంతా వివరించెను. విప్రు డు ఒకాయన వచ్చి మమ్ము కూడా నూనె
అడిగెను లేదని చెప్పగా వెళ్లిపో యెను. ఈలాగున అంతా వివరించగా, అందరూ విప్రు నివద్దకు పరిగెత్తు కుని వెళ్లి ఏమి
చెప్పుచున్నారు అంటే ఓ బ్రా హ్మణుడా! మీరు చమురు కొని తెచ్చినారు, అది తక్కువగా యున్నది, పూర్తిగా
ఇచ్చివేతుము పట్టు కు వెళ్ళండి అనగా, ఆ పలుకులు విని విప్రు డు వచ్చినాడు గదా! ఎప్పటివలె దుత్త భర్తీ అయినది.
అది చూచి తెలుకలవాని ముఖంలో ఆనందం చెప్పనలవి కాకుండా ఉంది. అప్పుడు కొలత పాత్ర పట్టు కుని
తెలుకలవాడు చమురు జాగ్రత్తగా కొలిచాడు. విప్రు డు గావంచాలో చమురు ఉంచెను. అది పట్టు కుని విప్రు డు
వెళ్లిపో యెను. విప్రు డు త్రినాధుల వద్దకేగి వారి దినుసులు ఇచ్చివేసి వారిని సెలవు అడిగెను. సెలవు అడుగగానే
త్రిమూర్తు లు విప్రు నితో ఏమన్నారంటే, ఓ ద్విజుడా నీ కష్టం చూచి మదిలో దయ కలిగినది. ఒక మాట వినుము, నీవు
త్రినాధుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాధులు చెప్పగా అది విని
విప్రు డు "స్వామీ ఏమి ద్రవ్యములతో మిమ్ములను పూజ చేయవలెను అనగా" త్రినాధులు ఇలా చెప్పుచున్నారు.
"ఓ ద్విజుడా! విను మా పూజకు అధిక వ్యయం అక్కరలేదు. కొంచెముతో తృప్తిపొందెదము. ఇప్పుడు నీవు తెచ్చిన
మూడు పైసలు ఖర్చు చాలును. త్రిమూర్తు ల ద్రవ్యము ఇంతే. మాకు చేయవలసనది, మూడు మట్టి పాత్రలు చేసి
రాత్రి తొలి జాములో నీ ఇంటి లోనికి స్నేహితులను పిలచి పూజాద్రవ్యములను తెచ్చి అచటవుంచి ఈ వ్రతం
చేయుము. నీ సకల పాపాలు హరించును.
అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించెను. గంజాయి
ముందుగా తయారుపరచెను. అప్పుడు త్రిమూర్తు లు సెలవు ఇచ్చినారు, నీవు ఆ గావంచా చెంగు చీరి వత్తు లు
చేయుము. అనగా ద్విజుడు చెప్పుచుండెను. నేను బీద బ్రా హ్మణుడను బిక్షమెత్తు కుని దినము గడుపుకుని కుటుంబ
పో షణ చేసికొనుచున్నాను. అన్నవస్త్రములకు కష్టపడుచున్నాను, దీపం ముట్టించుటకు అగ్నిలేదు. పైగా గావంచా
వత్తు లపాలయినది. కుటుంబం ఉపవాసంతో ఎదురు చూచుచుండగా నేను ఏ బుద్ధితో చేస్తా ను అని ఏవంగించుకుని
ద్విజుడు కూర్చొనెను. అది చూచి త్రిమూర్తు లు చెప్పచున్నారు. ఓ ద్విజుడా! మదిలో కించపడకు నీ ఆవు దూడ
దొరుకుతుంది. నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. వస్త్రములు కూడా దొరుకును అని త్రిమూర్తు లు చెప్పిరి.
అప్పుడు బ్రా హ్మణుడు చేతులు జోడించి స్వాములారా ఇటువంటి భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో?
స్వాముల వారికి ఐదు మేళాలు ఇస్తా ను. ఈ మాట సత్యమని చెప్పి గావంచా చింపి వత్తు లు వేసి తిరిగి బ్రా హ్మణుడు
చెప్పుచున్నాడు. దీపము వెలిగించుటకు అగ్ని లేదు నేనేమి చేయుదును అని అనగా త్రిమూర్తు లు చెప్పుచున్నారు.
ఓ బ్రా హ్మణుడా నీ నేత్రములు మూసుకోమనెను. అంతనా బ్రా హ్మణుడు నేత్రములు మూసుకొనగా అకస్మాత్తు గా
దీపం వెలిగింది. అదిచూచి బ్రా హ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించాడు. మేళ ఇచ్చి వేసి ఆనందముతో
బ్రా హ్మణుడు చేతులు జోడించి సాష్టా ంగ దండమొనర్చి త్రిమూర్తు ల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడచి
వెళ్లు చుండగా త్రో వలో ఆవును, దూడను చూచెను.
సంతోషించి త్రినాధుల వారు నా యందు దయవుంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ
బాగుగ చేసితిని అని భావించుకుని ఆవును, దూడను తోలుకుని ఇంటి వద్దకు చేరినారు. చూడగా తన ఇంటిలో ధన
సంపదలు సంపూర్ణమై వున్నవి. అది చూచి అధిక సంతోషం పొంది కడు శ్రద్ధ తో పూజ అర్పించెను. చేయవలసిన
కార్యక్రమములు అందరికి వివరంగా తెలియజేసెను. తన స్నేహితులను రప్పించి పూర్వమువలె మేళ సమర్పించెను.
మేళ యొక్క క్రమము అందరికి చెప్పగా అందరూ సంతోషించినారు. ఆ రాజ్యములో వున్నప్రజలందరు త్రినాథ పూజ
చేసి దరద్రు లుగా వున్నవారు కూడా కోటి సంపదలు గలవారయినారు. అందరి ఇండ్ల యందు సుఖసంతోషములు
నిండియుండెను. దాని వలన షావుకార్లు అందరి వ్యాపారాలు పడిపో యినవి. ఆ వ్యాపారులు అందరూ ఆ దేశపు రాజు
దగ్గరకు వెళ్లి మొర పెట్టు కున్నారు. రాజు వారిని చూచి అడిగినదేమనగా మీరందరు ఎందుకు వచ్చినారు? అని
అడుగగా "అయ్యా! మధుసూధనుడను బ్రా హ్మణుడు దరిద్రు డగుటచే బిక్షమెత్తు కుని జీవించేవాడు. శ్రీపురం వెళ్లి వచ్చి
త్రినాధ మేళాను ఆచరించెను. త్రినాధులు ఏమి దేవతలో వారిని బ్రా హ్మణుడు పూజించెను.
అతనికి సకల సంపదలు కలిగినవి. మన ఊరిలో ఉన్న రైతులు యావన్మంది ఈ త్రినాధ మేళా చేసారు. గ్రు డ్డి
వారు, కుంటివారు అందరూ కూడా మేళా చేసారు. అందరూ మోక్షం పొందారు. ధన ధాన్యాలు కలిగి కుబేరులతో
సమానం అయిపో యారు. అందువలన మా వ్యాపారాలు పో యినవి. క్రయవిక్రయాలు ఏలాగున జరుగుతాయి అని
చెప్పగా, రాజు విని చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపంగా ఇట్లు చెప్పెను. త్రినాధులు దేవతలా?
ఏమి దేవతలు? వారిని మీరు ఏల పూజ చేయుచున్నారు. నేను చెప్పుచుంటిని వినండి. ఆ పూజ మీరు
చేయకూడదు. అట్టి పూజ ఎవరు చేస్తా రో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదు
లో ఉండవలెను. అట్లు లేనియెడల శూలము వేయబడుదురు అని రాజు గారు తాఖీదు ఇచ్చి ప్రజలందరినీ
పంపించివేసెను.
ఈ సంగతి త్రినాధుల వారికి తెలిసి రాజుకు దండన విదించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు
మరణించెను. రాజుగారి నగరములో ఏడ్పు ఘోష వినిపించుచున్నది. ప్రజలు, రైతులు వగైరా జనులు విని రాజు
వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వలన అతని కుమారుడు చనిపో యినాడు అని అనుకుంటున్నారు.
కుమారుని ముఖం చూచుకొని రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారు దుఃఖించుచున్నారు. ఆ
కుమారుణ్ణి శ్మశానమునకు తీసుకుని వెళ్లి దహనం చేయుటకు స్వర్ణభద్రా నదీతీరమందు ఆ శవాన్నుంచినారు.
త్రినాథులకు దయ కలిగి ఈ రాజకుమారుని బ్రతికింతుమేని మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగా
అలోచించి బ్రా హ్మణ రూపంలో ఆ స్థలమునకు త్రినాధులు వచ్చినారు.
రాజుగారి జన సమూహం చూచి "మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చినారు? ఏల విచారంగా
కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకున్నాడు? ఇతని శరీరము లో ఎందుకు చలనం లేదు" అని అడుగగా,
త్రిమూర్తు లతో వారు ఇలా అన్నారు "మీతో ఏమి చెప్పగలము? ఈ రాజకుమారుడు చనిపో యెను" అని చెప్పిరి.
అప్పుడు త్రినాధులు చెప్పుచున్నారు. ఈ చిన్నవాడు చనిపో లేదు. త్రినాధులవారికి రాజు అపచారం చేసినందులకు
ఈ చావు కలిగింది. ఇప్పుడు మీరందరు త్రినాధులను భజించారంటే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మేళా
చేయుటకు రాజు ఒప్పుకున్నచో ఈ రాజపుత్రు డు బ్రతుకుతాడు. అని చెప్పి త్రిమూర్తు లు ఆదృశ్యులైనారు.
అంతా ఆ పలుకులు విని త్రినాధ స్వామి వారి పేరు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. రాజు ఏడు
మేళాలు చేయుటకు ఒప్పుకొనెను. ఒప్పుకొనగానే రాజతనయుడు లేచి కూర్చొనెను. అది చూచి అందరు సంతోషం
పొందినారు. అప్పుడు త్రిమూర్తు ల పేరును ప్రజలు మాటి మాటికి స్మరించినారు. అందరి నోటినుండి వచ్చిన
పలుకులు సముద్ర ఘోష వలే వినిపించుచున్నవి. అట్టి సమయంలో ఒక షావుకారు ఆ ఏరు మీదుగా ఒక ఓడను
తీసుకుని వెళ్ళుచుండెను. ఓడను నడిపించుకుని స్వర్ణభద్రా తీరమున ప్రవేశించెను. ఘోష చేసిన స్థలమునకు
బయలుదేరెను. అక్కడ వున్న వారిని చూచి "ఓ జనులారా! త్రినాధుల పేర్లు ఏమి? మీరు స్మరించుచున్నారు. కనుక
వినుటకు శ్రద్ధగా వున్నది". అనగా రాజుగారి మనుష్యులు ఇలా చెప్పుచున్నారు. ఓ వర్తకుడా! బ్రహ్మ, విష్షు ,
మహేశ్వరులు అనేవారే త్రినాధస్వాములు. అటువంటి ప్రభువులను మారాజు మరచినందున అపరాధుడు
అయినాడు. ఇతడు రాజుగారి కుమారుడు.
అపరాధము వలన చనిపో యిన ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చుని
ఉంటిమి. అదిచూచి ప్రభువులవారికి దయ కలిగెను. వచ్చి వీనిని బ్రతికించెను. అందుకు ఏడు మేళాలు చేయుటకు
ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చొనెను. ఈలాగున చెప్పగా షావుకారు మదిలో సంతోషించి
అటువంటి ప్రభువు ఎక్కడ ఉండునో చనిపో యిన రాజకుమారుని బ్రతికించినారు. నా ఏడు ఓడలు ఒడ్డు న వున్నవి.
నేను ఈ ఓడలపై వెళ్లివస్తా ను. ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు ఏ కష్టములు లేకపో యినట్లైన ప్రభువులవారికి
ఏడు మేళాలు చేస్తా ను. ఇట్లు మనస్సులో సంకల్పించుకుని ఓడపై కూర్చుని నడిపించుకుని వెళ్లిపో యెను. పై
దేశములు వెళ్లి అచట గొప్ప లాభములు పొంది తిరిగి వచ్చి ఓడను నది ఒడ్డు న లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు.
తన నౌకరులు అందరు ఓడలోని ధనమును మోసుకుని పో యినారు. ధనమును ఇంటిలో వేసుకుని ప్రభువుల వారి
మేళా మరచినాడు. అందువలన ప్రభువులవారికి కోపం కలిగి దండన చేసినారు. ఓడ నీటిలో మునిగిపొ యినది.
నౌకర్లు ఓడలోని వారందరు మునిగిపో యినారు. అది చూచి అతను కూలి భూమి పై పడి ఘోష పెట్టినాడు.
కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుచుండగా, ఆకాశం నుండి త్రినాధులు సెలవిచ్చుచున్నారు. " నీవు
మేళాలు ఇచ్చినావు కావు అందుచేత నీ ఓడ మునిగినది. నీవు మేళాలు సమర్పించినట్లైన నీ ఓడ
ప్రా ప్తమగుతుంది". అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసి యుంటిని, ప్రభవుల
మహిమ మరిచితిని, ఇప్పుడు త్రినాథ స్వామి వారికి మేళా చేస్తా ను. అని మదిలో నిశ్చయించి మేళాకు కావలసిన
సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రా ర్ధించెను. నీటిలో మునిగిన ఓడ
వెంటనే తేలినది. అది చూచి పట్టలేని సంతోషం పొందెను.
పరిచారికలు, నౌకర్లు ఓడలోని ధనమును తీసుకుని పో యిరి. ధనము మోయించి వేసి షావుకారు ఇంటిలో
ప్రవేశించెను. గంజాయి, ఆకులు, చెక్కలు అంతయూ స్వామివారికి మేళ సమర్పించి సాష్టా ంగ దండ ప్రణామంబున
వేడినారు. రాజ్యమంతయు ప్రకటన పంపినారు కనుక మేళా చూచుటకు అంతా వస్తు న్నారు. ఇట్టి స్థితి లో ఒక
గ్రు డ్డివాడు త్రో వన బో యే వారితో ఓరన్నా! మీరెవరు? మీపేరేమిటి? మీరు ఎక్కడకు వెళ్లు చున్నారు. అని
అడుగుచుండెను. దానికి వారు మేము త్రినాథ మేళ చూచుటకు వెళ్ళుచున్నాము అనెను. అది విని గ్రు డ్డివాడు నాకు
కన్నులు కానరావు, మీరంతా నేత్రములతో చూచుదురు. నేను ఎలా చూడగలను. అని చింతించెను. దానికి వారు
నీవు త్రినాధులను భజింపుము అని చెప్పి వారంతా కలిసి మేళ దగ్గరకు ప్రవేశించారు.
ఆలా గ్రు డ్డివాడు భజన చేయుచుండగా కొంచెము కనిపించెను. ఆలా కొంత దూరం నడచిపో యెను. దారిలో
ఒక చొట్టవాడు కూర్చుని ఉండి గ్రు డ్డి వాడిని చూచి ఇట్లు అడుగుచున్నాడు. చూడగా నీవు గ్రు డ్డివాడవు ఇంత
కష్టముతో ఎక్కడకు వెళ్లు చున్నావు అని అడిగితే, గ్రు డ్డివాడు చెప్పుచుండెను అన్నా! నేను మేళా చూచుటకు
వెళ్లు చున్నాను అనగా, చొట్టవాడు విని స్వాములవారికి దయలేదు చేతులు,కాళ్ళు కూడా చొట్ట నేనేలాగున
నడువగలను? నీకు కాళ్ళు వున్నాయి కనుక దేక్కుని అయినా వెళ్లగలవు. అంత గ్రు డ్డివాడు చెప్పుచున్నాడు నీవు
త్రినాధస్వాముల వారిని భజింపుము నీ చేతులు, కాళ్లు బాగవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపో దాము. త్రినాథ
స్వామి వారిని భజించావంటే నీ బాధ నివారణ చేస్తా రు అని చెప్పగా 'త్రినాథ' 'త్రినాథ' అని చొట్టవాడు భజించాడు. ఓ
గ్రు డ్డి అన్నా! నీకు కాళ్ళున్నవి నడువగలవు నేను ఎలా నడువగలను? నన్ను నీ భుజముపై కూర్చుండబెట్టు కొని
తీసుకుని వెళ్లు ము. నేను నీకు త్రో వ జూపుతూవుంటాను. నిశ్చితముగా ఇద్దరమూ వెళ్లిపో దాము అని చొట్టవాడు
చెప్పెను.
ఆ పలుకులు విని గ్రు డ్డివాడు చొట్టవానిని భుజములపై కూర్చుండబెట్టు కొని మెల్లగా నడుచుకుని
పో వుచుండెను. కొంతదూరము వెళ్లగా త్రో వలో ఆయాసముతో కూర్చుండెను. గ్రు డ్డివాడు చెప్పుచుండెను నేస్తం నా
నేత్రములు నిర్మలముగా కనిపించుచున్నవి అనగా, చొట్టవాడు చెప్పుచుండెను అయ్యా! నేనిపుడు నడచి
వెళ్ళగలను. అట్లు ఇద్దరు కలిసి త్రినాథ మేళ దగ్గరకు ప్రవేశించారు.
ఆ మేళా స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ యుండెను. అతడు మేళా పూర్తికాకుండా వెళుతూ
ఉండేవాడు. నిత్యమూ అదే మోస్తరుగా మేళా చెల్లకుండా వెళుతూ యుండేవాడు . మేళా దగ్గర ఉన్నవారందరూ కలసి
ఇలా అనుకున్నారు. ఈ పొ ద్దు న అతనిని మన స్థా నమందు కూర్చుండబెట్టవద్దు . అంతా వైష్ణవుని చూచి, నీవు మేళా
చెల్లకుండా వెళ్తు ంటావు కాబట్టి మేళా వద్దకు రాకుండా నిన్ను ఆపుచేయడమైనది. అని చెప్పగా వైష్ణవుడు
ఏమంటున్నాడనగా, నా అపరాధమునకు క్షమించండి. మేళ పూర్తి కాకుండా ఇక వెళ్ళను.
నేను నిజముగా చెప్పుచున్నాను. నా గురువు ఇచటకు వచ్చినాసరే విడిచి వెళ్లను అని అనెను.
దైవయోగమున ఆ దినము గురువు వైష్ణవుని ఇంటికి వచ్చెను. వైష్ణవుడు ఎక్కడకు వెళ్లెను? ఈ ప్రొ ద్దు అతను
కనిపించలేదు? అని శిష్యుని గురించి వైష్ణవుని తల్లిని అడిగెను. దానికి ఆమె నా కుమారుడు మేళా కు వెళ్ళినాడు
అని చెప్పగా, గురువు ఆ మేళ ఎవరిది? అని ఆడిగెను. అందుకామె అది త్రినాథ మేళా అని చెప్పినది. ఆ మాట విని
గురువు అక్కడకు వెళ్లి చూడగా అంతా త్రినాధస్వాములవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తు న్నారు. అది చూచి
గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమున సామాగ్రిని తన్నివేసెను. ఆ తరువాత వైష్ణవుని పై కోప్పడి
బరబరా లాక్కుని పో యెను. కొంతదూరము వెళ్లేసరికి బో రున వర్షం కురిసినది. కటిక చీకటి కావడం వలన నడిచే త్రో వ
కనిపించలేదు. గురు శిష్యులు చెల్లా చెదురై ఎలాగైతే గువువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా
అతని తల్లి ద్వారము వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి చూడగా! భార్య, కుమారుడు
చచ్చిపడియున్నారు.
అదిచూచి గురువు మూర్ఛపో యెను. శిష్యులు పట్టు కుని కూర్చండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి అయ్యా!
తమరు త్రినాధస్వామి వారి అపరాధులు. త్రినాథ మేళా పాడుచేసినారు. అందులకు ఇది ప్రతిఫలము. మీరు నిష్టతో
స్వామి వారి మేళా చేసిన ఎడల మీ భార్య, కుమారుడు బ్రతుకుతారు. అని శిష్యుడు చెప్పగా, గురువు ఆ మాటలు
విని ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనెను. అంతలో భార్య, కుమారుడు లేచికూర్చున్నారు.
త్రినాథ మేళా భగ్నము చేసినందువలన తగు శిక్ష జరిగినది. నేను మూర్ఖు డను, అధముడను, ప్రభువుల
వారి మహిమ తెలుసుకొనలేకపో తిని అని ప్రభువుల వారికి క్షమాపణ చేసి మేళాకు కావలసిన పదార్ధములు
యావత్తు తెప్పించి, అందరితో మేళా సమర్పించాడు. నూనె కాలడం చెల్లినది, ప్రభువుల వారి పూజ కావచ్చినది.
ఆకులు,వక్కలు,గంజాయి అందరూ పంచుకుని సేవించి సుఖాలు అనుభవించారు.
ఫలశృతి
ఈచరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠు వ్యాధి, గ్రు డ్డితనము కూడా లేక తరించిపో తారు. పుత్రు లు లేని స్త్రీలు
నిర్మలంగా వింటే పుత్రు లు పుడతారు. పురుషులు విన్న యెడల అన్నవస్త్రములు కలిగి సుఖపడతారు. ఎవరైనా
కొంటెగా హాస్యం చెప్పిన యెడల నడ్డితనము, గ్రు డ్డితనము, కలుగుతుంది. ముగ్గు రు త్రిమూర్తు లను మూడు
స్థలములందు వుంచి, ముందు విష్ణు వునకు చందనము,పువ్వులు తెచ్చి ముగ్గు రును వేరు వేరు గా
పూజించవలెను. నైవేద్యం సమర్పించి గంజాయి లో అగ్ని వేయవలెను. తాంబూలము మూడు భాగములుగా చేసి
త్రిమూర్తు ల ఎదుట యుంచవలెను. మూడు దీపములను వెలిగించి "త్రిమూర్తు లారా! దయచేయండి" అని
అనవలెను. అంత సమర్పించి త్రినాధస్వామి వారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో
కూర్చుని కథ వినవలెను. ప్రసాదమును అందరూ సేవించవలెను.
ఈ విధముగా త్రినాధులను పూజించి తరించండి. ఇటుల ఈ కథ నేత్రదాసు చెప్పియున్నారు.
మంగళ హారతి
శ్లో " మంగళం భగవాన్ విష్ణు ం మంగళం మధుసూదనమ్
మంగళం పుండరీకాక్ష మంగళం గరుడ ధ్వజ
నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే
సుభద్రా ప్రా ణ నాథాయ శ్రీనివాసాయ మంగళం
దత్తా త్రేయాయ పూజ్యాయ శ్రీ త్రినాధాయ మంగళం “
త్రినాథ మేళా సమాప్తం
వాసు & గాయత్రి VASU & GAYATRI

