నిస్సీ - యెహోవా నిస్సీ ధ్వజము నీవే మా దేవా నిస్సీ - యెహోవా నిస్సీ నిజము నీ కృప నిరతం మధురం నిస్సీ - యెహోవా నిస్సీ 1) శ్రమలలో మా స్నేహితుడా సమరములలో ఆశ్రితుడా గాయ పడిన మనుజులకు సాయ పడిన సమరయుడా స్తోత్రము స్తుతి స్తోత్రము - 4 //నిస్సీ// 2) స్వజనులే నను విడచినను విజయ పథమున నడిపితివి కలతలే నను కమ్మినను కొలతలేని కృపనిచ్చితివి స్తోత్రము స్తుతి స్తోత్రము - 4 //నిస్సీ// 3) బంధకములను తెంచితివి అంధకారము తొలగించితివి చింతలెల్ల తీర్చితివి శాంతి మాలో కలిగించితివి స్తోత్రము స్తుతి స్తోత్రము - 4 //నిస్సీ//