నేలి నింగిలోనక్షత్రాల హంగులో, చల్లని వెన్నెల వెలుగులో విను వీదిన రెక్కలు విప్పి విహరించే విహంగం లోని అందాలు, రంగు రంగుల పక్షుల కల స్వనాలతో ఎగరడంలోని అందాలు,, కమలాలతో, కలువలతో అలరారే సరోవరాల నుండి సుగంధ సౌరభం దివ్యత్వం లోని అందాలు, పుష్పించే పుష్పముల సుగంధ భరిత రంగుల అందాలలో, సీతాకోకచిలకమ్మ వన్నెల రంగవల్లికలురెక్కలు విప్పి ఎగరడంలోని అందాలు, పసిపాపల బోసి నవ్వులోని అందాలు, అన్నింటికీ మించిన ఆధ్యాత్మిక మహోన్నత శిఖరంపై మానవ శారీరక, మానసిక, ఆత్మ వికాసానికి దోహదపరిచే వైజ్ఞానిక, సాహిత్య, కళ, శిల్పం, నాట్యం... ఇలా ఎన్నో అద్భుతావహ దివ్యత్వ మహత్వాన్ని అనుభవించగేలా అవగత పరిచే శివ సామ్రాజ్యములోని సాహితీ సంపద భౌతిక సంపదకన్నామిన్నగా ఉన్నాయని కొనియాడబడిన మహాగ్రంథము.ఇవి మన కోసం, మన సంక్షేమాన్ని కోరుతూ, మన మేలు కై పొందపరచబడినవి. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ఆచారాలు మరియు వాటి విలువలను తీర్చిదిద్దిన ఈ గ్రంథ సాహితీ సౌరభాన్ని కప్పురము వలె దశ దిశలకు వ్యాపింపఁ జేయ నైతిక, సామాజిక బాధ్యత పుస్తక ప్రియులందరి పైన యున్నది. సాహితీ చరిత్రలో తనదంటూ ఓ బంగారు పేజి ని సృష్టించుకున్న శివకిషన్ గారి రచనా శైలిలో పద సామర్థ్యము మాత్రమే కాదు, పలు సామాజిక అంశాలను కూడా, సున్నితముగా వివరిచటం లో అందవేసిన చేయి. సాహిత్య రంగము లో వారు చేస్తున్న కృషి ఎనలేనిది. వారిని ఎంత కొనియాడినా తక్కువే! ప్రత్యేక లక్షణాలతో కూడిన అలాంటి వ్యక్తి అరుదుగా సమాజంలో కనిపిస్తారు. ఇటువంటి ప్రముఖ సాహిత్య గ్రంథ కర్త కు సత్కరముతో గౌరవించే మా బాధ్యత మన అందరిది.