More Related Content

What's hot

Gujarat
Gujarat Gujarat
Gujarat
Vyoma Jain
 
Folklore of rajasthan
Folklore of rajasthanFolklore of rajasthan
Folklore of rajasthan
Ayushi Rajput
 
Dance forms of chhattisgarh
Dance forms of chhattisgarhDance forms of chhattisgarh
Dance forms of chhattisgarh
Kuldeep Singh
 
Nitya pooja vidhanam
Nitya pooja vidhanamNitya pooja vidhanam
Nitya pooja vidhanam
Dr P.V.Gopi Krishna Rao
 
Costumes of Chhattisgarh
Costumes of ChhattisgarhCostumes of Chhattisgarh
Costumes of Chhattisgarh
Visual Design Solution
 
Maharashtra gateway to india presentation
Maharashtra gateway to india  presentationMaharashtra gateway to india  presentation
Maharashtra gateway to india presentation
Rajat Sharma
 
Chhattisgarh State by Akshay SIkarwar
Chhattisgarh State by Akshay SIkarwarChhattisgarh State by Akshay SIkarwar
Chhattisgarh State by Akshay SIkarwar
Akshay Sikarwar
 
Maharashtra
 Maharashtra Maharashtra
Maharashtra
Ishu Goyal
 
Uttarakhand culture-ppt
Uttarakhand culture-pptUttarakhand culture-ppt
Uttarakhand culture-ppt
StupidityStudy
 
BAISAKHI.pptx
BAISAKHI.pptxBAISAKHI.pptx
BAISAKHI.pptx
Matrix Classes
 
Meghalaya - Abode Of Clouds.pptx
Meghalaya - Abode Of Clouds.pptxMeghalaya - Abode Of Clouds.pptx
Meghalaya - Abode Of Clouds.pptx
Siddharth Kori
 
West India
West IndiaWest India
West India
KrishivShah1
 
Sanatana Dharma
Sanatana DharmaSanatana Dharma
Sanatana Dharma
Dokka Srinivasu
 
Architecture In Heritage Places Of Odisha And Maharashtra | Art Integrated Pr...
Architecture In Heritage Places Of Odisha And Maharashtra | Art Integrated Pr...Architecture In Heritage Places Of Odisha And Maharashtra | Art Integrated Pr...
Architecture In Heritage Places Of Odisha And Maharashtra | Art Integrated Pr...
PritamPriyambadSahoo
 
Ncert books class 7 hindi
Ncert books class 7 hindiNcert books class 7 hindi
Ncert books class 7 hindi
Sonam Sharma
 
Tribal Life in Odisha, Nagaland and Arunachal Pradesh in India
Tribal Life in Odisha, Nagaland and Arunachal Pradesh in IndiaTribal Life in Odisha, Nagaland and Arunachal Pradesh in India
Tribal Life in Odisha, Nagaland and Arunachal Pradesh in India
State Express
 

What's hot (20)

Gujarat
Gujarat Gujarat
Gujarat
 
Folklore of rajasthan
Folklore of rajasthanFolklore of rajasthan
Folklore of rajasthan
 
Dance forms of chhattisgarh
Dance forms of chhattisgarhDance forms of chhattisgarh
Dance forms of chhattisgarh
 
Nitya pooja vidhanam
Nitya pooja vidhanamNitya pooja vidhanam
Nitya pooja vidhanam
 
Costumes of Chhattisgarh
Costumes of ChhattisgarhCostumes of Chhattisgarh
Costumes of Chhattisgarh
 
Maharashtra gateway to india presentation
Maharashtra gateway to india  presentationMaharashtra gateway to india  presentation
Maharashtra gateway to india presentation
 
Chhattisgarh State by Akshay SIkarwar
Chhattisgarh State by Akshay SIkarwarChhattisgarh State by Akshay SIkarwar
Chhattisgarh State by Akshay SIkarwar
 
Maharashtra
 Maharashtra Maharashtra
Maharashtra
 
Uttarakhand culture-ppt
Uttarakhand culture-pptUttarakhand culture-ppt
Uttarakhand culture-ppt
 
BAISAKHI.pptx
BAISAKHI.pptxBAISAKHI.pptx
BAISAKHI.pptx
 
36975684 ppt-new
36975684 ppt-new36975684 ppt-new
36975684 ppt-new
 
Arunachal pradesh
Arunachal pradeshArunachal pradesh
Arunachal pradesh
 
Meghalaya - Abode Of Clouds.pptx
Meghalaya - Abode Of Clouds.pptxMeghalaya - Abode Of Clouds.pptx
Meghalaya - Abode Of Clouds.pptx
 
West India
West IndiaWest India
West India
 
Sanatana Dharma
Sanatana DharmaSanatana Dharma
Sanatana Dharma
 
Architecture In Heritage Places Of Odisha And Maharashtra | Art Integrated Pr...
Architecture In Heritage Places Of Odisha And Maharashtra | Art Integrated Pr...Architecture In Heritage Places Of Odisha And Maharashtra | Art Integrated Pr...
Architecture In Heritage Places Of Odisha And Maharashtra | Art Integrated Pr...
 
Ncert books class 7 hindi
Ncert books class 7 hindiNcert books class 7 hindi
Ncert books class 7 hindi
 
Arunachal 1
Arunachal 1Arunachal 1
Arunachal 1
 
Tribal Life in Odisha, Nagaland and Arunachal Pradesh in India
Tribal Life in Odisha, Nagaland and Arunachal Pradesh in IndiaTribal Life in Odisha, Nagaland and Arunachal Pradesh in India
Tribal Life in Odisha, Nagaland and Arunachal Pradesh in India
 
Flora & fauna
Flora & faunaFlora & fauna
Flora & fauna
 

Similar to శ్రీ త్రినాథ వ్రతకల్పము కొత్త సంపుటి - Sri trinadha mela updated version

మణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdfమణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdf
ProfRaviShankar
 
మణిద్వీప వర్ణన
మణిద్వీప వర్ణనమణిద్వీప వర్ణన
మణిద్వీప వర్ణనSrikanth Poolla
 
Sree vaibhava lakshmi pooja vidhanam in telugu
Sree vaibhava lakshmi pooja vidhanam in teluguSree vaibhava lakshmi pooja vidhanam in telugu
Sree vaibhava lakshmi pooja vidhanam in telugu
Raghunnath T Ravipati
 
Te the art_of_dawa
Te the art_of_dawaTe the art_of_dawa
Te the art_of_dawaTeacher
 
ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి
sumanwww
 
Songs Lyrics A 2 Z.pdf
Songs Lyrics A 2 Z.pdfSongs Lyrics A 2 Z.pdf
Songs Lyrics A 2 Z.pdf
Tv4Live
 
Compositions of syama Sastri Telugu pdf with bookmarks
Compositions of syama Sastri Telugu pdf with bookmarksCompositions of syama Sastri Telugu pdf with bookmarks
Compositions of syama Sastri Telugu pdf with bookmarks
seetaramanath mahabhashyam
 
Telugu - The Protevangelion.pdf
Telugu - The Protevangelion.pdfTelugu - The Protevangelion.pdf
Telugu - The Protevangelion.pdf
Filipino Tracts and Literature Society Inc.
 
Bharat Darshan.pptx
Bharat Darshan.pptxBharat Darshan.pptx
Bharat Darshan.pptx
kishorereddy_btech
 

Similar to శ్రీ త్రినాథ వ్రతకల్పము కొత్త సంపుటి - Sri trinadha mela updated version (9)

మణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdfమణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdf
 
మణిద్వీప వర్ణన
మణిద్వీప వర్ణనమణిద్వీప వర్ణన
మణిద్వీప వర్ణన
 
Sree vaibhava lakshmi pooja vidhanam in telugu
Sree vaibhava lakshmi pooja vidhanam in teluguSree vaibhava lakshmi pooja vidhanam in telugu
Sree vaibhava lakshmi pooja vidhanam in telugu
 
Te the art_of_dawa
Te the art_of_dawaTe the art_of_dawa
Te the art_of_dawa
 
ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి
 
Songs Lyrics A 2 Z.pdf
Songs Lyrics A 2 Z.pdfSongs Lyrics A 2 Z.pdf
Songs Lyrics A 2 Z.pdf
 
Compositions of syama Sastri Telugu pdf with bookmarks
Compositions of syama Sastri Telugu pdf with bookmarksCompositions of syama Sastri Telugu pdf with bookmarks
Compositions of syama Sastri Telugu pdf with bookmarks
 
Telugu - The Protevangelion.pdf
Telugu - The Protevangelion.pdfTelugu - The Protevangelion.pdf
Telugu - The Protevangelion.pdf
 
Bharat Darshan.pptx
Bharat Darshan.pptxBharat Darshan.pptx
Bharat Darshan.pptx
 

శ్రీ త్రినాథ వ్రతకల్పము కొత్త సంపుటి - Sri trinadha mela updated version

  • 1. శ్రీ రస్థు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ త్రినాథ వ్రతము శ్రీ త్రినాథ వ్రతకల్పము పీ|| చిననాటి నుండియు సిరియున నెరుగని బీదబాపడొకడు పెరుగు చుండె వాని ప్రా ర్ధన దగుదానిగా గొనియెంచి కురచయై చెలగాడు గోవునందు యజమాని వెలయగాంచె; బ్రహ్మ, విష్ణు , మహేశ్వరులనొక చోట గీ || వారినధిక కొలిచి - వరలెనపుడు - అష్టభోగములంది యవని వీడె పూత చరితుడౌ తలచి భూజనులను వారి పూజించి భక్తితో జరుపవలయు. ప్రా ర్ధన:- శుక్లా ం బరధరం విష్ణు ం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని దైవ ప్రా ర్థన చేసి ఆచమనము జరుపవలెను.
  • 2. ఆచమ్య కేశవ నామములు ఓం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దా య నమః పురుషో త్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్ధనాయ నమః ఉపేంద్రా య నమః హరయే నమః శ్రీ కృష్ణా య నమః శ్రీ త్రినాధ అష్టో త్తర శతనామావళి ఓం భూతాత్మనాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం పురుషాయ నమః ఓం చరమాయ నమః ఓం జలాయ నమః ఓం భూతకృతే నమః ఓం శర్వాయ నమః ఓం చరణాయ నమః ఓం ముకుందాయ నమః ఓం అమేయాత్మనే నమః ఓం మంత్రా య నమః ఓం నిధయే నమః ఓం ఆర్యాయ నమః ఓం ధ్వనియే నమః ఓం కృతయే నమః ఓం ఈశాయ నమః ఓం తేజసే నమః ఓం గతయే నమః ఓం బలాయ నమః ఓం అజాయ నమః ఓం ఫణినే నమః ఓం యోగాయ నమః ఓం ఉదగ్రా య నమః ఓం దీర్ఘా య నమః ఓం సుదీర్ఘా య నమః ఓం అవిఘ్నాయ నమః ఓం ప్రా ణదాయ నమః ఓం పునర్వసే నమః ఓం మాధవాయ నమః ఓం వహాయ నమః ఓం సిద్దయే నమః ఓం శ్రీబలాయ నమః ఓం వామనాయ నమః ఓం హంసాయ నమః ఓం బలినే నమః ఓం కరాళినే నమః ఓం గురవే నమః ఓం ఆగమాయ నమః ఓం అలభ్యాయ నమః ఓం బుధయే నమః ఓం వరదాయ నమః ఓం సుఫలలాయ నమః ఓం భావనే నమః ఓం శశిబింబాయ నమః ఓం పవనయా నమః ఓం ఖగాయ నమః ఓం సర్వవ్యాపినే నమః ఓం కామాయ నమః ఓం అనాశకాయ నమః ఓం పవిత్రా య నమః ఓం అనిమిషాయ నమః ఓం పవిత్ర నమః ఓం విక్రమణే నమః ఓం మహేశాయ నమః ఓం దేవాయ నమః ఓం అనంతాయ నమః ఓం మోదనే నమః ఓం భిక్షయే నమః ఓం తారాయ నమః ఓం హంసాయ నమః ఓం నీలాయ నమః ఓం ఆదిదేవాయ నమః ఓం శరభాయ నమః ఓం హరాయ నమః ఓం భాగినే నమః ఓం అచలాయ నమః ఓం శూరాయ నమః ఓం అర్చితాయ నమః ఓం శౌర్యాయ నమః ఓం కుంభవే నమః ఓం నయాయ నమః ఓం తరవే నమః ఓం భీమాయ నమః ఓం గళాయ నమః ఓం కపిలాయ నమః ఓం లోహితాయ నమః ఓం విభవే నమః ఓం మాయాయ నమః ఓం ధేనవే నమః ఓం వేదాంగాయ నమః ఓం వాయనాయ నమః ఓం సేవ్యాయ నమః ఓం వంధ్యాయ నమః ఓం దయనీయాయ నమః ఓం తుష్ఠా య నమః ఓం బంధనాయ నమః ఓం హరయే నమః ఓం అనసూయాయ నమః ఓం బీజాయ నమః ఓం అంజితాయ నమః ఓం బలవంతే నమః ఓం మహాదేవాయ నమః ఓం సుఖదేవాయ నమః ఓం వత్సలాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం శ్రీ వత్సలాయ నమః ఓం దేవాది దేవాయ నమః ఓం రవణే నమః ఓం కురువాసినే నమః ఓం భోజనాయ నమః ఓం శయానందాయ నమః ఓం వరాయణాయ నమః ఓం హరిశాయినే నమః ఓం హనుమత్యెై నమః ఓం మహాదేవాయ నమః ఓం బ్రహ్మ రూపిణే నమః ఓం ప్రశాంత తనయే నమః ఓం త్రినాధాయ నమః
  • 3. త్రినాథ వ్రత కథా ప్రా రంభము భక్తు లారా మనస్సు నిర్మలంగా ఉంచి వినండి, త్రినాధుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతం వలె ఉండును. శ్రీపురం అను గ్రా మములో మధుసూధనుడు అను బ్రా హ్మణుడు ఉండెను. మిక్కిలి దరిద్రు డు అగుటచే బిక్షమెత్తు కుని జీవించేవాడు. ఆ బ్రా హ్మణుడకు ఒక కొడుకు జన్మించెను. తల్లి పాలు లేనందున పిల్లవాడు కృశించుచుండెను. బాలుడు కృశించుచున్నందువల్ల ఆ బ్రా హ్మణ స్త్రీ పెనిమిటి తో చెప్పిన సంగతి ఏమనగా అయ్యా నేను చెప్పిన సంగతి శ్రద్ధతో వినండి పిల్లవానికి పాలు నిమిత్తం పాలు గల ఆవునొకటి తీసుకునిరండి అని చెప్పగా, ఆ మాట భర్త విని ఏమి చెప్పుచున్నాడంటే "ఓ స్త్రీ రత్నమా! నీకు వెర్రి పట్టినదా మనము చూడగా బీదవారము, పాలు గల ఆవు ఏలాగున దొరుకుతుంది. ధన రత్నములు మనకు లేవు నేను లోకులలో గణ్యత ఎలా పొందుతాను? ఎవరికి ధనసంపదలు కలిగియుండునో వారికి లోకమంతా మర్యాదలు చేస్తా రు, వారికే అంతా భయపడతారు. నా వంటి బీదవాడిని ఎవరు అడుగుతారు? అని బ్రా హ్మణుడు చెప్పగా. భార్య మిగులు దుఃఖించినదై "ఓబ్రహ్మ దేవుడా మా వంటి బీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు? ఈ శిశు హత్య నాకు చుట్టు కుంటుంది అని దుఃఖించుచుండగా , ఆ పిల్లవాని ఘోష చూచి ఏమియు తోచక ఆ బాహ్మణుడు చింతాక్రా ంతుడై విచారించి తన ఇంటిలో వున్న కమండలం వగైరా చిల్లర సామానులు సంత లో అమ్మివేసి అమ్మిన సొ మ్ములో "యాబది రూపాయలు" జాగ్రత్తగా పట్టు కొచ్చి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొ మ్ముని పట్టు కుని సంతోషించి పెనిమిటిని చూచి అయ్యా! ఈ సొ మ్మును తీసుకుని వెళ్లి పాలుగల ఆవునొకటి తీసుకురండని చెప్పినది. తన భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రా హ్మణుడు ఆ రూపాయలు పట్టు కుని గ్రా మగ్రా మములు తిరిగెను. ఇట్లు తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారుండే గ్రా మమునకు వెళ్లెను, ధనధాన్యాలు కలిగి కుభేరునితో సరిసమానంగా ఆ షావుకారు ఉండెను. ఆవులు శాలలో నిండివుండెను. దైవ ఘటన మాత్రం వేరై వున్నది. తన ఆవులలో "బో దా" అను ఆవు ఉండెను, అది మిగులు దుష్టబుద్ధి గలది, పైకి మేతకు వెళితే పరుల వ్యవసాయం లో చొరబడి తినివేస్తు ండేది. ఒక దినము షావుకారు చూచుచుండగానే పేదవాని పొ లములో జొచ్చి తినివేయుచుండెను. అది చూచి ఆ షావుకారు అతి కోపముతో ఏమనుకున్నాడంటే "దీని ముఖం చూడకుండా ఈ ఆవుని ఇప్పుడే అమ్మివేస్తా ను, అది విలువగల ఆవు అయితే కాని ఈ దుష్టబుద్ధి గల ఆవును యాబది రూపాయలకే ఇచ్చివేస్తా ను" అని అనేసరికి మధుసూధనుడనే బ్రా హ్మణుడు ఆ మాటలు విని ఆ షావుకారితో ఇట్లనెను. ఓ షావుకారు! వినండి అది విలువగల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు, ఆ రూపాయలు నేను ఇచ్చివేస్తా ను ఆవును, దూడను రెండునూ ఇప్పించండి అని అనగానే, ఆ షావుకారు బ్రా హ్మణుడిని చూచి నీకు వెఱ్ఱిపట్టినదా! విలువగల ఆవును యాబది రూపాయలకు పట్టు కుని పో యెదవా? అని అనెను. మరలా మదిలో విచారించి, తెలియక అనివేసినాను, ఈ బ్రా హ్మణుడు ఎక్కడనుండి వింటున్నాడో, ఆ ఆవును ఇవ్వకపో తే నాకు అసత్యదోషము ప్రా ప్తించును అని బ్రా హ్మణునకు ఆవును, దూడను ఇచ్చివేయగా, బ్రా హ్మణుడు వాటిని తోలుకుని అచ్చటనుండి బయలుదేరి తన ఇంటికి చేరినాడు.
  • 4. ఆ ఆవుని చూడగానే బ్రా హ్మణ స్త్రీ కి చంద్రు ని చూచిన కలువ వలే సంతోషకరమైనది. వెంటనే పాలు పిండి తన కుమారునకు పో సి బహు సంతోషము పొందినది. ఇట్లు కొన్ని నెలలు పో యిన పిమ్మట ఆ ఆవు ఎటు పో యినదో కనిపించలేదు. పొ ద్దు పో యిన వేళాయెను. ఆవు రాకపో వటం చూచి బ్రా హ్మణుడు వెదకబో యెను, వీధులలో, సమీపమున యున్న వ్యవసాయ పొ లములలో చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవుని వెదకుటకై బయలుదేరి కొంత దూరం నడచి వెళ్లి త్రో వలో ఒక చెట్టు చూచెను. అది ఒక గొప్ప మఱ్ఱి చెట్టు . ఆ చెట్టు దగ్గరకు వెళ్లినాడు. ఆ చెట్టు సంగతి వినండి! ఆ చెట్టు పైన ముగ్గు రు మనుష్యులు కూర్చున్నారు. వారు ఎవరనగా బ్రహ్మ, విష్ణు , మహేశ్వరులు. వారే త్రిమూర్తు లు. అటువంటి చెట్టు క్రింద బ్రా హ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకుని పో వుచుండగా, త్రిమూర్తు లు బ్రా హ్మణుడిని పిలిచి "ఓ బ్రా హ్మణుడా! విను నీ మనస్సు లో ఎందుచేత దుఃఖము కలిగి ఉన్నావు? నీవు ఎక్కడకు వెళ్లు చున్నావు? ఆ సంగతి మాతో చెప్పమని" అడుగగా, బ్రా హ్మణుడు రెండు చేతులు జోడించి "అయ్యా! నేను మిక్కిలి బీదవాడను. భిక్షమెత్తు కుని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉండెను, అది కనిపించలేదు. ఈ దినం శ్రీపురం సంత అగుచున్నది. ఆ సంతకు పో యి వెదకెదను. ఎవరైనా దొంగిలించి తీసుకుపో యిన యెడల ఆ సంతలో అమ్ముతారు గదా! ఆ హేతువు చేతనే వెదుకుచున్నాను, ఓ త్రినాధస్వాములారా! అని తన వృత్తా ంతం చెప్పెను." అది విని బ్రా హ్మణునకు, త్రిమూర్తు లు ఏమి చెప్పుచున్నారంటే నీవు ఇపుడు సంతకు వెళ్లు చున్నావు గదా! మా నిమిత్తము ఏమైనా కొన్ని దినుసులు తీసుకొనిరాగలవా? అని త్రిమూర్తు లనిరి. బ్రా హ్మణుడు ఏమి దినుసులు కావలెనని అడుగగా త్రిమూర్తు లు ఇట్లనిరి. ఒక పైసా గంజాయి, ఒక పైసా ఆకు వక్కలు, ఒక పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి. అది విని బ్రా హ్మణుడు ఏమి చెప్పుచున్నాడు అంటే ఓ త్రిమూర్తు లారా! నాకు పైసలు ఎక్కడ దొరుకుచున్నవి? నేను బీద బ్రా హ్మణుడను, భిక్షమెత్తు కుని జీవించుచున్నాను. అనగా ఓ బ్రా హ్మణుడా! విను అదుగో అటుచూడు రెల్లు పొ ద కనిపించుచున్నది, దాని మొదలు మూడు పైసలున్నవి అనగా, ఆ పలుకులు విని బ్రా హ్మణుడు వెళ్లి రెల్లి పొ ద మొదలు చూసేసరికి మూడు పైసలున్నవి. ఇంకను వుండునేమోనని ఆ చెట్టు ను ఇంకనూ పైకి తీయుచుండెను. అది చూచి త్రినాధులవారు ఓ బ్రా హ్మణుడా! నీకు వెర్రి పట్టినదా! అందులో పైసలు లేవు ఎంత దొరికినదో అంతే ఉండును అనెను. ఆ పలుకులు విని బ్రా హ్మణుడు అచ్చటి నుండి వెళ్లిపో యెను. కొంత దూరం వెళ్లి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించెను. అది చూచి త్రిమూర్తు లు తిరిగి ఎందుకు వచ్చావు అని అడిగిరి. దానికి బ్రా హ్మణుడు మీరు చెప్పిన వస్తు వులు దేనిలో తేవలెను అని అడిగెను. దానికి త్రినాధులు నీ గావంచాలో తెమ్మని చెప్పిరి. అది విని బ్రా హ్మణుడు నూనె గావంచాలో ఎలా వస్తు ందండి? మీరు జగత్కర్తలు నా వద్ద కపటముంచి చెప్పుచున్నారు అనగా, త్రిమూర్తు లు మా నామము తలచుకుని నూనె గావంచాలో తీసుకురా అని చెప్పగా బ్రా హ్మణుడు సెలవు తీసుకుని అచ్చటి నుండి వెడలిపో యెను. ఆనందముతో బ్రా హ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు. ఆవులుండే సంతకు వెళ్లి చూడగా తన ఆవు కనిపించలేదు. ఆకులు, చెక్కలు, గంజాయి పుచ్చుకుని నూనె గురించి బజారుకు వెళ్లి తెలుకల వాడిని నూనె అడిగెను. గావంచా చూపి ఇందులో ఒక పైసా నూనె పో యమనెను. ఈ సంగతి తెలుకల వాడు చూచి బ్రా హ్మణుడు పిచ్చిమనిషి కాబో లునని నూనె లేదు అని చెప్పెను. అచట నుండి మరియొక ముసలి తెలుకల వాడిని నూనె అడిగెను. ఆ ముసలి వాడు చూచి దిగమట్టు నూనె ఎంతది కావలెను అని అడుగగా ఒక పైసా నూనె మాత్రం పట్టు కు పో వుదునని ఆ బ్రా హ్మణుడు చెప్పెను. తెలుకల వాడు నూనె కొలిచెను. బ్రా హ్మణుడు గావంచా చూపెను. తెలుకలవాడు ఈ బ్రా హ్మణుడు వికారపువాడు వీనిని
  • 5. మోసం చేసి పైసా తీసుకుంటాను అని ఆలోచించుకుని కొలత పాత్రను తిరగేసి నూనె కొలిచి ఇచ్చెను. విప్రు డు గావంచా కొనచెంగును పట్టు కుని అచటినుండి వెళ్లిపో యెను. తెలుకలవాడు సంతలో కూర్చుని ఉండెను. కుండలో నూనె కొంచెమైనా లేదు. అది చూచి తెలుకలవాడు మూర్చబో యెను. తెలుకల వాళ్ళందరూ వచ్చి ముఖం పై నీళ్లు చల్లి సేదతీర్చి కూర్చుండబెట్టిరి. అతనికి తెలివి రాగానే సంగతి ఏమని అడిగిరి. ఏమిచెప్పను? ఎక్కడినుండో బ్రా హ్మణుడు వచ్చి నూనె గిద్దెడు కొనెను, ఇప్పుడే అటు వెళ్లెను. కుండలో నూనె చూడగా లేదని చెప్పి అంతా వివరించెను. విప్రు డు ఒకాయన వచ్చి మమ్ము కూడా నూనె అడిగెను లేదని చెప్పగా వెళ్లిపో యెను. ఈలాగున అంతా వివరించగా, అందరూ విప్రు నివద్దకు పరిగెత్తు కుని వెళ్లి ఏమి చెప్పుచున్నారు అంటే ఓ బ్రా హ్మణుడా! మీరు చమురు కొని తెచ్చినారు, అది తక్కువగా యున్నది, పూర్తిగా ఇచ్చివేతుము పట్టు కు వెళ్ళండి అనగా, ఆ పలుకులు విని విప్రు డు వచ్చినాడు గదా! ఎప్పటివలె దుత్త భర్తీ అయినది. అది చూచి తెలుకలవాని ముఖంలో ఆనందం చెప్పనలవి కాకుండా ఉంది. అప్పుడు కొలత పాత్ర పట్టు కుని తెలుకలవాడు చమురు జాగ్రత్తగా కొలిచాడు. విప్రు డు గావంచాలో చమురు ఉంచెను. అది పట్టు కుని విప్రు డు వెళ్లిపో యెను. విప్రు డు త్రినాధుల వద్దకేగి వారి దినుసులు ఇచ్చివేసి వారిని సెలవు అడిగెను. సెలవు అడుగగానే త్రిమూర్తు లు విప్రు నితో ఏమన్నారంటే, ఓ ద్విజుడా నీ కష్టం చూచి మదిలో దయ కలిగినది. ఒక మాట వినుము, నీవు త్రినాధుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాధులు చెప్పగా అది విని విప్రు డు "స్వామీ ఏమి ద్రవ్యములతో మిమ్ములను పూజ చేయవలెను అనగా" త్రినాధులు ఇలా చెప్పుచున్నారు. "ఓ ద్విజుడా! విను మా పూజకు అధిక వ్యయం అక్కరలేదు. కొంచెముతో తృప్తిపొందెదము. ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసలు ఖర్చు చాలును. త్రిమూర్తు ల ద్రవ్యము ఇంతే. మాకు చేయవలసనది, మూడు మట్టి పాత్రలు చేసి రాత్రి తొలి జాములో నీ ఇంటి లోనికి స్నేహితులను పిలచి పూజాద్రవ్యములను తెచ్చి అచటవుంచి ఈ వ్రతం చేయుము. నీ సకల పాపాలు హరించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించెను. గంజాయి ముందుగా తయారుపరచెను. అప్పుడు త్రిమూర్తు లు సెలవు ఇచ్చినారు, నీవు ఆ గావంచా చెంగు చీరి వత్తు లు చేయుము. అనగా ద్విజుడు చెప్పుచుండెను. నేను బీద బ్రా హ్మణుడను బిక్షమెత్తు కుని దినము గడుపుకుని కుటుంబ పో షణ చేసికొనుచున్నాను. అన్నవస్త్రములకు కష్టపడుచున్నాను, దీపం ముట్టించుటకు అగ్నిలేదు. పైగా గావంచా వత్తు లపాలయినది. కుటుంబం ఉపవాసంతో ఎదురు చూచుచుండగా నేను ఏ బుద్ధితో చేస్తా ను అని ఏవంగించుకుని ద్విజుడు కూర్చొనెను. అది చూచి త్రిమూర్తు లు చెప్పచున్నారు. ఓ ద్విజుడా! మదిలో కించపడకు నీ ఆవు దూడ దొరుకుతుంది. నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. వస్త్రములు కూడా దొరుకును అని త్రిమూర్తు లు చెప్పిరి. అప్పుడు బ్రా హ్మణుడు చేతులు జోడించి స్వాములారా ఇటువంటి భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో? స్వాముల వారికి ఐదు మేళాలు ఇస్తా ను. ఈ మాట సత్యమని చెప్పి గావంచా చింపి వత్తు లు వేసి తిరిగి బ్రా హ్మణుడు చెప్పుచున్నాడు. దీపము వెలిగించుటకు అగ్ని లేదు నేనేమి చేయుదును అని అనగా త్రిమూర్తు లు చెప్పుచున్నారు. ఓ బ్రా హ్మణుడా నీ నేత్రములు మూసుకోమనెను. అంతనా బ్రా హ్మణుడు నేత్రములు మూసుకొనగా అకస్మాత్తు గా దీపం వెలిగింది. అదిచూచి బ్రా హ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించాడు. మేళ ఇచ్చి వేసి ఆనందముతో బ్రా హ్మణుడు చేతులు జోడించి సాష్టా ంగ దండమొనర్చి త్రిమూర్తు ల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడచి వెళ్లు చుండగా త్రో వలో ఆవును, దూడను చూచెను. సంతోషించి త్రినాధుల వారు నా యందు దయవుంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగ చేసితిని అని భావించుకుని ఆవును, దూడను తోలుకుని ఇంటి వద్దకు చేరినారు. చూడగా తన ఇంటిలో ధన సంపదలు సంపూర్ణమై వున్నవి. అది చూచి అధిక సంతోషం పొంది కడు శ్రద్ధ తో పూజ అర్పించెను. చేయవలసిన కార్యక్రమములు అందరికి వివరంగా తెలియజేసెను. తన స్నేహితులను రప్పించి పూర్వమువలె మేళ సమర్పించెను.
  • 6. మేళ యొక్క క్రమము అందరికి చెప్పగా అందరూ సంతోషించినారు. ఆ రాజ్యములో వున్నప్రజలందరు త్రినాథ పూజ చేసి దరద్రు లుగా వున్నవారు కూడా కోటి సంపదలు గలవారయినారు. అందరి ఇండ్ల యందు సుఖసంతోషములు నిండియుండెను. దాని వలన షావుకార్లు అందరి వ్యాపారాలు పడిపో యినవి. ఆ వ్యాపారులు అందరూ ఆ దేశపు రాజు దగ్గరకు వెళ్లి మొర పెట్టు కున్నారు. రాజు వారిని చూచి అడిగినదేమనగా మీరందరు ఎందుకు వచ్చినారు? అని అడుగగా "అయ్యా! మధుసూధనుడను బ్రా హ్మణుడు దరిద్రు డగుటచే బిక్షమెత్తు కుని జీవించేవాడు. శ్రీపురం వెళ్లి వచ్చి త్రినాధ మేళాను ఆచరించెను. త్రినాధులు ఏమి దేవతలో వారిని బ్రా హ్మణుడు పూజించెను. అతనికి సకల సంపదలు కలిగినవి. మన ఊరిలో ఉన్న రైతులు యావన్మంది ఈ త్రినాధ మేళా చేసారు. గ్రు డ్డి వారు, కుంటివారు అందరూ కూడా మేళా చేసారు. అందరూ మోక్షం పొందారు. ధన ధాన్యాలు కలిగి కుబేరులతో సమానం అయిపో యారు. అందువలన మా వ్యాపారాలు పో యినవి. క్రయవిక్రయాలు ఏలాగున జరుగుతాయి అని చెప్పగా, రాజు విని చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపంగా ఇట్లు చెప్పెను. త్రినాధులు దేవతలా? ఏమి దేవతలు? వారిని మీరు ఏల పూజ చేయుచున్నారు. నేను చెప్పుచుంటిని వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అట్టి పూజ ఎవరు చేస్తా రో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదు లో ఉండవలెను. అట్లు లేనియెడల శూలము వేయబడుదురు అని రాజు గారు తాఖీదు ఇచ్చి ప్రజలందరినీ పంపించివేసెను. ఈ సంగతి త్రినాధుల వారికి తెలిసి రాజుకు దండన విదించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు మరణించెను. రాజుగారి నగరములో ఏడ్పు ఘోష వినిపించుచున్నది. ప్రజలు, రైతులు వగైరా జనులు విని రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వలన అతని కుమారుడు చనిపో యినాడు అని అనుకుంటున్నారు. కుమారుని ముఖం చూచుకొని రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారు దుఃఖించుచున్నారు. ఆ కుమారుణ్ణి శ్మశానమునకు తీసుకుని వెళ్లి దహనం చేయుటకు స్వర్ణభద్రా నదీతీరమందు ఆ శవాన్నుంచినారు. త్రినాథులకు దయ కలిగి ఈ రాజకుమారుని బ్రతికింతుమేని మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగా అలోచించి బ్రా హ్మణ రూపంలో ఆ స్థలమునకు త్రినాధులు వచ్చినారు. రాజుగారి జన సమూహం చూచి "మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చినారు? ఏల విచారంగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకున్నాడు? ఇతని శరీరము లో ఎందుకు చలనం లేదు" అని అడుగగా, త్రిమూర్తు లతో వారు ఇలా అన్నారు "మీతో ఏమి చెప్పగలము? ఈ రాజకుమారుడు చనిపో యెను" అని చెప్పిరి. అప్పుడు త్రినాధులు చెప్పుచున్నారు. ఈ చిన్నవాడు చనిపో లేదు. త్రినాధులవారికి రాజు అపచారం చేసినందులకు ఈ చావు కలిగింది. ఇప్పుడు మీరందరు త్రినాధులను భజించారంటే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నచో ఈ రాజపుత్రు డు బ్రతుకుతాడు. అని చెప్పి త్రిమూర్తు లు ఆదృశ్యులైనారు. అంతా ఆ పలుకులు విని త్రినాధ స్వామి వారి పేరు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. రాజు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకొనెను. ఒప్పుకొనగానే రాజతనయుడు లేచి కూర్చొనెను. అది చూచి అందరు సంతోషం పొందినారు. అప్పుడు త్రిమూర్తు ల పేరును ప్రజలు మాటి మాటికి స్మరించినారు. అందరి నోటినుండి వచ్చిన పలుకులు సముద్ర ఘోష వలే వినిపించుచున్నవి. అట్టి సమయంలో ఒక షావుకారు ఆ ఏరు మీదుగా ఒక ఓడను తీసుకుని వెళ్ళుచుండెను. ఓడను నడిపించుకుని స్వర్ణభద్రా తీరమున ప్రవేశించెను. ఘోష చేసిన స్థలమునకు బయలుదేరెను. అక్కడ వున్న వారిని చూచి "ఓ జనులారా! త్రినాధుల పేర్లు ఏమి? మీరు స్మరించుచున్నారు. కనుక వినుటకు శ్రద్ధగా వున్నది". అనగా రాజుగారి మనుష్యులు ఇలా చెప్పుచున్నారు. ఓ వర్తకుడా! బ్రహ్మ, విష్షు , మహేశ్వరులు అనేవారే త్రినాధస్వాములు. అటువంటి ప్రభువులను మారాజు మరచినందున అపరాధుడు అయినాడు. ఇతడు రాజుగారి కుమారుడు.
  • 7. అపరాధము వలన చనిపో యిన ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చుని ఉంటిమి. అదిచూచి ప్రభువులవారికి దయ కలిగెను. వచ్చి వీనిని బ్రతికించెను. అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చొనెను. ఈలాగున చెప్పగా షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువు ఎక్కడ ఉండునో చనిపో యిన రాజకుమారుని బ్రతికించినారు. నా ఏడు ఓడలు ఒడ్డు న వున్నవి. నేను ఈ ఓడలపై వెళ్లివస్తా ను. ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు ఏ కష్టములు లేకపో యినట్లైన ప్రభువులవారికి ఏడు మేళాలు చేస్తా ను. ఇట్లు మనస్సులో సంకల్పించుకుని ఓడపై కూర్చుని నడిపించుకుని వెళ్లిపో యెను. పై దేశములు వెళ్లి అచట గొప్ప లాభములు పొంది తిరిగి వచ్చి ఓడను నది ఒడ్డు న లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకరులు అందరు ఓడలోని ధనమును మోసుకుని పో యినారు. ధనమును ఇంటిలో వేసుకుని ప్రభువుల వారి మేళా మరచినాడు. అందువలన ప్రభువులవారికి కోపం కలిగి దండన చేసినారు. ఓడ నీటిలో మునిగిపొ యినది. నౌకర్లు ఓడలోని వారందరు మునిగిపో యినారు. అది చూచి అతను కూలి భూమి పై పడి ఘోష పెట్టినాడు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుచుండగా, ఆకాశం నుండి త్రినాధులు సెలవిచ్చుచున్నారు. " నీవు మేళాలు ఇచ్చినావు కావు అందుచేత నీ ఓడ మునిగినది. నీవు మేళాలు సమర్పించినట్లైన నీ ఓడ ప్రా ప్తమగుతుంది". అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసి యుంటిని, ప్రభవుల మహిమ మరిచితిని, ఇప్పుడు త్రినాథ స్వామి వారికి మేళా చేస్తా ను. అని మదిలో నిశ్చయించి మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రా ర్ధించెను. నీటిలో మునిగిన ఓడ వెంటనే తేలినది. అది చూచి పట్టలేని సంతోషం పొందెను. పరిచారికలు, నౌకర్లు ఓడలోని ధనమును తీసుకుని పో యిరి. ధనము మోయించి వేసి షావుకారు ఇంటిలో ప్రవేశించెను. గంజాయి, ఆకులు, చెక్కలు అంతయూ స్వామివారికి మేళ సమర్పించి సాష్టా ంగ దండ ప్రణామంబున వేడినారు. రాజ్యమంతయు ప్రకటన పంపినారు కనుక మేళా చూచుటకు అంతా వస్తు న్నారు. ఇట్టి స్థితి లో ఒక గ్రు డ్డివాడు త్రో వన బో యే వారితో ఓరన్నా! మీరెవరు? మీపేరేమిటి? మీరు ఎక్కడకు వెళ్లు చున్నారు. అని అడుగుచుండెను. దానికి వారు మేము త్రినాథ మేళ చూచుటకు వెళ్ళుచున్నాము అనెను. అది విని గ్రు డ్డివాడు నాకు కన్నులు కానరావు, మీరంతా నేత్రములతో చూచుదురు. నేను ఎలా చూడగలను. అని చింతించెను. దానికి వారు నీవు త్రినాధులను భజింపుము అని చెప్పి వారంతా కలిసి మేళ దగ్గరకు ప్రవేశించారు. ఆలా గ్రు డ్డివాడు భజన చేయుచుండగా కొంచెము కనిపించెను. ఆలా కొంత దూరం నడచిపో యెను. దారిలో ఒక చొట్టవాడు కూర్చుని ఉండి గ్రు డ్డి వాడిని చూచి ఇట్లు అడుగుచున్నాడు. చూడగా నీవు గ్రు డ్డివాడవు ఇంత కష్టముతో ఎక్కడకు వెళ్లు చున్నావు అని అడిగితే, గ్రు డ్డివాడు చెప్పుచుండెను అన్నా! నేను మేళా చూచుటకు వెళ్లు చున్నాను అనగా, చొట్టవాడు విని స్వాములవారికి దయలేదు చేతులు,కాళ్ళు కూడా చొట్ట నేనేలాగున నడువగలను? నీకు కాళ్ళు వున్నాయి కనుక దేక్కుని అయినా వెళ్లగలవు. అంత గ్రు డ్డివాడు చెప్పుచున్నాడు నీవు త్రినాధస్వాముల వారిని భజింపుము నీ చేతులు, కాళ్లు బాగవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపో దాము. త్రినాథ స్వామి వారిని భజించావంటే నీ బాధ నివారణ చేస్తా రు అని చెప్పగా 'త్రినాథ' 'త్రినాథ' అని చొట్టవాడు భజించాడు. ఓ గ్రు డ్డి అన్నా! నీకు కాళ్ళున్నవి నడువగలవు నేను ఎలా నడువగలను? నన్ను నీ భుజముపై కూర్చుండబెట్టు కొని తీసుకుని వెళ్లు ము. నేను నీకు త్రో వ జూపుతూవుంటాను. నిశ్చితముగా ఇద్దరమూ వెళ్లిపో దాము అని చొట్టవాడు చెప్పెను. ఆ పలుకులు విని గ్రు డ్డివాడు చొట్టవానిని భుజములపై కూర్చుండబెట్టు కొని మెల్లగా నడుచుకుని పో వుచుండెను. కొంతదూరము వెళ్లగా త్రో వలో ఆయాసముతో కూర్చుండెను. గ్రు డ్డివాడు చెప్పుచుండెను నేస్తం నా నేత్రములు నిర్మలముగా కనిపించుచున్నవి అనగా, చొట్టవాడు చెప్పుచుండెను అయ్యా! నేనిపుడు నడచి వెళ్ళగలను. అట్లు ఇద్దరు కలిసి త్రినాథ మేళ దగ్గరకు ప్రవేశించారు.
  • 8. ఆ మేళా స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ యుండెను. అతడు మేళా పూర్తికాకుండా వెళుతూ ఉండేవాడు. నిత్యమూ అదే మోస్తరుగా మేళా చెల్లకుండా వెళుతూ యుండేవాడు . మేళా దగ్గర ఉన్నవారందరూ కలసి ఇలా అనుకున్నారు. ఈ పొ ద్దు న అతనిని మన స్థా నమందు కూర్చుండబెట్టవద్దు . అంతా వైష్ణవుని చూచి, నీవు మేళా చెల్లకుండా వెళ్తు ంటావు కాబట్టి మేళా వద్దకు రాకుండా నిన్ను ఆపుచేయడమైనది. అని చెప్పగా వైష్ణవుడు ఏమంటున్నాడనగా, నా అపరాధమునకు క్షమించండి. మేళ పూర్తి కాకుండా ఇక వెళ్ళను. నేను నిజముగా చెప్పుచున్నాను. నా గురువు ఇచటకు వచ్చినాసరే విడిచి వెళ్లను అని అనెను. దైవయోగమున ఆ దినము గురువు వైష్ణవుని ఇంటికి వచ్చెను. వైష్ణవుడు ఎక్కడకు వెళ్లెను? ఈ ప్రొ ద్దు అతను కనిపించలేదు? అని శిష్యుని గురించి వైష్ణవుని తల్లిని అడిగెను. దానికి ఆమె నా కుమారుడు మేళా కు వెళ్ళినాడు అని చెప్పగా, గురువు ఆ మేళ ఎవరిది? అని ఆడిగెను. అందుకామె అది త్రినాథ మేళా అని చెప్పినది. ఆ మాట విని గురువు అక్కడకు వెళ్లి చూడగా అంతా త్రినాధస్వాములవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తు న్నారు. అది చూచి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమున సామాగ్రిని తన్నివేసెను. ఆ తరువాత వైష్ణవుని పై కోప్పడి బరబరా లాక్కుని పో యెను. కొంతదూరము వెళ్లేసరికి బో రున వర్షం కురిసినది. కటిక చీకటి కావడం వలన నడిచే త్రో వ కనిపించలేదు. గురు శిష్యులు చెల్లా చెదురై ఎలాగైతే గువువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి ద్వారము వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి చూడగా! భార్య, కుమారుడు చచ్చిపడియున్నారు. అదిచూచి గురువు మూర్ఛపో యెను. శిష్యులు పట్టు కుని కూర్చండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి అయ్యా! తమరు త్రినాధస్వామి వారి అపరాధులు. త్రినాథ మేళా పాడుచేసినారు. అందులకు ఇది ప్రతిఫలము. మీరు నిష్టతో స్వామి వారి మేళా చేసిన ఎడల మీ భార్య, కుమారుడు బ్రతుకుతారు. అని శిష్యుడు చెప్పగా, గురువు ఆ మాటలు విని ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనెను. అంతలో భార్య, కుమారుడు లేచికూర్చున్నారు. త్రినాథ మేళా భగ్నము చేసినందువలన తగు శిక్ష జరిగినది. నేను మూర్ఖు డను, అధముడను, ప్రభువుల వారి మహిమ తెలుసుకొనలేకపో తిని అని ప్రభువుల వారికి క్షమాపణ చేసి మేళాకు కావలసిన పదార్ధములు యావత్తు తెప్పించి, అందరితో మేళా సమర్పించాడు. నూనె కాలడం చెల్లినది, ప్రభువుల వారి పూజ కావచ్చినది. ఆకులు,వక్కలు,గంజాయి అందరూ పంచుకుని సేవించి సుఖాలు అనుభవించారు. ఫలశృతి ఈచరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠు వ్యాధి, గ్రు డ్డితనము కూడా లేక తరించిపో తారు. పుత్రు లు లేని స్త్రీలు నిర్మలంగా వింటే పుత్రు లు పుడతారు. పురుషులు విన్న యెడల అన్నవస్త్రములు కలిగి సుఖపడతారు. ఎవరైనా కొంటెగా హాస్యం చెప్పిన యెడల నడ్డితనము, గ్రు డ్డితనము, కలుగుతుంది. ముగ్గు రు త్రిమూర్తు లను మూడు స్థలములందు వుంచి, ముందు విష్ణు వునకు చందనము,పువ్వులు తెచ్చి ముగ్గు రును వేరు వేరు గా పూజించవలెను. నైవేద్యం సమర్పించి గంజాయి లో అగ్ని వేయవలెను. తాంబూలము మూడు భాగములుగా చేసి త్రిమూర్తు ల ఎదుట యుంచవలెను. మూడు దీపములను వెలిగించి "త్రిమూర్తు లారా! దయచేయండి" అని అనవలెను. అంత సమర్పించి త్రినాధస్వామి వారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలెను. ప్రసాదమును అందరూ సేవించవలెను. ఈ విధముగా త్రినాధులను పూజించి తరించండి. ఇటుల ఈ కథ నేత్రదాసు చెప్పియున్నారు. మంగళ హారతి
  • 9. శ్లో " మంగళం భగవాన్ విష్ణు ం మంగళం మధుసూదనమ్ మంగళం పుండరీకాక్ష మంగళం గరుడ ధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రా ణ నాథాయ శ్రీనివాసాయ మంగళం దత్తా త్రేయాయ పూజ్యాయ శ్రీ త్రినాధాయ మంగళం “ త్రినాథ మేళా సమాప్తం వాసు & గాయత్రి VASU & GAYATRI